Krishna Mukunda Murari: చనిపోయింది ముకుందే.. కన్ఫార్మ్ చేసిన శ్రీనివాస్.. అంతలోనే బిగ్ ట్విస్ట్
గతంలో కంటే ఇప్పుడు కొత్త కంటెంట్‌తో షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుంద వెళ్లిపోయిందన్న బాధలో ఆదర్శ్ మందు తాగుతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. దీంతో ఆమెను వెతికి తీసుకు వచ్చేందుకు కృష్ణ, మురారి బయటకు వెళ్తారు. ఆ సమయంలో ఆమెకు ఏమైనా జరిగి ఉంటుందేమో అని కృష్ణ భయపడుతుంటుంది. దీంతో మురారి ఆమెకు ధైర్యం చెప్తాడు. అనంతరం ఆదర్శ్ తన బాధ మొత్తాన్ని మధుకు చెప్తాడు. అంతేకాదు, ఇంట్లో అందరూ కలిసి తనను పిచ్చోడిని చేశారని నిందిస్తాడు. ఓ అమ్మాయి రైలు పట్టాలపై పడి ఉందని ఎవరో చెప్పడంతో అది ముకుంద అయి ఉంటుందేమో అనుకుని కృష్ణ, మురారి భయపడిపోతారు.

నా జీవితం సర్వనాశనమైంది
మురారి, ముకుంద దిగిన ఫొటోలను ఆదర్శ్ కాలుస్తుండగానే రేవతి గదిలోకి వస్తుంది. మధు కూడా అప్పుడే వస్తాడు. ఇద్దరూ ఆ మంటలను చూసి కంగారు పడిపోతారు. దీంతో రేవతి మంటలను ఆర్పమని చెప్తుంది. కానీ, ఆదర్శ్ మాత్రం 'వద్దు అవి కాలిపోతేనే నా గుండెల్లో మంట చల్లారుతుంది. నన్ను ఏడిపించి వీళ్ళు నవ్వుతున్నారు. నన్ను చూసే ఎగతాళి చేస్తున్నారు' అని బాధపడతాడు. దీంతో రేవతి 'అక్కడ ఎవరూ లేరు అదంతా నీ భ్రమ' అని ఓదారుస్తుంది. కానీ ఆదర్శ్ 'అయిపోయింది.. నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది' అంటాడు.
చాలా పెద్ద ప్రమాదం జరిగేది
కృష్ణ, మురారి ఇంటికి వచ్చి ముకుంద వచ్చిందా అని అడుగుతారు. దీంతో రేవతి 'అయితే ముకుంద కనిపించలేదా? ఇక్కడ వీడు చూస్తే ఇలా ఉన్నాడు' అని ఏడుస్తుంది. దీనికి మురారి బాధలో తాగుతున్నాడు అంటాడు. అప్పుడామె 'తాగడం కాదు తగలబెట్టేస్తున్నాడు. మేము వెళ్లకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది' అని చెప్తుంది. తర్వాత మధు కంగారుగా వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. అందులో 30 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుందని వార్త వస్తుంది. అది చూసి అందరూ కంగారు పడతారు. ముకుందకే అలా జరిగిందని భయపడుతూ ఉంటారు.
ముకుందనే చనిపోయిందని
తర్వాత మురారి 'అది ముకుంద అని కంగారుపడి టీవీ పెట్టావా? ఇందాక మేము టీ తాగేటప్పుడు పక్కనే ఈ ప్రమాదం జరిగింది. తను ముకుంద అయ్యే ఛాన్స్ లేదు' అంటాడు. దీంతో రేవతి 'మన ముకుందే జరిగిన అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుంది' అని కుప్పకూలిపోయి ఏడుస్తుంది. మురారి అది ముకుంద కాదని ధైర్యం చెప్పేందుకు చూస్తాడు. కానీ, ఆమె మాత్రం ఇంట్లో జరిగిన గొడవకు ఇలా అఘాయిత్యం చేసుకుందని రేవతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ముకుంద అని కన్ఫామ్ కాదు కదా ఆదర్శ్‌కు చెప్పొద్దు అని కృష్ణ చెబుతుంది.
