Krishna Mukunda Murari June 6th: నిజం చెప్పిన శ్రీనివాస్.. మురారిని కనిపెట్టిన మీరా.. బిగ్ ట్విస్ట్

కొత్త కంటెంట్‌తో ఎప్పటికప్పుడు షోలో వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీరా గురించి ఎక్వైరీ చేసి వచ్చిన తర్వాత భవానీ దేవి.. ఇంట్లో వాళ్లకు ఆమె గురించి మంచిగా చెప్తుంది. దీంతో మధు కృష్ణ మాటలు నమ్మకుండా ఆమెను వెనకేసుకుని వస్తావేంటని ప్రశ్నిస్తాడు. దీంతో భవానీ 'మురారిని అడుగుదామని అంటే ఆ క్షణం నుంచి కనిపించకుండా పోయాడు' అంటుంది. అప్పుడు రేవతి 'కానీ కృష్ణ సరోగసి చేయించాము మీరా కడుపులో ఉన్న బిడ్డ మా బిడ్డ అంటుంది కదా' అనగా.. భవానీ మాత్రం డాక్టర్ సరోగసి చేయలేదని చెప్తుంది కదా అని అంటుంది. అప్పుడు రేవతి.. మీరా డాక్టర్‌ను మ్యానేజ్ చేస్తుందేమో అని అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode June 6th

ఇంట్లో వాళ్ల మాటలకు భవానీ 'నేను అలాగే అనుకుని ఎంక్వైరీ చేయడానికి వెళ్లాను. మీరా అబద్ధం చెప్పడం లేదు' అనడంతో మధు అంటే కృష్ణ అబద్ధం చెప్పిందని అంటున్నారా అని అంటాడు. దీంతో ఆదర్శ్ ఎంట్రీ ఇచ్చి 'మరి అంతే కదా. మురారి కడుపు చేసి పారిపోయాడు. భర్తను కాపాడుకోవడానికి కృష్ణ అబద్ధాలు చెప్తుంది. అంతా క్లియర్‌గా ఉంది' అంటాడు. అప్పుడు మధు 'నిన్ను మోసం చేసింది మీరా అయితే కృష్ణ, మురారి మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు' అని నిలదీస్తాడు.

అప్పుడు ఆదర్శ్ 'నన్ను మోసం చేసింది మీరానే కానీ అందుకు కారణం మురారి. నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది లేదంటే పిల్లల తల్లిని నాకు అంటగట్టే వాడు. అమ్మకి కృష్ణ మీద అనుమానం ఉంది కాబట్టి మీరా గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది' అంటాడు. అప్పుడు భవానీ 'నాకు కృష్ణ మీద అనుమానం ఉంటే తన గురించి ఎంక్వైరీ చేస్తాను కానీ మీరా మీద కాదుగా. ఎట్టి పరిస్థితిల్లోను మురారి తప్పు చేయడు, కృష్ణ అబద్ధం చెప్పదు నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. కానీ ముకుంద వైపు అన్ని నిజాలు కనిపిస్తున్నాయి' అని చెబుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode June 6th

తర్వాత భవానీ 'ఒకవైపు నమ్మకం, మరోవైపు నిజం రెండింటి మధ్య తేల్చుకోవడం కష్టం. కృష్ణ అబద్ధం చెప్పిందని అనుకుంటే మీరా కడుపులో ఉంది మురారి బిడ్డ కదా. పోనీ మీరా అబద్ధం చెప్తుంది అనుకుంటే అప్పుడు కూడా ఉంది మురారి, కృష్ణ బిడ్డే కదా. ఏది నిజమో ఏది అబద్ధమో కానీ మీరా కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు. అందుకే కృష్ణ మాటల మీద నమ్మకం ఉన్నా కచ్చితంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాను' అంటుంది. మీరాను పిలవమని అడుగుతుంది. ఇంట్లో లేదు ఇందాక బయటకు వెళ్ళిందని ఆదర్శ్ చెప్తాడు.

కృష్ణ ఆవేశంగా శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ముకుంద ఫోటో కింద పడేస్తుంది. నా కూతురు ఫోటో ఎందుకు పగలగొట్టావని నిలదీస్తాడు. దీంతో కృష్ణ 'మీ కూతురు చనిపోయిందా? అది నిజమని నీ కూతురు మీద ఒట్టు వేసి చెప్పు. బతికే ఉంది కదా బాబాయ్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ కూతురితో కలిసి నాటకం ఆడుతున్నావు. తనతో కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నావా' అని బాధగా అడుగుతుంది. దీంతో శ్రీనివాస్ (నేను నా కూతురిని చూసినట్టే నిన్ను చూశాను అంత మాట అనొద్దు' అంటాడు. అంతేకాదు, తన కూతురు తన మాట వినడం లేదని అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode June 6th

యాక్సిడెంట్ అయి తన ఇంట్లో ఉన్న మురారి దగ్గరకు ముకుంద వస్తుంది. అప్పుడు అతడిని ఎలాగైనా దక్కించుకుంటాను అన్నట్లుగా మాట్లాడుతుంది. మురారి మాత్రం అదంతా సాధ్యం కానివ్వనని అంటాడు. అయినా మీరా మాత్రం పట్టు వదలదు. ఇలా బుధవారం ఎపిసోడ్ పూర్తైంది. ఇక, గురువారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో మీరా వెనుకాలే వెళ్లిన కృష్ణ, మధు.. మురారిని బంధించిన ప్రదేశాన్ని గుర్తిస్తారు. దీంతో వాళ్లను చూసి ఆమె షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X