Krishna Mukunda Murari: కొత్త రూపంతో ముకుంద.. బిత్తరపోయే ప్లాన్‌.. సీరియల్‌లో ఊహించని ట్విస్ట్

గతంలో కంటే ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి వచ్చినా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:ముకుంద వెళ్లిపోయిందన్న బాధలో ఉన్న ఆదర్శ్.. ఆమె దాచిన ఫొటోలను కాలుస్తుంటాడు. అప్పుడు అది చూసి మధు, రేవతి కంగారు పడతారు. అంతలోనే అక్కడకు మురారి వాళ్లు వస్తారు. అప్పుడు అక్కడ జరిగింది రేవతి చెబుతుంది. తర్వాత యువతి ఆత్మహత్య అని టీవీలో వచ్చేది చూసి అందరూ భయపడతారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి చూడాలని డిసైడ్ అవుతారు. అప్పటికే అక్కడ ఉన్న శ్రీనివాస్ చనిపోయింది ముకుందే అని చెప్తాడు. అంతేకాదు, ఆ ఇంట్లో వాళ్లు అందరిపై సీరియస్ అవుతాడు. తర్వాత ఆదర్శ్ మీద కూడా ఆయన కోపాన్ని ప్రదర్శిస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 15th

ముకుందను చూసి షాక్:శ్రీనివాస్ ఇంటికి రాగానే ముకుంద కనిపించడంతో షాక్ అవుతాడు. దీంతో ముకుంద 'చనిపోయింది ఎలా వచ్చిందని భయపడుతున్నావా? లేదా దరిద్రం వదిలిందని అనుకుంటే మళ్ళీ ఎలా వచ్చిందని బాధపడుతున్నావా' అని అడుగుతుంది. దీనికాయన 'నువ్వు లేవు అనేసరికి ఈ బతుకు ఎందుకని అనిపించింది. నిన్ను చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. నువ్వు బతికే ఉన్నావు. నాకు అది చాలు. ఎందుకు ఇలా చేశావు' అని అడుగుతాడు. దీంతో ముకుంద 'నేను పోయానని అందరూ నమ్మాలని ఇదంతా నేనే కావాలని చేశాను' అని తండ్రికి చెప్తుంది.

కొత్త ప్లాన్‌తో ముకుంద:ఆ తర్వాత ముకుంద 'ఈ రూపంతో వాళ్ల ముందుకు వచ్చి నేను సాధించేది ఏముంది? ఏదైనా సాధించాలంటే నేను లేనని నమ్మించి సాధించాలి. అందుకే ఇలా చేశాను' అంటుంది. దీంతో శ్రీనివాస్ 'ఇన్నాళ్ళూ ఆ ఇంట్లో న్యాయంగా పోరాటం చేశావు. ఇప్పుడు వాళ్ళు నిన్ను అన్యాయంగా బయటకి గెంటేశారు. ఇక ఈ మనుషులు మనకు వద్దు. అందరికీ దూరంగా ఎక్కడికి అయినా వెళ్లిపోదాం' అంటాడు. దీనికామె 'ఇంత చేసింది మురారిని వదిలేసి దూరంగా వెళ్లాడానికా? ఆ ఆలోచన ఉంటే ఈ నాటకం ఎందుకు? మురారి నిన్ను వదిలేస్తున్నానని ఒక్క మాట చెప్పి ఉండేదాన్ని. ఇదంతా చేసింది దూరంగా వెళ్ళడానికి కాదు నాన్న. మురారికి ఇంకా దగ్గర కావడానికి' అని చెప్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 15th

రూపం మార్చుకోవాలని:తండ్రి అయోమయంగా ఉండడంతో ముకుంద 'మురారి రూపం మారిపోయాక నేనే మురారి అని చెప్పేవరకు ఎవరైనా గుర్తు పట్టారా? రెండు మూడు రోజుల తర్వాత నన్ను ఎవరూ గుర్తు పట్టలేరు నీతో సహా' అంటుంది. దీనికాయన 'అంటే నువ్వు రూపం మార్చుకుంటున్నావా' అని అడుగుతాడు. అప్పుడు ముకుంద 'కోరుకున్నది దక్కించుకోవడానికి పేరు, ఊరు కాదు రూపం కూడా మార్చుకోవాలి తప్పదు. నువ్వు నాకిచ్చిన రూపం తనివితీరా చూసుకో నాన్న. బాధపడకు నాన్న అనుకున్నది సాధించడం కోసం నీ కూతురు ఎంతకైనా తెగిస్తుంది. ఇది నాకు పునర్జన్మ అనుకో' అంటుంది. దీంతో శ్రీనివాస్ 'వేరే రూపంలో అయినా తను అనుకున్నది సాధిస్తుందని అంటే అంతకంటే సంతోషం ఏముంది' అని సంతోషిస్తాడు.

