Krishna Mukunda Murari: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దోషిలా మారిన కృష్ణ.. కథలో ఊహించని మలుపు

సినిమాలకు ఎంతటి రెస్పాన్స్ ఉంటుందో.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
శోభనం గదిలో నుంచి బయటకు వచ్చిన ఆదర్శ్.. తన స్థానంలో మురారిని వెళ్లమంటాడు. దీంతో అతడు కొడతాడు. అప్పుడు ఆదర్శ్ తన లైఫ్‌ను అందరూ కలిసి నాశనం చేశారని చెబుతాడు. ముఖ్యంగా కృష్ణ వల్లే ఇలా అయిందని ఆరోపిస్తాడు. అప్పుడు కృష్ణ కోపంగా వెళ్లి ముకుందను కిందకు తీసుకుని వచ్చి అందరి ముందే ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె నిజాలు అన్నీ ఒప్పుకుంటుంది. అంతేకాదు, మురారికి ఈ విషయాలు ముందే చెప్పానని అనడంతో ఆదర్శ్‌లో కోపం పెరుగుతుంది. తర్వాత కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంటే కృష్ణ.. ముకుంద చెంపను చెల్లుమనిపిస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 12th

నా భర్తను నీ చేతిలో పెట్టాలా
ముకుంద తన మనసులోని మాటలను చెప్పడంతో కృష్ణ 'నీ కళ్ళన్నీ నా భర్త మీద ఉన్నాయని తెలుసు కానీ.. నిన్ను శత్రువులా చూడకుండా మారతావని నా ప్రయత్నాలు చేశాను అది తప్పా' అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'తప్పే మీరు నాకు ఇష్టం లేని జీవితంలో నన్ను ఇరికించాలని చూశారు. ఎన్ని రోజులు ఓర్చుకోవాలి? ఇక నా వల్ల కాదు' అంటుంది. అప్పుడు కృష్ 'ఏంటి నీ ఉద్దేశం? నా భర్తను నీ చేతిలో పెట్టి నీతో పంపించాలా? చూశారా అత్తయ్య ఎలా సిగ్గు లేకుండా మాట్లాడుతుందో' అనగా.. నాకెందుకు సిగ్గు? నీకు భర్త కాకముందు నాకు ప్రియుడు అంటుంది.

ఆదర్శ్‌కు నిజం చెప్పేశాను
కృష్ణ మాటలకు ముకుంద 'నా ప్రియుడిని నేను కావాలని కోరుకుంటున్నాను తప్పేంటి? మురారిని మనసులో ఉంచుకుని ఆదర్శ్‌తో కాపురం చేస్తే అది తప్పు. అందుకే ఇన్నాళ్లూ భరించి ఈరోజు బయట పడిపోయాను. ఏ నాటకాలు ఆడకుండా ఆదర్శ్‌కు నిజం చెప్పేశాను. నేను చేసింది తప్పు కాదు' అంటుంది. దీనికామె 'ముకుంద నిన్ను చూస్తుంటే అసహ్యం కాదు విరక్తి పుడుతుంది. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడైనా చూశారా? మొహం మీద ఉమ్మి వేయాలని అనిపించడం లేదా' అనగానే కొట్టడానికి చేయి లేపుతుంది. దీంతో కృష్ణ మరింతగా తిడుతుంది.

తప్పు చేస్తున్నావు అంటూ
ఆ తర్వాత కృష్ణ 'సిగ్గు, పరువు, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా నీకు? నిన్ను చూస్తుంటే తేళ్ళు పాకుతున్నట్టు అనిపిస్తుంది. ఛీ నీది ఒక బతుకేనా? నీ సిగ్గు లేని బతుక్కి పౌరుషం కూడానా? ఇలాంటి బతుకు బతికినా ఒకటే పోయినా ఒకటే' అని అవమానిస్తుంది. దీంతో తప్పు చేస్తున్నావు అంటూ ముకుంద మందలిస్తుంది. తర్వాత ముకుంద 'నువ్వు అనుభవిస్తావ్ కృష్ణ తప్పకుండా అనుభవిస్తావ్. ఆరోజు ముకుందని ఎందుకు అంతలా అవమానించావని బాధపడే రోజు వస్తుంది. కృష్ణ బాగా గుర్తు పెట్టుకో' అనేసి ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 12th

