Krishna Mukunda Murari: శోభనం విషయంలో ట్విస్ట్.. కృష్ణ ప్లాన్‌తో ముకుందకు షాక్.. నిజం చెప్పేస్తారా!
భారతదేశంలో ఉన్న చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
తన దగ్గరకు వచ్చిన మురారితో ముకుంద ఎలాగైనా ఆదర్శ్‌ను పంపించేయమని చెబుతుంది. కృష్ణకు నిజం తెలిస్తే వెళ్లిపోతుందని, అప్పుడు మనిద్దరం సంతోషంగా ఉందామని కూడా ముకుంద.. మురారితో అంటుంది. ఇదంతా కృష్ణ పక్కనుంచి వింటుంది. తర్వాత మురారి వెళ్లి తన ఫ్రెండ్‌తో చెప్పుకుని బాధ పడతాడు. అనంతరం కృష్ణ అతడిని కలిసి తనకు నిజం తెలిసిపోయిందని, ధైర్యంగా ఉండమని చెబుతుంది. ఇక, ఆదర్శ్ విషయంలో ముకుంద ప్రవర్తిస్తున్న తీరుపై మధు డౌట్ పడుతుంటాడు. అదే మాటను ఆదర్శ్‌కు కూడా చెబుతాడు.

అమ్మాయి ఆత్మహత్య అని
నిజం తెలుసుకున్న కృష్ణ.. మురారితో 'రిసార్టులో శోభనం తప్పించుకోవడం కోసం కాలు బెణికినట్టు నాటకం ఆడింది. అప్పుడే మీకు చెప్తే ఎక్కడ కంగారుపడతారోనని ఆగాను. తన మనసులో ఏముందో తెలుసుకుని చేప్దామని అనుకున్నా. కానీ ఈలోపు మీ దగ్గరే బయట పడింది' అంటుంది. అంతలోనే టీవీలో ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అమ్మాయి ఆత్మహత్య అనే వార్త వస్తుంది. అది చూసి కృష్ణ 'మీరు కూడా ఎక్కడ ముకుంద ఆత్మహత్య చేసుకుంటుందోనని భయపడుతున్నారా' అంటుంది. దీంతో 'ముకుంద చస్తే బాగుండు అనిపిస్తుంది' అంటాడు.
శోభనం ఆపాలని నిర్ణయం
ఆ తర్వాత మురారి 'ముకుంద చనిపోతే బాగుండు. నాలుగు రోజులు ఏడ్చి మర్చిపోతాము. లేదంటే ఏంటి ఇది మారిపోయిందని అనుకుని వెళ్ళి ఆదర్శ్ తీసుకొచ్చి ఇద్దరినీ కలిపితే.. ఇప్పుడు మళ్ళీ నాకు నువ్వే కావాలి అంటుంది' అని కోపంగా కృష్ణకు చెప్తాడు. దీనికామె 'చావు సమస్యకు పరిష్కారం కాదు.. అలా ఆలోచించకూడదు. ముందు ముకుంద - ఆదర్శ్ మధ్యన శోభనం ఆపేయాలి. కానీ తను ఆపితే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అందుకే మనమే శోభనం ఆపుదాం' అని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ ఒక ఐడియాను మురారికి చెవిలో వివరిస్తుంది.

