Krishna Mukunda Murari: మారిపోయిన ముకుంద రూపం.. కృష్ణకు దూరంగా మురారి.. నేటి కథలో ఎన్నో ట్విస్టులు

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఆదర్శ్ మాటలతో బాధపడుతున్న కృష్ణను నందినీ వచ్చి ఓదార్చుతుంది. అప్పుడామె భవానీ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నానని బాధపడుతుంది. దీంతో నందినీ ధైర్యం చెప్తుంది. మధు దెయ్యం గురించి భయపడుతుంటే మురారి ధైర్యం చెప్తాడు. కానీ, ఈ విషయం కృష్ణ దగ్గర దాస్తాడు. అనంతరం నందినీ వెళ్లి ఆదర్శ్‌తో మాట్లాడగా.. అతడు కృష్ణ మీద మరిన్ని నిందలు వేస్తాడు. ఇక, ముకుందను రెచ్చగొట్టాలని మురారి, కృష్ణపై ఇంకా ప్రేమను చూపిస్తుంటాడు. అలా బైక్‌పై వెళ్తున్న వాళ్లకు ప్రమాదం జరుగుతుంది. అది ముకుంద చూస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 20th

ముకుంద ఆత్మ అని నమ్మాడు
బైక్ మీద నుంచి పడిపోయినా కృష్ణకు పెద్ద ప్రమాదం తప్పుతుంది. వెంటనే ఆమెను మురారి పైకి లేపుతాడు. అప్పుడే కారులో అటుగా వెళ్తున్న ముకుందను చూసి షాక్ అవుతాడు. దెబ్బలు తగల్లేదు కదా అని కృష్ణ.. మురారిని అడుగుతుంది. లేదని చెప్పి నీకు ఎలా ఉందని అడుగుతాడు. దీనికామె జస్ట్ మిస్ కొంచెం ఉంటే తలకి ఆ రాయి తగిలేదని అంటుంది. కారులో వెళ్తున్న ముకుంద.. మురారి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు మురారి 'నాకు అర్థమైంది కృష్ణ. ముకుంద కభ్రమ కాదు నిజమే. తన ఆత్మ మన ఇంట్లోనే తిరుగుతుంది' అనుకుంటాడు.

అన్నట్లే ప్రమాదం జరిగిందని
తర్వాత మురారి 'మనల్ని విడదీయాలని చూస్తుంది. నిన్ను ఓపెనింగ్ తీసుకెళ్తే ఊరుకొనని చెప్పింది. అన్నట్టుగానే ప్రమాదం జరిగేలా చేసింది. ముకుందని చాలా తక్కువ అంచనా వేశాను. చచ్చి కూడా సాధిస్తుంది' అనుకుంటాడు. తర్వాత కృష్ణ హాస్పిటల్‌కు వెళ్దామా అంటే వద్దు నా మనసు ఏదో కీడు సంకిస్తుంది ఇంటికి వెళ్లిపోదాం అని చెప్తాడు. అప్పుడు వాళ్లకు చెప్పేందుకు మురారి ఫోన్ చేయగా ముకుంద లిఫ్ట్ చేసి 'కృష్ణను తీసుకెళ్లవద్దని చెప్పాను వినలేదు. అది చచ్చింది ఏం చేస్తుందని అనుకున్నావ్ కానీ రిజల్ట్ చూశావుగా' అంటూ భయపెడుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 20th

మురారికి అబద్ధం చెప్పడంతో
అనంతరం ముకుంద 'నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి అంత ఈజిగా ఎలా వదిలేస్తాను అనుకున్నావు వదలను. మళ్ళీ చెప్తున్నా నువ్వు కృష్ణకు అంత దూరంగా ఉంటే తను అంత సేఫ్‌గా ఉంటుంది. ఈసారి చిన్న ప్రమాదంతో తప్పించుకుంది. ఈసారి ఇలాగే చేస్తే ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేను. బుద్ధిగా ఇంటికి పోయి నేను చెప్పినట్టు చెయ్' అని కాల్ కట్ చేస్తుంది. దీంతో మురారి అదే నెంబర్‌కు మళ్లీ కాల్ చేస్తాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి 'ఎవరూ లేరు మీరు ఇప్పుడే కదా ఫోన్ చేసింది' అని అబద్ధం చెప్తాడు. ముకుంద అతడికి డబ్బులు ఇస్తుంది.

