Krishna Mukunda Murari June 5th: మీరా దగ్గరే మురారి.. కృష్ణను చంపాలని.. భవానీ ఏం చేసిందంటే!
ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మురారి జాడ తెలుసుకునేందుకు భవానీ.. మీరా గతంలో ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తుంది. అక్కడ అతడు గాయాలతో పడుకుని కనిపిస్తాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్లను మీరా గురించి ఎంక్వైరీ చేయగా వాళ్లు ఆమె చెప్పినట్లు మంచిగా చెప్తారు. తర్వాత మీరా కూడా అక్కడకు వస్తుంది. కానీ, ఆమెకు కనిపించకుండా తప్పించుకుంటుంది. అనంతరం కృష్ణ మాత్రం మురారి గురించి ఆందోళన చెందుతుంది. అప్పుడు ముకుంద తండ్రి దగ్గరకు వెళ్లాలని అనుకుంటుంది. ఇక, ముకుంద మాత్రం మురారితో కృష్ణ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి భయపెట్టాలని చూస్తుంది.



Click it and Unblock the Notifications











