Krishna Mukunda Murari June 7th: గదిలో అవి చూసిన కృష్ణ.. దొరికిపోయిన మీరా.. మురారి కనిపించాడా అంటే!

గతంలో కంటే ఇప్పుడు కొత్త కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
అందరూ కూర్చుని భోజనం చేస్తుంటే కృష్ణ వాళ్లపై సీరియస్ అవుతుంది. మురారి కనిపించడం లేదు.. నా మాటలు ఎవరూ నమ్మడం లేదు.. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది.. మరి మీరు ఎలా ప్రశాంతంగా ఉన్నారు? అని అంటుంది. తర్వాత ఇంట్లో వాళ్లు అందరూ ఆమెను ఏదో ఒకటి అంటారు. దీంతో కృష్ణ కూడా వాళ్ల రూట్‌లోనే వెళ్లి మీరా బాగోగులు చూసినట్లు నటిస్తుంది.

అంతేకాదు, ఆమెకు ట్రీట్‌మెంట్ చేస్తానని అంటుంది. దీంతో మురారి తప్పు చేసినట్లు తాను కూడా నమ్ముతానని అంటుంది. దీంతో అందరూ షాక్‌లో ఉండిపోతారు. తర్వాత మీరా గదిలో ఎముకలు విరిగితే వాడే ట్యాబ్లెట్లు ఉన్నాయని, అంటే మురారి కూడా ఆమె దగ్గరే ఉండొచ్చని మధుతో చెప్తుంది. అది కనిపెట్టడం కోసం కృష్ణ ప్లాన్ చేస్తుంది. ఇలా ఈ ఎపిసోడ్ ముగిసింది.

Krishna Mukunda Murari Serial Today Episode June 7th

కృష్ణ కూడా నమ్మేసిందని
ముకుంద దగ్గర ఉన్న మురారి.. కృష్ణ గురించి తలుచుకుని బాధపడతాడు. అంతలోనే ముకుంద అక్కడకు వచ్చి 'ఇన్నాళ్ళూ మనం ఒకటి కావడానికి ఏదైతే అడ్డం అనుకున్నామో అది తొలగిపోయింది. ఇప్పటి వరకు మీ అమ్మ పెద్దమ్మ నీ వల్ల నేను తల్లిని అయ్యాను అంటే నమ్మారు కదా. ఇప్పుడు కృష్ణ కూడా నమ్మేసింది' అని చెప్తుంది. దీంతో మురారి 'కృష్ణ నమ్మదు నీకేదో పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నావు' అంటాడు. దీనికామె 'నేను నిజాన్ని మానిప్యులేట్ చేస్తాను ఏమో కానీ అబద్ధం మాత్రం చెప్పను' అంటూ జరిగింది మొత్తం అతడికి వివరిస్తుంది.

మురారి కాన్ఫిడెంట్‌గానే
ఆ తర్వాత ముకుంద 'నీ వల్లే నాకు బిడ్డ కలిగిందని అది చెప్పడం ఇష్టం లేక సరోగసి నాటకం ఆడమని చెప్పాను కదా. ఇప్పుడు ఆ అవసరం లేదు కృష్ణ అదే నమ్మేసింది' అని చెప్తుంది. దీంతో మురారి 'అది జరగదు కృష్ణ నిన్ను నమ్మదు నన్ను అనుమానించదు' అని మురారి కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. దీంతో మీరా 'అదే జరిగింది. కావాలంటే రేపు ఐ హేట్ ఏసీపీ సర్ అని కృష్ణ చెప్పే వాయిస్ రికార్డ్ తీసుకొస్తాను' అంటుంది. దీనికాతడు 'నేను నీ వాడిని కాను. నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా ఎందుకు వదలకుండా పీడిస్తున్నావు' అని అడుగుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode June 7th

మురారిని కనిపెట్టేసింది
ముకుందకు తెలియకుండా మధు, కృష్ణ అక్కడకు వచ్చి మురారిని చూస్తారు. వెంటనే భర్త దగ్గరకు బాధగా వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు అని ముకుంద అంటే కృష్ణ లాగిపెట్టి ఒకటి పీకి చంపేస్తానని అంటుంది. ఏం చేశావే అని ముకుంద గొంతు పట్టుకుంటుంది. ఏం జరిగిందని కృష్ణని అడుగుతుంది. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే మీరా చూసి ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్తాడు. మీరా కాదు ఏసీపీ సర్ ముకుంద అంటుంది. నీకెప్పుడు తెలిసిందని అంటే మీకంటే ముందే తెలుసు. మీకు చెప్తే బిడ్డను చంపేస్తానని బెదిరించింది అంటుంది.