ప్లాన్ బీ అమలు చేస్తానంటూ
తన ప్లాన్‌లో మురారి చిక్కుకోవడంతో ముకుంద సంతోషంగా ఉంటుంది. 'నేను ఆత్మ అని తను నమ్మేశాడు. కృష్ణను షికారుకు తీసుకువెళ్లడం కాదు కదా.. పక్కన కూర్చోవడానికి కూడా భయపడతాడు. ప్లాన్ ఏ సక్సెస్. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి కృష్ణ వాళ్ళు దూరంగా ఉంటారు. పక్కనే ఉండి కాపాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్లాన్ బీ అమలు చేస్తాను. ఎక్కడ ప్రేమ పోగొట్టుకొన్నానో అక్కడే గెలుచుకుంటాను. ఈసారి నన్ను ఎవరూ అపలేరు' అని అనుకుంటుంది. తర్వాత కృష్ణ, మురారి ఇంటికి వచ్చేయడంతో రేవతి కంగారు పడిపోతుంది.

మళ్లీ రెచ్చగొట్టేసిన ఆదర్శ్
త్వరగా వచ్చేశారేంటని రేవతి అడగ్గా యాక్సిడెంట్ అయిందని కృష్ణ బదులిస్తుంది. దీంతో రేవతి దెబ్బలు ఏమీ తగల్లేదు కదా అని అడగ్గా.. ఆదర్శ్ వచ్చి 'అలా చేసే వాళ్ళకి ఇలాగే తగులుతాయి. మనం ఒకరికి అన్యాయం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చేసిన ఖర్మకి శిక్ష అనుభవించేలా చేస్తాడు' అంటాడు. దీంతో రేవతి ఎంత చెప్పినా నీకు అర్థం కాదా మారవా అని అడుగుతుంది. దీనికతడు 'మంచిగా ఉండే వాడిని అందరూ కలిసి నన్ను ఇలా చేశారు. అసలు ఇలాంటి వాళ్ళతో ఇలా ఉండటమే కరెక్ట్' అనగా మధు వార్నింగ్ ఇస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 20th

ఎలాంటి వాళ్లమో తెలుసు
ఆదర్శ్ మాటలకు కృష్ణ 'మేము స్పీడుగా వెళ్తున్నా మాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. మేము ఎలాంటి వాళ్ళం అనేది దేవుడికి తెలుసు. అందుకే క్షేమంగా బయట పడేలా చేశాడు. మేము ఏ తప్పు చేయలేదని అనడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి? ఒక్కోసారి మనం వేరే వాళ్ళను తప్పుగా అర్థం చేసుకుంటాం. ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ ఏదో అడ్డు వస్తుంది. అది తెలుసుకో ఆదర్శ్. ఆ అడ్డు తొలగించి చూడు అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు' అంటుంది. దీంతో మురారి అర్థం చేసుకోని వాళ్లకు చెప్పినా వేస్ట్ అంటూ వెళ్లిపోతాడు.

కృష్ణకు దూరంగానే మురారి
ఓపెనింగ్‌కు తీసుకెళ్లకుండా వచ్చేయడంతో మురారిపై కృష్ణకు డౌట్ వస్తుంది. మరోవైపు ముకుంద ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు రెడీ అయిపోతుంది. తర్వాత మురారి 'నేను కృష్ణతో క్లోజ్‌గా ఉంటే తన ప్రాణాలు తీసేస్తుంది. ఈ ప్రమాదం జరగకపోయి ఉంటే నేను ఇదంతా భ్రమ అనుకునే వాడిని. ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉంది నేను ఎవరికో ఫోన్ చేస్తే అక్కడ ఉంది. తను లేకపోయినా ఆత్మగా మారి నా వెంటే ఉంది. ఈ ఆత్మలు కథల్లో మాత్రమే ఉంటాయని అనుకున్నాను కానీ నిజ జీవితంలో కూడా ఉంటాయా' అనుకుని కృష్ణకు దూరంగా ఉండాలని అనుకుంటారు. ఇక, ఇంట్లో వాళ్లు శాంతి పూజా చేయించాలని అనుకుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X