Krishna Mukunda Murari: మురారి ఇంట్లో దెయ్యం.. కృష్ణను చంపే ప్రయత్నం.. ఆదర్శ్ అంత మాట అనడంతో!

భారతదేశ వ్యాప్తంగా ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కృష్ణ ఎంతగా నచ్చజెప్పాలని చూసినా ఆదర్శ్ మాత్రం వినిపించుకోడు. పైగా ఆమెను ఘోరంగా తిడతాడు. మరోవైపు ముకుంద మాత్రం తన ఇంటిని మార్చేసి కొత్త ప్లేస్‌కు వెళ్తుంది. అంతేకాదు, తాను బతికి ఉన్నట్లు తెలియకూడదని తండ్రికి వార్నింగ్ ఇవ్వడంతో పాటు మురారిని పిచ్చోడిని చేయాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. తర్వాత ప్లాన్‌లో భాగంగా మురారి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెను మురారి చూస్తాడు. కానీ, తర్వాత కనిపించకుండా తప్పించుకుంటుంది. ఇలాగే మురారి తన భ్రమలోనే బతకాలని ముకుంద మరిన్ని వ్యూహాలు రచించుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 18th

ఆ ప్రేమే అంతం చేసేసింది

ముకుంద కనిపించడంతో మురారి ఆలోచనలో పడతాడు. దీంతో కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. అప్పుడతను 'నేను తప్పు చేశాను కృష్ణ. ముకుంద చనిపోవడానికి, ఆదర్శ్ ఇలా అయిపోవడానికి నేను కారణం కాదు కదా' అంటాడు. దీనికామె 'మీరు ఎందుకు అలా అనుకుంటారు? ఒకరి తలరాతకు మరొకరు ఎప్పుడూ కారణం కాదు' అని సర్ది చెప్తుంది. దీంతో మురారి 'పైకి కనిపిస్తున్న కారణాలు నావైపు వేలెత్తి చూపిస్తున్నాయి. ఒకప్పుడు నేను ముకుంద మీద చూపించిన ప్రేమ నన్ను తను మర్చిపోకుండా చేసింది. ఆ ప్రేమే నన్ను వదులుకోలేక తనని తానే అంతం చేసుకునేలా చేసింది' అంటాడు.

మురారికి అండగా నిలుస్తూ
మురారి మాటలకు కృష్ణ 'మీరు మంచి చేసి నిందని మీ నెత్తిన పులుముకోవాలని చూస్తున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించి తనని మోసం చేయలేదు. ఆదర్శ్ ప్రేమ కోసం మీ ప్రేమని త్యాగం చేశారు. అది మీ తప్పు ఎలా అవుతుంది' అంటుంది. దీంతో మురారి 'నేను ఎప్పుడూ ముకుంద మనసులో ఆశలు పెంచేలా ప్రవర్తించలేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక ముకుంద పరిచయస్థురాలిలాగా, ఆదర్శ్ భార్యగానే మిగిలిపోయింది. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. నన్ను నమ్ముతావా కృష్ణ' అని అడుగుతాడు. దీనికామె నమ్ముతాను అని చెబుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 18th

మధుకు కోపం రావడంతో

రేవతి వాళ్లు కృష్ణను ఆదర్శ్ అలా అనడం తప్పు అన్నట్లుగా మాట్లాడుకుంటారు. అంతలోనే మధు అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు నందినీ చెప్పబోతుండగా రేవతి అడ్డు పడుతుంది. తర్వాత ఆదర్శ్.. కృష్ణపై నిందలు వేసిన విషయం చెప్తుంది. దీంతో మధు 'పిచ్చి పట్టిందా వాడికి? ఇందులో కృష్ణ చేసిన తప్పు ఏంటి? ముకుంద అడ్డు తొలగించుకోవాలని అనుకుంటే ఆదర్శ్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మురారి ఇప్పుడు తన భర్త అతడిని చూసినందుకు ముకుందని బయటకి గెంటేయొచ్చు కదా' అంటూ కోపం ప్రదర్శిస్తాడు.

