Krishna Mukunda Murari: అసలు నిజం చెప్పిన ఆదర్శ్.. ముకుంద ఆత్మహత్య చేసుకుందా? కథలో బిగ్ ట్విస్ట్

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుంద అందరి ముందు నిజాలు ఒప్పుకోవడంతో కృష్ణకు కోపం పెరిగిపోతుంది. దీంతో ఆమెను ఘోరంగా అవమానించడంతో పాటు చెంప పగలగొడుతుంది. అప్పుడు ముకుంద వార్నింగ్ ఇస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. తర్వాత ఆదర్శ్ కూడా అంతటికి కారణం కృష్ణే అని నిందిస్తాడు. అప్పుడు మురారి అతడిపై కోప్పడతాడు. తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయేందుకు రెడీ అవుతాడు. కానీ, కృష్ణ, మురారి కలిసి ముకుందను మళ్లీ తీసుకు వస్తామని చెప్పి అతడిని ఆపుతారు. చివర్లో ఆదర్శ్ తనపై నిందలు వేయడాన్ని కృష్ణ తట్టుకోలేకపోతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 13th

ఇంట్లో నుంచి వెళ్లిపోతాడట
ముకుంద వెళ్లిపోయిందన్న బాధలో ఆదర్శ్ పట్టపగలు నట్టింట్లో కూర్చుని మందు తాగుతాడు. రేవతి వచ్చి పొద్దున్నే ఏంటి ఇది అని అడుగుతుంది. అప్పుడు మధు వద్దని బతిమలాడుతున్నా కూడా ఆదర్శ్ వినిపించుకోడు. మురారి, కృష్ణ ముకుంద ఎక్కడ ఉందో తెలుసుకుని ఇంటికి తీసుకురావాలని అనుకుంటారు. అప్పుడు మురారి.. ఆదర్శ్‌ను ఆపాలని అనుకుంటాడు. కానీ, మధు 'ఇప్పుడు మనం ఏం చెప్పినా వినడట. తను చేసింది నచ్చకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతాడట' అని చెప్తాడు. దీంతో మురారి వీడికి మందు ఎక్కువైందని కోపంగా వెళ్తుంటే కృష్ణ ఆపుతుంది.

ఆదర్శ్ నోరు మూసిన మధు
ఆదర్శ్ మందు తాగుతున్న సమయంలోనే రేవతికి భవానీ ఫోన్ చేస్తుంది. దీంతో తనకు ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. కానీ, రేవతి 'ఏం మాట్లాడతావ్ తాగిన మత్తులో ఇక్కడ జరిగింది అంతా వాగేస్తావు' అని ఆపుతుంది. దీంతో సుమలత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు భవానీ 'అంతా బాగానే ఉందా? రేవతి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు' అని అడుగుతుంది. దీనికామె బాగుందని చెప్తుంది. అప్పుడు ఆదర్శ్ మాట్లాడబోతుంటే మధు అతడి నోరు మూస్తాడు. అనంతరం రేవతి 'అక్క వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు' అని టెన్షన్ పడుతుంది.

ముకుంద అస్సలు మారదు
ఇంట్లో పరిస్థితులు చూసిన తర్వాత మురారి, కృష్ణ కలిసి ముకుందను తీసుకు వస్తావని వెళ్లిపోతారు. అప్పుడు కృష్ణ 'ఇప్పుడు తనను ఎక్కడ వెతుకుందాం' అని అడగ్గా.. మురారి 'తన ఇంటికి వెళ్లి ఉంటుంది. లేదంటే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి అడుగుదాం' అని అంటాడు. దీంతో కృష్ణ 'అసలు తను ఎందుకు ఇలా చేసింది? ఎంత మంది ఆడపిల్లలు ప్రేమించిన వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న వాడితో సంతోషంగా ఉండటం లేదు' అని అంటుంది. అప్పుడు మురారి 'ఈ విషయంలో ముకుంద అస్సలు మారదు' అని అంటాడు.

