Krishna Mukunda Murari: మురారికి కనిపించిన ముకుంద.. కృష్ణను అంతం చేయాలని.. తండ్రి ఆ మాట అనడంతో!

ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుంద చనిపోయిందని బాధతో వచ్చిన శ్రీనివాస్‌కు ఆమె ఇంట్లోనే కనిపిస్తుంది. అంతేకాదు, త్వరలోనే ముఖాన్ని మార్చుకుని మురారికి దగ్గర కావాలని అనుకుంటున్నట్లు తండ్రికి చెబుతుంది. దీంతో అతడు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తాడు. ఇక, తన ఫ్రెండ్‌తో ఆదర్శ్ బాధను వ్యక్తం చేసుకోగా.. అతడు కృష్ణ తప్పిదం వల్లే ముకుంద చనిపోయిందని చెప్తాడు. దీంతో ఆదర్శ్‌కు ఆమెపై కోపం పెరిగిపోతుంది. ఆ వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణను నిందిస్తూ ఉంటాడు. అప్పుడామెకు ఇంట్లో వాళ్లు ఆమెకు అండగా నిలిచినా ఆదర్శ్ మాత్రం నమ్మడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 16th

నువ్వు మేక వన్నె పులివి
ముకుంద చనిపోయిందన్న బాధలో కృష్ణను ఆదర్శ్ నోటికి వచ్చినట్లు తిడతాడు. స్వార్థం కోసం తన జీవితాన్ని నాశనం చేశావని ఆమెను నిందిస్తాడు. అప్పుడు కృష్ణ ఎంత నచ్చజెప్పినా వినిపించుకోడు. పైగా 'ముకుంద అడ్డు తొలగించుకోవడం కోసం అబద్ధం చెప్పావు. దానితో ఆగకుండా తనను లోకంలోనే లేకుండా చేశావు. శభాష్ కృష్ణ నీ ప్లానింగ్‌కు హ్యాట్సాఫ్. ఇంతచేసి అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌లాగా నటిస్తున్నావు. నువ్వు సమాజంలో తిరుగుతున్న క్రూర జంతువువి. మేక వన్నె పులివి నువ్వు' అంటూ తిట్టడంతో ఆమె ఏడుస్తూ వెళ్లిపోతుంది.

ముకుంద మరో ప్లాన్‌తో
తన ప్లాన్‌లో భాగంగా ముకుంద తండ్రిని తీసుకుని కొత్త ఇంటికి వస్తుంది. దీంతో ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చావని అడుగుతాడు. దీనికామె 'ఇన్నాళ్ళూ మనుషుల మధ్య ఉండి ఆడాను. ఇప్పుడు బయటకు వచ్చి ఆడటం మొదలుపెట్టాను. దూరంగా ఉండి ఆడాలి. ఇప్పుడు మనం అదే ఇంట్లో ఉంటే నిన్ను ఓదార్చడానికి వస్తే నేను అదే టైమ్‌కు అక్కడ ఉంటే అడ్డంగా దొరికిపోతాం. అన్నింటికీ ముఖ్యంగా నువ్వు వాళ్ళ కంట పడకూడదు. ఆవేశంలో నా కూతురు బతికే ఉందని నోరు జారితే అప్పుడు నేను నిజంగానే చావాల్సి వస్తుంది' అని హెచ్చరిస్తుంది.

Krishna Mukunda Murari

రిస్క్ చేయకపోతే కష్టం
ముకుంద మాటలకు శ్రీనివాస్ నేనెందుకు చెప్తాను అంటాడు. దీనికామె 'నా కన్న తండ్రి గురించి నాకు తెలుసు. నీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసు' అంటుంది. దీంతో అతడు అసలు ఏం చేయాలని అనుకుంటున్నావ్ అనగా.. ఏం చేయాలో చెప్పాను కదా అని ప్లాన్ వివరిస్తుంది. దీంతో శ్రీనివాస్ ఎందుకు ఇంత రిస్క్ అవసరమా అంటాడు. అప్పుడామె 'అవసరమే నాన్న.. ఇన్నాళ్ళూ నా ప్రేమ మురారి అర్థం చేసుకుంటాడు నా ప్రేమ గెలవకపోతుందా అని ఓపికగా ఎదురుచూశాను. ఏమైంది లైఫ్ లో రిస్క్ చేయకపోతే ఏది సాధించలేను' అంటుంది.