అసలు తప్పు ఆదర్శ్‌దే
ఆ తర్వాత మధు 'భార్య పోయిన బాధలో ఉన్నాడని వదిలేస్తే మరీ ఎక్కువ చేస్తున్నాడు. అసలు తప్పంతా ఆదర్శ్‌ది. ముకుందకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదని వాళ్ళను చూసిన నాకే అర్థం అయింది. ఇంక తనకి ఎందుకు అర్థం కాలేదు' అని సీరియస్ అవుతాడు. తర్వాత అతడితో గొడవ పడేందుకు వెళ్తుంటే రేవతి ఆపుతుంది. పరిమళ కృష్ణకి ఫోన్ చేసి హాస్పిటల్‌కు రమ్మని పిలుస్తుంది. కానీ తాను ఇప్పుడు రాలేనని అంటుంది. తర్వాత మురారితో మాట్లాడుతుంది. తన ఫ్రెండ్ ఆస్పత్రి ఓపెనింగ్స్‌కు కృష్ణను పంపించమంటే తాను మాట్లాడతానని అంటాడు.

దెయ్యంగా ముకుంద రచ్చ

నైట్ అవగానే మధు మందు తాగుతుంటాడు. అప్పుడు 'నువ్వు చావడం ఏమో కానీ నాకు ప్రశాంతత లేకుండా చేశావు. చచ్చి ఏం సాధించావు మురారి, కృష్ణని దూరం చేయగలిగావు. నాలుగు రోజులు బాధపడిన తర్వాత వాళ్ళే మర్చిపోతారులే' అంటాడు. అతడి గ్లాస్ పక్కనే మరో గ్లాస్ ఉండడంతో ఆదర్శ్ పెట్టాడని అనుకుంటాడు. కానీ, పక్కన ముకుంద కూర్చుని కనిపిస్తుంది. అప్పుడామె 'ఏంటి మధు నన్ను తిట్టుకుంటున్నావా? నేను ఆత్మహత్య చేసుకోవడానికి కృష్ణ కదా కారణం. మరి నన్ను తిట్టుకుంటావ్ ఏంటి' అంటుంది. దీంతో మధు పారిపోతాడు.

మురారికి కూడా వార్నింగ్
తర్వాత ముకుంద.. మురారికి కనిపించకుండా పిలుస్తుంటుంది. దీంతో అతడు 'ఎందుకు ఇలా నన్ను సాధిస్తున్నావు? నువ్వు లేవు వెళ్లిపో' అని గట్టిగా అరుస్తాడు. దీనికామె 'ఈ లోకం నుంచి అయినా వెళ్లిపోతాను కానీ.. నిన్ను ఎలా విడిచి పోతాను? అది సాధ్యమా? నీ మీద గుండెల నిండా ప్రేమతో ఉన్నప్పుడే నన్ను చేరుకోలేదు. ఇక ఇప్పుడు ఏం చేరుకుంటావు? కృష్ణ నువ్వు కలిసి హాస్పిటల్ ఓపెనింగ్‌కు వెళ్తున్నారంట కదా. నా చావుకి కారణమైన కృష్ణతో నువ్వు సంతోషంగా తిరుగుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను. ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు' అంటుంది.

కొట్టుకున్న అన్నదమ్ములు

మురారిని మాత్రం ఏమీ చేయనని ముకుంద చెబుతుంది. తర్వాత మధు వచ్చి ముకుంద తనకు కనిపించిందని మురారికి చెప్తాడు. దీంతో అతడిలో సందేహాలు మొదలవుతాయి. ఇక, ఆదర్శ్ ఇంట్లో వాళ్లతో కఠువుగా మాట్లాడుతుంటాడు. అది చూసి మురారి తిడతాడు. దీంతో ఆదర్శ్ 'నువ్వేం నాకు సలహాలు ఇవ్వొద్దు ఉందిగా నీ మాయలాడి పెళ్ళాం తనకి ఇచ్చుకో' అంటాడు. దీంతో మురారి కోపంతో అతడి కాలర్ పట్టుకుంటాడు. దీంతో ఆదర్శ్ కూడా పట్టుకోగా ఇద్దరూ కలబడుతుంటారు. అప్పుడు మురారికి ముకుంద కనిపిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X