Krishna Mukunda Murari June 1st: కృష్ణ గుట్టు విప్పిన ఆదర్శ్.. భవానీకి తెలిసిన నిజం.. నాలుక కోస్తానని!

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కృష్ణ దగ్గరకు ముకుంద వచ్చి నిజాలన్నీ చెప్పిన తర్వాత తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్తుంది. ఆ సమయంలో కృష్ణ తనకు ఎందుకు అన్యాయం చేస్తున్నావని ముకుందను ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె తన మనసులోని కుట్రను మొత్తం బయటపెడుతుంది. అంతేకాదు, మురారిని సొంతం చేసుకుంటానని అంటుంది. తర్వాత ఇంటికి రాగానే కృష్ణతో పాటు పోలీసులు కూడా అక్కడకు చేరుకుంటారు. అంతేకాదు, మురారి కనిపించడం లేదని చెప్తారు. దీంతో కృష్ణ నిజాలన్నీ తెలిసిపోతాయి. దీంతో ముకుంద కుట్రను బయటపెట్టే బాధ్యతను ఆమె తీసుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode June 1st

చెంప పగలగొట్టిన భవానీ

కృష్ణ ఆస్పత్రి రిపోర్టులు చూసి షాకైన భవానీ కోపం వెళ్లి కృష్ణ అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు ముకుంద 'కృష్ణ నేను చెప్పకుండానే మీ పెద్దత్తయ్యకు మొత్తం తెలిసిపోయింది. ఇన్నాళ్ళూ నిన్ను నెత్తిన పెట్టుకున్న మీ అత్త ఇప్పుడు విరుచుకుపడుతుంది' అని సంబరపడుతుంది. అప్పుడు కృష్ణ ఏమైంది పెద్దత్తయ్య అంటే ఎంత మోసం చేశావే అని చెంప పగలగొడుతుంది. ఏమైందని రేవతి అడిగితే రిపోర్ట్ ఇస్తుంది. ఆదర్శ్ వాటిని చూసి నవ్వుతాడు. అప్పుడు 'పిన్నీ నీ కొడుకు చేసిన దానికి షాక్‌లో ఉంటే నీ కోడలు చేసింది తెలిస్తే ఏమైపోతావో' అంటాడు.

కృష్ణకు బిడ్డ పుట్టదంటూ
తర్వాత ఆదర్శ్ 'తల్లి కాబోతుందని వారసుడిని ఇస్తుందని కృష్ణని నెత్తిన పెట్టుకున్నారు కదా. అదేమీ లేదు అంతా ఉత్తిదే. కృష్ణ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇదంతా నిజమని. ఇప్పుడే కాదు ఈ జన్మకు కృష్ణకి బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే కృష్ణకు గర్భసంచి లేదు. కానీ తల్లికాబోతున్నట్టు మోసం చేశారు. మరి అమ్మకి కోపం రాదా అందుకే మా అమ్మ తనని కొట్టింది' అని అంటాడు. దీంతో రేవతి 'ఇది నిజమేనా? నువ్వు కూడా మోసం చేశావా కృష్ణ. నిన్ను కన్నబిడ్డలా చూసుకున్నాను కదా. నీకు కష్టం వస్తే నేను విలవిల్లాడిపోయే దాన్ని. నువ్వు నన్ను మోసం చేశావ్ అనే నిజం ఈ గుండె తట్టుకోలేకపోతుంది' అని కుమిలి ఏడుస్తుంది.

నీకు అన్యాయం చేశాం

అనంతరం భవానీ 'ఎందుకు ఇంత పని చేశావు? అసలు మేము నీకు ఏం అన్యాయం చేశాము' అని నిలదీస్తుంది. దీంతో రజినీ 'నిజం చెప్తే ఎక్కడ బయటకు గెంటేస్తావని ఇలా నాటకం ఆడింది' అంటుంది. దీంతో భవానీ 'పిల్లల్ని కనకపోతే నిన్ను బయటకు గెంటేసేంత కసాయి దానిలా కనిపిస్తున్నానా? పెద్దత్తయ్య నాకు పిల్లలు పుట్టే యోగం లేదు అని చెప్తే జాలిపడి గుండెల్లో పెట్టుకుని చూసేదాన్ని కదా. కానీ ఈరోజు నువ్వు నా గుండెల్ని ముక్కలు చేశావ్ కదా' అంటుంది. అప్పుడే ముకుంద ఏ నిజం బయట పడకూడదో అదే చేశావు అంటుంది.

