Krishna Mukunda Murari: కృష్ణ, మురారికి ప్రమాదం.. ఆదర్శ్‌ను చంపుతానన్న మధు.. అసలేం జరిగిందంటే!

ఈ మధ్య కాలంలో కొత్త ప్రోగ్రామ్స్ వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుంద కనిపించడంతో మురారి ఆలోచనలో పడతాడు. దీంతో కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. అప్పుడతను ముకుంద విషయంలో తప్పు చేశానా అని బాధపడుతుంటాడు. దీంతో కృష్ణ భర్తను ఓదార్చి ధైర్యం చెప్తుంది. తర్వాత ఆదర్శ్ అన్న మాటలను మధుకు చెప్పడంతో అతడు కోప్పడతాడు. తర్వాత మందు తాగుతుండగా ముకుంద వచ్చి దెయ్యంలా భయపెడుతుంది. తర్వాత మురారిని కూడా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు, కృష్ణను చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. చివర్లో మురారి, ఆదర్శ్ కొట్టుకుంటుండగా ముకుంద కనిపించి షాక్ ఇస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 19th

బాధ్యతను నిర్వర్తించలేను
ఆదర్శ్ మాటలకు కృష్ణ బాధపడుతుంటే నందినీ వచ్చి ఓదార్చుతుంది. 'ఆదర్శ్ అన్నయ్య మాటల గురించి ఆలోచిస్తున్నావా? తను అలా మాట్లాడతాడని అసలు అనుకోలేదు. అన్నయ్య తప్ప నీ గురించి ఎవరూ తప్పుగా అనుకోవడం లేదు. ఏదో బాధలో అంటున్నాడు. నాలుగు రోజుల తర్వాత తనే వచ్చి నీకు సారి చెప్తాడు' అని ఓదార్చుతుంది. దీనికామె 'నా బాధ పెద్దత్తయ్య నాకు బాధ్యత అప్పగించారు. కానీ నిర్వర్తించలేకపోతున్నాను. ముకుంద, ఆదర్శ్‌ను ఒక్కటి చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ముకుంద ప్రాణాలతో లేదు దానికి కారణం నేనేనని ఆదర్శ్ అంటున్నాడు. ఎందుకు ఇలా చేశావని అడిగితే ఏం సమాధానం చెప్పాలి' అని బాధపడుతుంది. దీంతో నందినీ 'అమ్మ వచ్చేలోపు ఆదర్శ్ మారతాడు' అని ఓదార్చుతుంది.

భ్రమైనా, నిజమైనా కావొచ్చు
ముకుంద దెయ్యంలా వచ్చిందని మధు భయపడుతుంటాడు. అప్పుడు మురారి అతడికి ధైర్యం చెప్తాడు. అలాగే 'ముకుంద విషయంలో భయపడాల్సిన పని లేదు. అది నిజం కావచ్చు భ్రమ కావచ్చు. చివరికి నీ నీడ కావచ్చు. మనం భయపడేకొద్ది భయపడుతూనే ఉంటాం. ధైర్యంగా ఉంటే దెయ్యం కూడా పారిపోతుంది' అని చెప్తాడు. కానీ మధు మాత్రం ఎంతచెప్పినా భయపడుతుంటాడు. తర్వాత మురారి గదిలో ఆలోచిస్తూ కూర్చుంటే కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. దీనికతడు 'మన జీవితం గురించి ఆలోచిస్తున్నాను' అని చెబుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 19th

కృష్ణకు అబద్ధం చెప్పాడు
ఆ తర్వాత మురారి 'నాకు వేరే ఆలోచనలు ఏమి లేవు. ఎవరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు' అంటాడు. దీనికామె 'ఇప్పుడు మనం ఎవరికి భయపడుతున్నాం' అని అంటుంది. కానీ, అతడు మాత్రం ముకుంద ఆత్మ తనకు కనిపిస్తున్న విషయాన్ని దాచేసి 'రేపు హాస్పిటల్ ఓపెనింగ్‌కు వెళ్తున్నాం' అంటాడు. కానీ కృష్ణ మాత్రం వద్దని అంటుంది. దీంతో ఆమె మూడ్ మార్చడానికి మురారి కాసేపు సరదాగా మాట్లాడతాడు. మరోవైపు, ఆదర్శ్ తాగుతూ ఉంటే సుమలత వచ్చి 'నువ్వు ఇలా మందు తాగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది' అంటుంది.

