Krishna Mukunda Murari: పరిమళ ఎంట్రీతో దొరికిన దొంగ.. నిజం ఒప్పుకున్న దేవ్.. కథలో ఊహించని ట్విస్ట్
ఎప్పటికప్పుడు కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శనివారం ఏం జరిగిందంటే:ముందుగా అనుకున్నట్లుగానే ముకుంద, మురారికి నలుగు పెట్టే కార్యక్రమం చేస్తుంటారు. అప్పుడే శ్రీధర్‌ను చంపిన నిందితుల్లో ఒకరు దొరికారని మురారికి పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ విషయాన్ని భవానీ దేవికి చెప్పగా.. ఆమె నమ్మదు. దీంతో ఆ నిందితుడిని అక్కడికే తీసుకు రమ్మని మురారి చెప్తాడు. అతడు వచ్చిన వెంటనే జైల్లో ఉన్న ప్రభాకర్ చెప్పడం వల్లే ఇలా చేశానని అబద్ధం చెప్తాడు. దీంతో మరోసారి మురారి, కృష్ణపై భవానీ ఓ రేంజ్‌లో సీరియస్ అయిపోతుంది. ఆ తర్వాత ఇదంతా దేవ్ ప్లాన్ ప్రకారం చేసిన డ్రామా అని చూపిస్తారు.

కృష్ణ డౌట్.. మురారి అలా:పెళ్లి జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో కృష్ణ ఏడుస్తూ వెళ్లిపోతుంటే మురారి పిలుస్తాడు. దీంతో కృష్ణ 'అసలు ఏం జరుగుతుంది ఏసీపీ సర్? మా చిన్నాన్న ఇదంతా ఎందుకు చేస్తాడు' అని అడుగుతుంది. దీనికి మురారి నువ్వు ఇదంతా నమ్ముతున్నావా అంటే లేదని చెప్తుంది. అప్పుడతను దీని వెనుక ఇంకెవరో ఉన్నారు వాళ్ళని మనం కనిపెట్టాలని అంటాడు. దీంతో కృష్ణ అంత అవసరం ఎవరికి ఉంది ముకుందకి తప్ప అనగా.. మురారి మాత్రం తనకి నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందే కానీ ఒకరిని చంపించాలని ఉండదని చెప్తాడు.
జైలుకు వెళ్లిపోయిన కృష్ణ:ఆ తర్వాత కృష్ణ 'జైలుకు వెళ్ళి చిన్నాన్నకు జరిగిన విషయం మొత్తం చెప్తా' అంటుంది. అంతలోనే మురారి రింగ్ విషయం ఏమైందోనని పోలీసులకి ఫోన్ చేసి అడుగుతాడు. దీంతో వాళ్లు అతడికి కొంత సమాచారం చెప్తారు. అనంతరం కృష్ణ జైలుకి వెళ్తుంది. పెద్దపల్లి ప్రభాకర్ తన చిన్నాన్న అని వాళ్లకు చెబుతుంది. దీంతో పోలీసు అధికారి 'అతను నిన్న ఎవరినో కొట్టాడు. క్రమశిక్షణ కింద వేరే సెల్‌లో వేశాము. ఇప్పుడు ఎవరూ కలవడానికి వీల్లేదు' అని చెప్తాడు. దీంతో కృష్ణ నిరాశగా ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే ముకుందకు మెహందీ పెడుతూ ఉంటారు.