ఇదేగా మీరు కోరుకున్నారు
ముకుంద వెళ్లిపోగానే ఆదర్శ్ 'ఇదేగా నా జీవితంలో మీరు జరగాలని కోరుకుంది. ఇప్పుడు సంతోషమేగా. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు? మీరు అసలు మనుషులేనా? మీకు మనసు ఉందా' అంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణ ఇంతకు తెగిస్తుందని అనుకోలేదని అంటుంది. దీనికి మురారి 'ఏదో ఒక రోజు ముకుంద ఇలా చేస్తుందని ఊహించాను కానీ.. ఈరోజు ఇలా చేస్తుందని అనుకోలేదు. ఇంతకముందులాగే ఏదో ఒక కారణం చెప్పి శోభనం ఆపేస్తుందని అనుకున్నాను. ఇప్పుడు ఆదర్శ్‌ను ఎలా ఓదార్చాలో, పెద్దమ్మకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు' అంటాడు. అప్పుడే మధు వచ్చి పెద్దమ్మ చాలా బాధపడుతుందని చెప్తాడు.

నేనెందుకు ఉండాలంటూ
ఆ తర్వాత ఆదర్శ్ బ్యాగ్ పట్టుకుని వస్తాడు. అతడిని కృష్ణ, మురారి ఆపుతారు. అప్పుడతను 'వెళ్లక ఇక్కడే ఉండాలా? నేను ముకుంద మనసులో ఉన్నానని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు తనే లేదు. ఇంక నేనెందుకు ఉండాలి' అంటాడు. దీనికి కృష్ణ 'ముకుంద ఎక్కడికి వెళ్తుంది? కోపం తగ్గాక తనే తిరిగి వస్తుంది' అంటుంది. దీనికి ఆదర్శ్ 'తిరిగి వస్తే ఏం చేయాలి? ఇంత జరిగినాక కూడా నీ మనసులో చోటు ఇవ్వమని అడుక్కోవాలా' అంటాడు. అప్పుడు కృష్ణ 'అలా అనకు తను నీ భార్య తప్పు తెలుసుకుంటుంది' అంటుంది.

మిమ్మల్ని కలపడం తప్పా
కృష్ణ మాటలకు ఆదర్శ్ 'ముకుంద ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది నువ్వు. నువ్వు తప్పు చేసి ముకుందను బయటకి తరిమేశావ్. తను వెళ్లిపోవడానికి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కృష్ణ కారణం' అంటాడు. దీంతో మురారి సీరియస్ అవుతాడు. 'కృష్ణ తప్పు చేసిందని అంటే నేను ఎలా ఊరుకుంటాను. కృష్ణ చేసిన తప్పు ఏంటి విడిపోయిన మీ ఇద్దరినీ ఒక్కటి చేయాలని అనుకుంది అది తప్పా? పెద్దమ్మ మనవరాలిని ఇవ్వాలని అడిగినా మీరు ఒక్కటైతేనే కానీ శోభనం వద్దని అనుకుంది అది తను చేసిన తప్పా' అంటూ క్లాస్ పీకుతాడు.

ముకుందను తీసుకొస్తాం
తర్వాత మురారి 'అసలు దీనంతటికి కారణం నువ్వు. నువ్వు ఒక చేతకాని వాడివి చవట దద్దమ్మవి కావడం వల్లే ఇదంతా జరిగింది' అని ఆదర్శ్‌ను తిడతాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ వాదించుకుంటారు. అప్పుడు కృష్ణ, మురారి.. ముకుందను మళ్లీ తీసుకొస్తాం అని, భవానీ వచ్చే వరకూ ఇంట్లోనే ఉండమని అడుగుతారు. అప్పుడే రేవతి కలుగజేసుకుని ఆదర్శ్‌ను గదిలోకి తీసుకు వెళ్తుంది. అనంతరం ఆదర్శ్‌ మాటలు తలుచుకుని కృష్ణ బాధపడుతుంది. దీంతో మురారి ఆమెను ఓదార్చుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X