చనిపోయి బతికుండాలి
ముకుంద ప్లాన్ విన్నాక తండ్రి 'ఎందుకు ఈ పంతం? ఇప్పటికే నువ్వు బతికి ఉండి కూడా చనిపోయావని పరిస్థితి తీసుకొచ్చావు. మళ్ళీ ఏదేదో అంటున్నావు' అంటాడు. దీనికి ముకుంద 'నా ప్లాన్ అది కాదు.. బతికున్నా చనిపోయినట్టు ఉండాలి. చనిపోయి వాళ్ళ మధ్య బతికి ఉండాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుని భవానీ అత్తయ్య వచ్చేలోగా ఆ ఇంట్లో సెటిల్ అవాలి' అని చెప్తుంది. దీంతో తండ్రి ఇంకొకసారి ఆలోచించు నువ్వు చేస్తుంది కరెక్టా అని అంటే 'ఆ కుటుంబానికి ఇది జరగాల్సిందే, నువ్వు అనుకున్నది ఎలాగైనా సాధించమని మాట ఇచ్చావ్ కదా మళ్ళీ ఇలా మాట్లాడతావ్ ఏంటి' అంటుంది. దీనికాయన 'నా కూతురు పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటని ఆవేశంలో మాట ఇచ్చాను కానీ ఇలా ఆలోచిస్తుంటే భయంగా ఉంది' అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 16th

కృష్ణ మీద పగ ఉంది
తర్వాత ముకుంద.. మురారి మీద ప్రేమ.. కృష్ణ మీద పగ ఉందని తండ్రికి చెప్తుంది. దీనికాయన కృష్ణ ఏం చేసిందని అడుగుతాడు. అప్పుడామె 'మురారిని నేను ప్రేమించాను. తన మీద ప్రేమ తప్ప పగ ఉండదు. మురారి మనసు మారడానికి కారణం కృష్ణ. తనే అడ్డు లేకపోతే మురారి ఎప్పుడో నా సొంతం అవుతాడు. కానీ కృష్ణ అడ్డం తిరిగి ఏ ఆడపిల్ల చెప్పని మాట నా నోట చెప్పించి నన్ను ఘోరంగా అవమానించి ఈరోజు నా పరిస్థితికి కారణం అయింది. ఒకరిని ప్రేమతో మరొకరిని పగతో ఇద్దరినీ వదలను. నువ్వు నాకు అడ్డు రాకుండా సపోర్ట్ చెయ్' అంటుంది.

ముకుందను చూశాడు
ముకుంద.. మురారి ఇంటి బయట నిలబడి 'మురారికి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా ఉండాల్సిన నేను కాంపౌండ్ బయట ఉండాల్సి వచ్చింది. దీనికి కారణం నువ్వే కృష్ణ. నిన్ను వదలను నేను తిరిగి లోపలికి నువ్వు బయటకి పోయే రోజు దగ్గర్లోనే ఉంది' అనుకుంటుంది. మురారి అప్పుడే మెట్లు దిగుతూ గుమ్మం బయట ముకుంద ఉండటం చూసి షాక్ అవుతాడు. వెంటనే అక్కడకు వెళ్తాడు. అంతలోనే ముకుంద మాయం అవుతుంది. ఇంటి చుట్టూ పక్కల మొత్తం వెతుకుతాడు కానీ కనిపించదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. దీంతో ముకుంద సంతోషపడుతుంది.

Krishna Mukunda Murari

నా భ్రమలో బతకాలి
మురారి కంగారు చూసిన ముకుంద 'నేను చనిపోయానని నమ్ముతున్నావు. మళ్ళీ నేను కనిపించేసరికి వెతికి నీ భ్రమ అనుకుని వెళ్లిపోయావు. నాకు కావలసింది ఇదే. నేను పక్కన ఉన్నప్పుడు నాతో కలిసి బతకాలి. నేను లేనప్పుడు నా భ్రమలో బతకాలి. మొత్తంగా నేనే నీ బతుకు కావాలి. అందుకే ఈ చిన్న ప్రయత్నం' అనుకుంటుంది. తర్వాత మధు వస్తుంటే తనకు కనిపించకుండా తప్పించుకుంటుంది. తన నుంచి తప్పించుకుని వెళ్తుంటే రేవతి కిటికీలో నుంచి వాటర్ పారబోయగా ముకుంద మీద పడబోతాయి. ఆమె చూడగానే పారిపోతుంది. తర్వాత కృష్ణ వచ్చినా తప్పించుకుని వెళ్లిపోతుంది. ఇక, ముకుందను చూసిన మురారి ఆలోచనలో పడిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X