పంతులు దగ్గరకు వెళ్లాం
ముకుంద టిఫిన్ తీసుకు వస్తుందని ఆదర్శ్ వెయిట్ చేస్తుంటాడు. దీంతో రేవతి వెళ్లి ఆమెను అడుగుతుంది. అప్పుడు ముకుంద 'అవును కదా.. ఆ సంగతి మర్చిపోయాను. పిండి పులిసిపోయిందని పని అమ్మాయి బయట పడేసింది' అని అబద్ధం చెప్తుంది. దీంతో ఆమెను రేవతి తిడుతుంది. సరే అనియన్ దోస ఇవ్వు తింటానని అంటే అది వద్దులే అంటుంది. కృష్ణ వాళ్ళు రాగానే ఇద్దరూ ఎక్కడికి వెళ్లారని రేవతి అడుగుతుంది. దీనికి కృష్ణ 'ఏసీపీ సర్ పంతులు దగ్గరకి వెళ్లారు. ఆయన నాకు ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళాను' అని అబద్ధం చెబుతుంది.
శోభనం ముహూర్తం కోసం
ఆ తర్వాత కృష్ణ 'శోభనానికి మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని అన్నారు కదా అందుకని. తొందర ఎక్కువ కదా ముహూర్తం కనుక్కోవడానికి వెళ్లారు' చెప్తుంది. దీంతో రేవతి 'అదేంటి తింగరి? ఇన్నాళ్ళూ రెండు జంటలకు శోభనం జరగాలని కదా అనుకుంది. ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ముహూర్తం పెడితే ఏం మాట్లాడలేక ఊరుకున్నారు' అంటుంది. అప్పుడు మురారి 'ఇన్నాళ్ళూ మన కోసం వాళ్ళు ఆగితే.. ఇప్పుడు మాకు మాత్రమే శోభనం జరిగిపోతుందని మనసులో లోటు ఉండిపోతుందని ఆగాము' అని మురారి.. ముకుందను చూస్తూ అడుగుతాడు.
ముకుందకు బిగ్ ట్విస్టు
అంతలోనే ఆదర్శ్ వచ్చి ముహూర్తం కుదురిందా అంటాడు. దీనికి మురారి 'అవును నీకు కుదిరిన ముహూర్తానికి నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాను' అని చెప్తాడు. దీంతో ముకుంద 'మా శోభనం జరగకుండా ఆపమంటే వీళ్ళు ముహూర్తం పెట్టించుకుని వచ్చారా? నేను ఎవరి సొంతం కాకూడదని అనుకుంటున్నానో మురారి కూడా కృష్ణ సొంతం కాకూడదు. ఈ శోభనం జరగకూడదు' అని మనసులో అనుకుంటుంది. అప్పుడు ఏంటి ముకుంద ఆలోచిస్తున్నావ్ అని ఆదర్శ్ అడిగితే.. షాక్ అయినట్టు ఉందని కృష్ణ కౌంటర్ వేస్తుంది.

గ్రహచారం ప్రకారమేగా
కృష్ణ మాటలతో ముకుంద 'ఆశ్చర్యం కాదు అనుమానం. ఆ పంతులు దగ్గర కుదరని ముహూర్తం ఈ పంతులు దగ్గర ఎలా కుదిరింది' అని అడుగుతుంది. దీంతో కృష్ణ 'ఆ పంతులు గోచారం ప్రకారం ముహూర్తం చూశారు. ఈ పంతులు గ్రహచారం ప్రకారం చూశారు' అని చెప్తుంది. దీంతో రేవతి 'పంతులు చెప్పాక ఇక కాదనడానికి ఏముంది? మీరు తొందరగా రెడీ అవండి రెండు జంటలని గుడికి తీసుకెళ్ళి పూజ చేయించాలి' అని చెప్తుంది. ఇక, గదిలోకి వచ్చిన తర్వాత మంచి ప్లాన్ వేశావంటూ కృష్ణను మురారి మెచ్చుకుంటాడు. మధుకు మాత్రం ఏదో డౌట్ వస్తుంది.
ఆదర్శ్‌కు నిజం చెప్పి
ఆ తర్వాత కృష్ణ 'తన ప్రమేయం లేకుండానే తనకు నచ్చినట్టు జరగాలని ముకుంద అనుకుంటుంది' అంటుంది. దీంతో మురారి 'ఏం చేసినా తను అనుకున్నది జరగదు. ఆదర్శ్‌తోనే తన జీవితం.. అన్నట్లు ఆదర్శ్ సంగతి మర్చిపోయాము. రిసార్ట్‌లో శోభనం ఆగిపోయినట్టు ఇక్కడ ఆగిపోతే వాడికి అనుమానం వస్తుంది కదా' అంటాడు. దీంతో కృష్ణ 'పరిస్థితి అంతవరకు తీసుకురాకూడదు. ముకుంద ఎలా ప్రవర్తించినా తట్టుకునేలా తనని మనం ప్రిపేర్ చేయాలి' అంటుంది. దీంతో నిజం చెప్తే వాడు తట్టుకోలేడు అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











