Krishna Mukunda Murari: దొరికిపోయిన హంతకుడు.. మురారి, కృష్ణకు బిగ్ షాక్.. అసలు ఏం జరిగిందో తెలిస్తే!
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఏం జరిగిందంటే:కృష్ణ, మురారి కాన్ఫిడెన్స్ చూసిన భవానీకి తనపై తనకే సందేహం వస్తుంది. నేనేమైనా తప్పు చేస్తున్నానా అనుకుంటుంది. కానీ, తర్వాత సమర్ధించుకుంటుంది. అనంతరం శకుంతల వచ్చి భవానీని ప్రాధేయపడినా ఆమె కృష్ణను క్షమించదు. ఇక, దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూసి కృష్ణకు డౌట్ వస్తుంది. కానీ, పొరపాటు అనుకుంటుంది. అనంతరం ముకుంద - మురారికి నలుగు పెట్టే కార్యక్రమం ఔట్ హౌస్‌లోనే చేస్తున్నట్లు చెప్పి భవానీ దేవి అందరికీ షాక్ ఇస్తుంది. అప్పుడు కృష్ణ బాధపడుతుండగా.. మురారి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు.

నలుగు మొదలు పెట్టారు:ముందుగా నిర్ణయించినట్లుగానే ఔట్ హౌస్‌లో ముకుందకు, ఇంట్లో మురారికి నలుగు పెట్టే కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆ సమయంలో కృష్ణ, శకుంతల కూడా ముకుంద దగ్గరే ఉంటారు. అప్పుడా పరిస్థితిని చూసి శకుంతల ఏడుపు మొదలు పెడుతుంది. దీంతో భవానీ 'శుభకార్యం జరుగుతుంటే ఎవరో పోయినట్లు ఆ ఏడుపు ఏంటి' అని తిడుతుంది. దీంతో శకుంతల సైలెంట్ అయిపోయింది. మరోవైపు, మురారికి కూడా నలుగు పెట్టడం మొదలు పెడతారు. అవన్నీ చూసి కృష్ణ బాధపడుతుంది. అలాగే, రేవతి వాళ్లు కూడా దిగాలుగా కనిపిస్తారు.
దొరికిపోయిన హంతకుడు:ముకుందకు భవానీనే ముందుగా నలుగు పెట్టాలని అడుగుతుంది. ఆ తర్వాత కృష్ణను కూడా పెట్టమంటుంది. అప్పుడామె ముందుకు వెళ్లగా.. 'కృష్ణకు ఇంకా నమ్మకం ఉందా' అని మనసులో అనుకుంటుంది. అంతలోనే మురారికి ఫోన్ వస్తుంది. ఆ వెంటనే ఔట్ హౌస్‌కు వెళ్లి పెద్దమ్మా 'శ్రీధర్‌ను ముగ్గురు, నలుగురు కలిసి చంపారని చెప్పారు కదా. అందులో ఒకడు దొరికాడని డిపార్ట్‌మెంట్ నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది' అని చెప్తాడు. దీంతో అక్కడున్న వాళ్లు షాక్ అవుతారు. అయినా మురారిని అక్కడి నుంచి వెళ్లేందుకు మాత్రం భవానీ ఒప్పుకోదు.

దేవ్‌కు చెప్పిన ముకుంద:మురారి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ముకుంద 'నువ్వు వద్దు.. మా అన్నయ్య వెళ్తాడులే' అంటుంది. కానీ మురారి మాత్రం 'లేదు ఇప్పటికే మా వల్ల దెబ్బలు తిన్నాడు. నేనే వెళ్తాను' అని చెప్తాడు. అప్పుడు భవానీ 'పట్టుకున్న వాడిని మన ఇంటికి తీసుకురమ్మను. పెళ్లి కొడుకును చేసిన తర్వాత పొలిమేర దాటకూడదు. వెళ్ళి మంగళస్నానాలు చేయించండి. అయినా ఇంకా ఎందుకు ఇదంతా' అని ప్రశ్నిస్తుంది. దీనికి మురారి అంటే ఇంకా ప్రూఫ్ కాలేదు కదా అంటుంది. ఆ వెంటనే ముకుంద.. దేవ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పగా అతడు కూడా టెన్షన్ పడతాడు.