మధుకు నిజం చెప్పేసి
ఆ తర్వాత మధు వచ్చి మీరాను ముకుంద అంటావ్ ఏంటి అంటాడు. ఇది మీరా కాదు ముకుంద అనేసరికి మధు ఆశ్చర్యపోతాడు. అంతేకాదు, 'ఇది మామూలు షాక్ కాదు. అసలు నువ్వు మామూలు ఆడదానివి కాదు అసలు నమ్మలేకపోతున్నాను' అంటుంది. దీంతో ముకుంద.. మురారి కోసం దేన్ని అయినా అడ్డు పెట్టుకుంటానని అంటుంది. దీంతో కృష్ణ 'నువ్వు ఏసీపీ సర్‌ను నిజంగా ప్రేమించి ఉంటే ఇన్ని దెబ్బలు తగిలిన మనిషిని ఇక్కడ పడుకోబెట్టవు. ఇక్కడ ఇలా పడేశావు అంటే నువ్వు ఎంత శాడిస్ట్ అనేది అర్థం అవుతుంది' అని తిడుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode June 7th

నా మురారినే ముఖ్యం
వాళ్ల మాటలకు ముకుంద 'నాకు నా మురారి దక్కడం ముఖ్యం. అది ఏ పరిస్థితిలోనైనా నా పక్కన ఉండటం ముఖ్యం' అంటుంది. దీంతో మధు 'ఇది బిడ్డను అడ్డం పెట్టుకుని బెదిరిస్తుంటే నువ్వు ఎలా భయపడ్డావు? పెద్ద పెద్దమ్మకి ఒక మాట చెప్తే బిడ్డ మీద కాదు కదా దీని మీద దీనికే అధీనం లేకుండా చేసి ఉండేది' అంటాడు. వెంటనే పెద్దమ్మకు ఫోన్ చేస్తానని అంటే కృష్ణ వద్దని ఆపుతుంది. తర్వాత మురారిని హాస్పిటల్‌కు తీసుకెళ్దామని అంటే తాను ఒప్పుకోనని ముకుంద అడ్డం పడుతుంది. మధు ముకుందకు వార్నింగ్ ఇచ్చి మురారిని తీసుకుని వెళ్తారు.

డాక్టర్‌ను కలిసిన భవానీ
మురారి.. భవానీకి నిజం చెప్పాలని అంటాడు. అప్పుడు మధు.. పెద్ద పెద్దమ్మను డాక్టర్ వైదేహిని కలవమని చెప్పాను అని కృష్ణతో చెప్తాడు. దీంతో మీరానే ముకుంద అని చెప్పలేదు కదాని కృష్ణ కంగారుపడుతుంది. దీంతో మధు 'లేదు మీరాకు డాక్టర్ వైదేహి మంచి ఫ్రెండ్ అంట తనని వెళ్లి కలవమని మాత్రమే చెప్పాను. ఇప్పుడు పెద్ద పెద్దమ్మ అక్కడికే వెళ్ళింది' అని చెప్తాడు. భవానీ డాక్టర్ వైదేహి దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చారని వైదేహి కంగారుగా అడుగుతుంది. మొన్న మీరా అనే అమ్మాయికి సరోగసి చేసి చేయలేదని చెప్పావ్. నిజం చెప్పు అంటుంది.

నిజం చెప్పిన వైదేహీ
తర్వాత భవానీ 'నా కోడలు అబద్ధం చెప్పే రకం కాదు. ఇప్పటికైనా నిజం చెప్పు. మీరాకు సరోగసి చేశావా లేదా' అని అడుగుతుంది. దీంతో వైదేహి 'మీరా ఎవరో కాదు నా ఫ్రెండ్' అంటూ నిజం చెప్పేస్తుంది. తర్వాత ఇంటికి వచ్చిన కృష్ణ సంతోషంగా కనిపిస్తుంది. అప్పుడు రేవతి అడగ్గా.. చెప్తానని అనేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైందని అందరూ కంగారుపడతారు. గుండె ఆగిపోయింది ఏమోనని ముకుంద సంబరపడుతుంది. మధు పరిమళకు ఫోన్ చేసి కళ్ళు తిరిగి పడిపోయిందని ఇంటికి రమ్మని చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X