నీ ప్రాణం నా దగ్గరని
అందరూ నిందిస్తుండడంతో కృష్ణ 'ఇంత జరిగిన తర్వాత నేను ఎందుకు మౌనంగా ఉండాలి? నీ కడుపులో బిడ్డ మా బిడ్డ సరోగసి చేశామని చెప్పేస్తాము' అని అనుకుంటుంది. కానీ, ముకుంద గతంతో బెదిరించిన విషయం గుర్తొచ్చి ఆగిపోతుంది. అంతలోనే ముకుంద 'నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీ ప్రాణం నా చేతిలో ఉంది' అని సంబరపడుతుంది. అప్పడు రజినీ 'నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. కడుపుతో ఉన్న కృష్ణ వాంతులు చేసుకోవడం లేదు. మీరా కడుపుతో ఉందని అన్నాను. ఇంత దారుణంగా ఎవరిని మోసం చేయకూడదు' అంటుంది.

నా కడుపున పుట్టాడా?

ఆ తర్వాత కృష్ణను భవానీ 'ఎంత మంచిది అనుకున్నాను. ఈ ఇంట్లో అందరి కంటే దానికి ఎక్కువ విలువ ఇచ్చాను' అంటుంది. అప్పుడు రేవతి 'అది చేసింది తప్పే అక్క కానీ మీరు వారసులు కావాలని ఆశపడుతున్నారు కదా అందుకే ఇలా చేసింది' అంటుంది. దీంతో భవానీ 'నాకు వారసులు కావాలని కోరిక బలంగా ఉంది. కానీ కొడుకు, కోడలు కంటే ఎక్కువ కాదు కదా. నాకు ఈ ప్రాబ్లం ఉందని ముందే చెప్తే ప్రపంచం మొత్తం తిరిగి అయినా దాన్ని సరి చేయించే దాన్ని కదా. లేదంటే పిల్లలు పుట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. అది కూడా కుదరకపోతే దత్తత తీసుకునే దాన్ని. ఆదర్శ్ ఏమైనా నా కడుపున పుట్టాడా అయినా నా కొడుకు కాలేదా? నా ప్రేమ దీనికి ఎందుకు అర్థం కాలేదు' అంటుంది.

నిజం చెప్పిన కృష్ణ
తర్వాత భవానీ 'కృష్ణ తీసుకున్న నిర్ణయం తప్పు కావొచ్చు కానీ.. దాని వెనుక తప్పుడు ఆలోచన ఉండదు. కృష్ణ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది. కానీ మీరా అలా కాదు తను చెప్పేది నిజమైనా అబద్ధమైన దాని వెనుక చెడు ఉద్దేశం ఉంది. అది ఎప్పటికైనా ప్రమాదమే' అంటుంది. తర్వాత మురారి ఎక్కడికి వెళ్లాడో అర్థం కావడం లేదన భవానీ, రేవతి బాధపడతారు. కృష్ణ జరిగింది మొత్తం మధుకి చెబుతూ.. 'నేనేమీ మోసం చేయలేదు. వారసురాలిని ఇస్తానని మాట ఇచ్చాను ఇస్తున్నాను. కాకపోతే నా కడుపున మోయడం లేదు అంతే' అని చెప్తుంది.

భవానీతో చెప్పడంతో

ఆ తర్వాత మధు 'మీరా కడుపులో బిడ్డకు తండ్రి మురారి కానీ తను మీరా బిడ్డ కాదు. అది మురారి, కృష్ణల బిడ్డ. కృష్ణకి పిల్లలు పుట్టరని తెలిశాక సరోగసి ద్వారా మీరా గర్భాన్ని వాడుకున్నారు' అంతే అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. దీంతో భవానీ 'నువ్వు చెప్పింది నిజమేనా మీరా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా వారసుడా' అని అడుగుతుంది. దీంతో కృష్ణ అవునని అంటుంది. నో ఇదంతా అబద్ధమని మీరా గట్టిగా అరుస్తుంది. అంతేకాదు, 'ఇది నా బిడ్డ. మురారి వల్ల నాకు కలిగిన బిడ్డ. ఎక్కడ మురారి నాకు కాకుండా పోతాడని కృష్ణ నాటకం ఆడుతుంది' అంటుంది. దీంతో మధు 'ఇంకో మాట మాట్లాడితే నాలుక కోస్తా. ఇదే అబద్ధాలు చెప్తుంది. దీని బతుకు అబద్దాల పుట్ట. ఇది రాగానే మురారి మీద కన్నేసింది' అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X