సర్వనాశనం చేసేశారని
సుమలత మాటలతో ఆదర్శ్ మీరందరూ కలిసి నా మనసుని నాశనం చేశారని అంటాడు. దీనికామె 'నిన్ను ఇలా చూస్తే అమ్మ ఏమైపోతుంది? భయంగా ఉంది' అంటుంది. దీంతో ఆదర్శ్ 'నాకు జరిగిన అన్యాయం చూసి.. వాళ్ళ అంతు చూస్తుంది' అని కోపంగా చెప్తాడు. తర్వాత ఆమె నువ్వు అనుకున్నట్టు కృష్ణ అని చెప్పబోతుంటే 'తన పేరు కూడా నా దగ్గర తీసుకురావద్దు. ముకుంద చావుకు కారణమై నా జీవితాన్ని నాశనం చేసిన తనని ఇంకా వెనకేసుకొస్తున్నావు. తనని ఇంట్లో ఉండనిస్తే మిమ్మల్ని కూడా విడగొడుతుంది' అంటూ నిందలు వేస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 19th

నీకు చెప్పినా అర్థం కాదు
ఆదర్శ్ మాటలకు రేవతి 'ఆపరా.. ఈ ఇంట్లో ఏ స్వార్థం చూసుకోకుండా అందరి సంతోషం గురించి ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ మాత్రమే. తనకు నష్టం జరుగుతుందని తెలిసినా కూడా అందరూ సంతోషంగా ఉంటారంటే ఆ పని చేసేందుకు వెనుకాడదు. మనసులో ఇంత విషాన్ని పెట్టుకున్న నీకు కృష్ణ గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. అన్ని తెలుసుకున్న రోజున అంత మంచి మనిషిని అపార్థం చేసుకున్నానా అని పశ్చాత్తాపపడతావు' అని తిడుతుంది. దీంతో ఆదర్శ్ తను మేకవన్నె పులి తన గురించి మీకే అర్థం అవుతుంది అంటాడు.

రెచ్చగొట్టిన ఆదర్శ్ తీరు
ఉదయాన్నే మురారి 'కృష్ణతో నేను సంతోషంగా ఉంటాను నువ్వేం చేస్తావో చూద్దాం. నువ్వు ఎక్కడ ఉన్నా చూడు ముకుంద. రోజురోజుకీ కృష్ణ మీద నా ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది. నువ్వు నాకు కనిపించడం భ్రమ కాదు నిజమైతే వెళ్లిపో. బతికున్నప్పుడు ఎటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావ్ ఇప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా వెళ్లిపో' అని అంటాడు. ఇక, వాళ్లు కిందకు వస్తుంటే ఆదర్శ్ రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. దీంతో మధుకు కోపం వచ్చి గొడవ పెట్టుకుంటాడు. అంతేకాదు, వాళ్లను ఏమైనా అంటే చంపడానికి కూడా వెనుకాడనని వార్నింగ్ ఇస్తాడు.

కృష్ణకు తప్పిన ప్రమాదం
ఆదర్శ్ వ్యవహరిస్తున్న తీరుపై ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అతడిని తీసుకు వచ్చి తప్పు చేశారని రేవతి అంటుంది. ఇక, మురారి కృష్ణని హాస్పిటల్‌కు తీసుకెళ్తూ ముకుంద మాటల గురించి ఆలోచిస్తాడు. అప్పుడు 'కృష్ణను హాస్పిటల్‌కు తీసుకెళ్తే ఏదో చేస్తానని అన్నావ్ కదా మేము వెళ్తున్నాం ఇప్పుడు నువ్వేం చేయలేవు' అనుకుంటాడు. అప్పుడే కృష్ణ చీర బండిలో పడి ఇద్దరూ కిందపడిపోతారు. కృష్ణ పడిన పక్కనే ఒక పెద్ద బండరాయి ఉంటుంది. అప్పుడే అటుగా ముకుంద వెళ్లగా ఆమెను మురారి చూస్తాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X