తప్పు చేశానని కృష్ణ బాధ
ఆ తర్వాత కృష్ణ 'నేను తప్పు చేశాను ఏమో.. బయటకి తీసుకొచ్చి చేయి చేసుకోకుండా ఉండాల్సింది' అని బాధపడుతుంది. అప్పుడు మురారి 'ఇప్పుడు తనను ఇంటికి తీసుకెళ్తే ఆదర్శ్ అంగీకరిస్తాడా' అని ప్రశ్నిస్తాడు. దీనికామె ఏదో ఒకటి చేయాలి అంటుంది. దీంతో మురారి 'ఏం చేయాలి? ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా? ముకుందను మార్చడం మన వల్ల కాదు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం కూడా మన వల్ల కాదు. ఇప్పుడు ముకుందని వెతికేది కూడా తన కోసం కాదు నీకోసం. పెద్దమ్మ వెళ్తూ నీకు ఇంటి బాధ్యతలు అప్పగించింది. ముకుంద ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే నువ్వేం చేస్తున్నావని నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు నిందలు పడటం నాకు ఇష్టం లేదు. అందుకోసం వెతుకుతున్నా తప్ప వాళ్ళని కలపడం కోసం కాదు' అని చెప్తాడు.

నువ్వు పెద్ద మోసగాడివి
మురారి మాటలకు కృష్ణ 'వాళ్ళను కలపకపోతే మన జీవితంలో ఏదో లోటుగానే అనిపిస్తుంది' అని బాధపడుతుంది. దీనికి కృష్ణ 'నాకు వాళ్ళు కలవాలని ఉంది కానీ.. వాళ్లను కలిపే క్రమంలో నువ్వు ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందోనని నాకు బాధగా ఉంది' అని అంటాడు. మరోవైపు ఆదర్శ్‌ను మధు తాగొద్దని బతిమలాడుతూ ఉంటాడు. దీనికతడు గుండెల్లో బాధ తగ్గడం లేదని చెప్తాడు. అంతేకాదు, 'నువ్వు ఒక మోసగాడివి. నీకు నేను ఎప్పుడు కనిపించినా తొండ గురించి చెప్పమని అడిగే వాడివి కదా' అంటాడు. దీంతో మధు నువ్వు చెప్పలేదు కదా అంటాడు.

అసలు నిజం చెప్పేశాడు
తర్వాత ఆదర్శ్ 'అసలు అక్కడ తొండ లేదని నీకు తెలుసు కదా తొండ మొహమోడా' అని ఆరోజు జరిగింది చెప్తాడు. అనంతరం 'ముకుందకు నేనంటే ఇష్టం లేదనే అనుమానం నీకు ఉంది కదా. నాకు తెలుసు నువ్వు వాళ్ళలో ఒకడివే అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ముకుందకి నేనంటే ఇష్టం లేదని ఈ ఇంట్లో అందరికీ తెలుసు కానీ నాకు చెప్పకుండా మోసం చేశారు' అని అంటాడు. అప్పుడు మధు.. ముకుంద గురించి ఎవరికీ తెలియదు అని అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఆదర్శ్ మాత్రం అతడి మాటలను అస్సలు వినిపించుకోడు.

ఫొటోలు కాల్చేసిన ఆదర్శ్
ఎంత వెతికినా ముకుంద జాడ తెలియకపోవడంతో కృష్ణ టెన్షన్ పడుతుంది. అప్పుడు మురారి 'ముకుందకి ఏం కాదు నీ ముందు నాముందే కాకుండా అందరి ముందు అవమానం జరిగింది కదా అందుకె మొహం చాటేసి ఉంటుంది. కానీ తను మాత్రం ఇంటిని వదిలి ఉండలేదు' అని ధైర్యం చెప్తాడు. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుందట అంటాడు. దీంతో కృష్ణ ఇంకా భయపడుతుంది. మరోవైపు, ఆదర్శ్ తన గదిలో ముకుంద దాచిన ఫొటోలను తీసి కాల్చేస్తాడు. అది రేవతి చూస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X