కృష్ణ చనిపోతుందంటూ:కృష్ణ ఏడుస్తూ ఉండగా శకుంతల ఇంత మంది ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామని బాధపడుతుంది. మురారి కూడా అప్పుడే వస్తాడు. దీంతో ఆమె లగ్గం వద్దని చెప్పి వచ్చావా అని శకుంతల అడుగుతుంది. అప్పుడు కృష్ణ 'ఏంటి ఏసీపీ సర్ ఇలా వచ్చారు? చివరి సారి చూసి వెళ్దామని వచ్చారా' అని అడుగుతుంది. అప్పుడే రేవతి కూడా కృష్ణ దగ్గరకి వచ్చి వెళ్దాం రమ్మని పిలుస్తుంది. అంతేకాదు, 'నువ్వు నా కళ్లెదురే ఉండాలి. ఒంటరిగా ఉంటే ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని భయంగా ఉంది' అంటుంది. మురారి కూడా ఆమెకు ధైర్యం చెబుతాడు.
భవానీ గురించి ఆలోచన:కృష్ణ ఏడుస్తుండగా మురారి వచ్చి పెళ్లి అయిపోయినట్లు బాధపడుతున్నావు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు రేవతి 'అటు ఇటు అయితే నేను నీతోనే వచ్చేస్తాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. దేవుడు మనకు అన్యాయం చేయడు బాధపడొద్దు' అని ధైర్యం చెప్తుంది. తర్వాత కృష్ణ.. మురారిని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. మరోవైపు భవానీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మురారిని వదిలి కృష్ణ ఉంటుంది కానీ ముకుంద ఉండలేదు. నేను చేస్తుంది కరెక్ట్ అని మనసులో అనుకుంటుంది.

భవానీకి షాకిచ్చిన దేవ్:ముకుందను చూసి కృష్ణ ఏడుస్తుంటే మురారి వచ్చి ఓదార్చుతాడు. అప్పుడు అందరూ బాధపడతారు. రేవతి మాత్రం తన కొడుకు జీవితాన్ని ఏమీ చేయలేకపోతున్నా అని బాధ పడుతుంది. ఇదంతా విన్న దేవ్ 'మరి ఇంత జరుగుతుంటే నిలదీయాలి కదా' అంటాడు. ఆ వెంటనే భవానీ దగ్గరకు వెళ్లి.. మీరు చేస్తుంది తప్పు అంటాడు. అప్పుడామె సీరియస్ అవుతూ.. 'పోనీలే అని వదిలేస్తే నన్నే తప్పు పడుతున్నావా? నేను అన్ని ఆలోచించే చేస్తున్నా. నాలో లోపం ఉందని చెప్పిన నిన్ను ఇక్కడే షూట్ చేసి పారేసే దాన్ని ముకుంద అన్నవని వదిలేస్తున్నా' అంటుంది.
దేవ్‌ను పట్టుకున్న కృష్ణ:భవానీ తిట్టడంతో కృష్ణ వచ్చి దేవ్‌కు సారీ చెప్తుంది. అప్పుడు అతడు డ్రామా ఆడుతూ.. పెద్దపల్లి ప్రభాకర్‌ను రిలీజ్ చేయిస్తానని ప్రామిస్ చేస్తున్నా అంటూ కృష్ణ చేతిలో దేవ్ చేయి వేసి ప్రామిస్ చేస్తాడు. అప్పుడే కృష్ణ.. దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూస్తుంది. వెంటనే తన చొక్కా పట్టుకుని యూ ఛీటర్ అని అరుస్తుంది. ఏమైందని అందరూ కంగారు పడగా.. శ్రీధర్‌ను చంపింది వీడేనని చెప్తుంది. కృష్ణ చెప్పిన దానికి అందరూ షాక్ అవుతారు. ఆ వెంటనే భవానీ దేవి కూడా వచ్చి కృష్ణను నిలదీస్తుంది. దీంతో మురారి వచ్చి పెద్దమ్మా కాసేపు ఆగు అని అరుస్తాడు.
అరెస్ట్ చేసిన పోలీసులు:అనంతరం మురారి వచ్చి తనదైన స్టైల్‌లో దేవ్‌ను ప్రశ్నిస్తాడు. అయినా అతడు సమాధానం దాటవేస్తాడు. అంతలోనే పరిమళ పోలీసులను తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. అంతేకాదు, సీసీ పుటేజ్ సహా కొన్ని ఆధారాలను చూపిస్తుంది. దీంతో దేవ్ 'నా చెల్లి ఆనందం కోసమే ఇలా చేశాను. కానీ, ఈ విషయాలు ఏమీ తనకు తెలీవు' అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు భవానీ.. కృష్ణ, మురారి తనతో అన్న మాటలను గుర్తు చేసుకుని బాధ పడుతుంది. అనంతరం దేవ్‌ను పోలీసులు తీసుకు వెళ్లిపోతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