ఎదురు తిరిగిన కోడలు:ఆ తర్వాత మురారి చెప్పడంతో వాళ్లు ఇంటికే తీసుకొస్తాం అంటారు. కానీ, ఎంత సేపటికీ రాకపోవడంతో మురారి వెళ్తానని చెప్తాడు. దీంతో భవానీ అడ్డుకోగా.. మురారి పట్టుబడతాడు. దీనికా ఆమె 'వాళ్లను రానివ్వు వస్తారు కదా. వాళ్లకు ఎదురు వెళ్ళి ఏం చేయాలని అనుకుంటున్నావు? ఒకవేళ కేసులో వాళ్లే దోషులని తేలితే ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో కృష్ణ 'అంటే ఏసీపీ సర్‌నే అనుమానిస్తున్నారా పెద్దత్తయ్య? నన్ను అవమానించండి, అనుమానించండి పడతాను. ఇలా నాకు అలవాటు అయిపోయింది' అంటుంది.
నాకు నచ్చడం లేదని:అనంతరం కృష్ణ 'ఏసీపీ సర్‌ను పిరికివాడిలా చూడటం నాకు నచ్చలేదు. మీరు వద్దు అని ఆపేస్తుంటే నాకు ఒకటి అర్థం అవుతుంది. మా చిన్నాన్న నిర్దోషి అని తెలిస్తే మీ మాట చెల్లదని భయంతో ఆపుతున్నారా' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో భవానీ కోపంగా 'ఏయ్.. ఏంటి నేను భయంతో ఇలా చేస్తున్నానా? చూశావా రేవతి నీ కోడలు కానీ కోడలు ఏం మాట్లాడుతుందో విన్నావా' అని అంటుంది. అంతలోనే కానిస్టేబుల్ ఆ దోషిని తీసుకుని వస్తాడు. అతడిని కొట్టి నిజం చెప్పించమని మురారికి కృష్ణ చెప్తుంది. అప్పుడతను నిజం చెప్పమని హెచ్చరిస్తాడు.
మురారి, కృష్ణకు షాక్:మురారి తన స్టైల్‌లో అడిగే సరికి అతడు నిజం చెప్తానని అంటాడు. అప్పుడు 'మా అన్న జైల్లో ఉంటాడు. మా అన్న నాతో మీ ఇంట్లో పెళ్లి ఆగిపోయేలా చేయమని చెప్పాడు. మా అన్నకి పెద్దపల్లి ప్రభాకర్ చెప్పాడంట' అని వివరిస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అది నమ్మక మురారి వాళ్లు ఇలా చెప్పమని ఎవరు చెప్పారు చెప్పమని రెట్టించి అడుగుతాడు. అప్పుడు కృష్ణ కూడా వీడు అబద్ధం చెప్తున్నాడు అనగానే భవానీ తిడుతుంది. అంతేకాదు, 'ఏమన్నావ్ నేను భయంతో ఇలా చేస్తున్నానా? ఇప్పుడు ఏం అంటావు. మురారి బతికే ఉన్నాడని ముకుంద చెప్తే తనను ఒక్కరూ కూడా అభినందించలేదు. నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను కూడా ఒక శత్రువుని చూసినట్టు చూశారు. కానీ నిన్ను మాత్రమే నేను జీవితంలో మర్చిపోను' అని ఫైర్ అయిపోతుంది.
దేవ్ ప్లాన్ చేయడంతో:అతడి మాటలు విన్న తర్వాత మురారి జైలుకు వెళ్లాలని అనుకుంటాడు. దీంతో భవానీ 'నిజం బయట పడితే ఇంకేంటి కనుక్కునేది? ఒకసారి నిన్ను చంపాలని చూశారు. చనిపోయి బతికిన నిన్ను మళ్ళీ వాళ్ల దగ్గరకు పంపే గుండె ధైర్యం నాకు లేదు. నిన్ను వాళ్ళు ఏదైనా చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పటితో ఈ పీడకల మర్చిపో' అని కృష్ణని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది. ఆ తర్వాత ఇదంతా దేవ్ చేసిన ప్లాన్ అని చూపిస్తారు. అనంతరం వచ్చి మంచోడిలా యాక్టింగ్ చేస్తుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