చనిపోయింది కూడా దాస్తారా
కృష్ణ మాటలు విన్న ఆదర్శ్ 'నిజాలు దాచడం అలవాటు అయిపోయింది కదా నీకు? మనుషులను అబద్దాలలో ఉంచడం అలవాటు అయిపోయింది కదా' అంటాడు. దీంతో మురారి అడ్డుపడతాడు. దీంతో ఆదర్శ్ 'నువ్వు మాట్లాడకు మురారి.. నేనంటే నా భార్యకు ఇష్టం లేదని తెలిసి నా దగ్గర దాచి నన్ను ఒక వెర్రి బాగులోడిని చేశారు. ఇప్పుడు నా భార్య చనిపోయిందనే విషయం కూడా దాచాలని చూస్తున్నారా' అని నిలదీస్తాడు. దీంతో కృష్ణ 'అది ముకుంద కాదేమో ఎందుకు కంగారుపడటం' అంటుంది.
చావుకు కారణం నువ్వే అని
కృష్ణ మాటలకు ఆదర్శ్ 'ముకుంద అయితే ఏంటి పరిస్థితి? తన చావుకు కారణం నువ్వే అని ఒప్పుకుంటావా? నువ్వు చేసిన దారుణం గురించి మాట్లాడుతున్నా. నా భార్య ప్రాణాలు తీసింది నువ్వే. తను రాత్రే చెప్పింది జరిగిన దానికి కూడా కారణం నువ్వేనని చెప్పింది. ప్రాణాలు పోయే ముందు మొత్తం చెప్పి తను పోయింది. ప్రాణాలు పోయే ముందు ఎవరూ అబద్ధాలు చెప్పరు. నా భార్య ప్రాణాలు తీసింది నువ్వే' అని కోప్పడతాడు. తర్వాత మధు ముందు ఆస్పత్రికి వెళ్లి కన్ఫార్మ్ చేసుకుందాం అంటాడు. దీంతో అందరూ వెళ్తారు. అప్పుడు ముకుంద తండ్రికి తెలుస్తుంది.
మీరే తనను ఇలా చేశారు
రేవతి వాళ్లు వచ్చే సరికి ముకుంద తండ్రి శ్రీనివాస్ అక్కడే ఉంటాడు. చనిపోయింది నా కూతురే అని ఆయన చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. తర్వాత 'మీరందరూ ఎందుకు వచ్చారు? నా కూతురు చనిపోయిందో లేదో కన్ఫామ్ చేసుకోవడానికి వచ్చారా' అని తిడతాడు. దీంతో కృష్ణ 'మొహం గుర్తు పట్టలేనంతగా అయిపోయింది అన్నారు కదా. తను నిజంగా ముకుందేనా' అంటుంది. దీనికాయన 'నా కూతురే చనిపోయింది. మీరందరూ కలిసి తను ఆత్మహత్య చేసుకునేలా చేశారు' అంటాడు. దీంతో కృష్ణ మీరు అలా అనొద్దు ముకుంద చనిపోయిందని మేము అంతే బాధపడుతున్నాం అంటుంది. దీనికి శ్రీనివాస్ 'చేయాల్సింది అంతా చేసి మొసలి కన్నీళ్ళు కార్చవద్దు. నా కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు' అంటాడు.
ట్విస్ట్ ఇచ్చిన ముకుంద
తర్వాత శ్రీనివాస్ 'కన్నతండ్రిని పట్టించుకోకుండా మీ దగ్గరే ఉన్నందుకు మంచి బహుమతి ఇచ్చారు' అంటాడు. దీంతో కృష్ణ 'మేము ముకుందను ఎంత బాగా చూసుకున్నామో ఆ భగవంతుడికి తెలుసు' అంటుంది. తర్వాత 'అంత బాగా చూసుకుంటే నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆదర్శ్‌ను చూసి నువ్వు ఎందుకు వచ్చావ్? పెళ్ళిలో మూడు ముళ్ళు వేసిన తర్వాత వెళ్లిపోయావ్ కదా. నువ్వు రాకపోయి ఉంటే తను కోరుకున్న జీవితం దక్కలేదని ప్రాణాలతో ఉండేది' అని అతడిని కూడా తిడతాడు. అలా అక్కడ గొడవ జరిగిన తర్వాత శ్రీనివాస్ ఇంటికి వస్తాడు. అంతలో ముకుంద కనిపిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