అంతటికి కృష్ణ కారణం:ముకుంద వెళ్లిపోయిన బాధలో ఉన్న ఆదర్శ్.. తన ఫ్రెండ్ దగ్గర బాధను పంచుకుంటాడు. 'ముకుందకు నామీద ఇష్టం లేదని నాకు అనిపించింది. నేను చెప్తానే ఉన్నాను కానీ మురారి వాళ్ళు వినలేదు. అసలు నేను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు. కలిసి ఉండకపోయినా ముకుంద ప్రాణాలతో అయినా ఉండేది కదా. నేను అనవసరంగా వాళ్లను తిట్టేశాను. వాళ్ళు మా ఇద్దరిని కలపాలని చూశారు. నేను ఆవేశంలో నోటికి వచ్చినట్టు మాట్లాడాను' అని బాధపడతాడు. కానీ, అతడి ఫ్రెండ్ మాత్రం కృష్ణదే ఇందులో తప్పు అని రెచ్చగొడతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 15th

రెచ్చగొట్టిన స్నేహితుడు:ఆ తర్వాత ఆదర్శ్ ఫ్రెండ్ 'ముకుందను హ్యాండిల్ చేయడంతో కృష్ణ తప్పు చేసింది. ఏ భార్య అయినా పరాయి స్త్రీతో పరిచయం ఉన్నా కూడా సహించలేదు. అలాంటిది ముకుంద గతంలో తన భర్తని ప్రేమించిందని, ఇంకా తన మీద ఆశలు పెట్టుకుందని తెలిసినా సహించింది. అంత పెద్ద మనసు ఉండటం కూడా తప్పే. ఆ విషయంలో కృష్ణ చాలా పెద్ద తప్పు చేసింది. మామూలుగా అయితే ముకుంద మనసు మార్చడానికి ప్రయత్నించాలి బుద్ధి చెప్పాలి. అప్పటికీ మారకపోతే తనకి దూరంగా ఉండాలి. కానీ కృష్ణ అలా చేయలేదు' అని వివరించి చెప్తాడు.

జన్మలో క్షమించలేనని:తన స్నేహితుడి మాటలను అపార్థం చేసుకున్న ఆదర్శ్'కృష్ణ ఇదంతా చేసింది మేము సంతోషంగా ఉండటం కోసం కాదు తన స్వార్థం కోసం మమ్మల్ని పాములుగా వాడుకుని ముకుందని బలితీసుకుంది' అంటాడు. కానీ, అతడు అలా కాదని చెప్పినా ఆదర్శ్ వినిపించుకోడు. మరోవైపు కృష్ణ ఒంటరిగా కూర్చుని బాధ పడుతూ ఉంటే రేవతి వాళ్లు వచ్చి తలో మాట అంటారు. అప్పుడామె 'ఏదైనా ఆలోచించనివ్వు తను ఉండి ఉంటే తన ఆలోచనలు మార్చి ఉండే దాన్ని తన మనసు మార్చి ఉండేవాళ్లం. కానీ ఇంత పిచ్చి పని చేస్తుందని ఊహించలేదు' అంటుంది.

కృష్ణతో ఆదర్శ్ గొడవ:వాళ్ల మాటలు విన్న ఆదర్శ్ 'ఇదంతా తమరి పుణ్యమే కదా. ముకుంద శవంలా మారిందన్నా, నేను జీవశ్చవంలా మారిందన్నా దానికి కారణం నువ్వే. మొత్తం కృష్ణ చేసింది మీకేవారికి అర్థం కావడం లేదా' అంటాడు. దీంతో సుమలత 'ఏం చేసింది నువ్వు ముకుంద సంతోషంగా ఉండాలని కోరుకుంది అది తను చేసిన తప్పా అని రేవతి అడుగుతుంది. ఏది ఆ సంతోషం ఇదేనా? తను ఎప్పుడు మా సంతోషం గురించి ఆలోచించింది. తప్పు ఆదర్శ్ మిమ్మల్ని కలపడానికి కృష్ణ చాలా చేసింది' అని చెప్తుంది. కానీ, ఆదర్శ్ కృష్ణను తిడతాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X