Krishna Mukunda Murari: కృష్ణకు సారీ చెప్పిన ఆదర్శ్.. స్టేషన్‌లో మురారి మిస్సింగ్.. కథలో ఊహించని మలుపు
చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ప్లాస్టిక్ సర్జరీ జరిగిన తర్వాత తన ముఖాన్ని చూసుకుని ముకుంద సంతోషిస్తుంటుంది. అప్పుడే తండ్రి వచ్చి ఆమెను గుర్తు పట్టకపోవడంతో ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటుంది. తర్వాత కృష్ణను అరెస్ట్ చేయించమని తండ్రికి చెబుతుంది. దానికి ఆయన ఓకే అని చెప్పినా.. బయటకు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్‌ను కలిసి మురారిని లాకప్ డెత్ చేయించమని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు అతడి దగ్గరకు వెళ్లి అరెస్ట్ చేస్తారు. అప్పుడు ముకుంద రాసిన లెటర్‌ను మరణ వాగ్మూలంగా చూపిస్తారు. అది చూసి ఆదర్శ్ మరోసారి అపార్థం చేసుకుంటాడు.

పోతూ పోతూ నాశనం చేసింది
ముకుంద మరణ వాంగ్మూలం చదివిన తర్వాత ఆదర్శ్.. మురారిపై కోపాన్ని పెంచుకుంటాడు. అప్పుడు రేవతి 'ముకుంద పోతూ పోతూ నా కొడుకు జీవితం నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. అన్నీ అబద్ధాలు రాసింది' అని ఏడుస్తుంది. దీంతో ఆదర్శ్ 'ముకుంద చావుకు నీ కొడుకు కారణం అనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదు' అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడు మురారి 'నేను ఏ తప్పు చేయలేదు. దీని నుంచి ఎలా బయట పడాలో చూసుకుంటాను' అని అందరికీ ధైర్యం చెప్పేసి పంపించేస్తాడు.
ముకుందకు శ్రీనివాస్ అబద్దం
మురారి గురించి ముకుంద ఆలోచిస్తుండగా శ్రీనివాస్ వస్తాడు. అప్పుడామె కృష్ణను అరెస్ట్ చేయించావా అని అడగ్గా.. 'చేయించాను.. కానీ నువ్వు అనుకున్నట్టు కృష్ణను కాదు. నీతో వైట్ పేపర్ మీద సంతకం చేయించి మురారీనే నిన్ను మోసం చేయించాడని చెప్పి శిక్ష వేయించాను' అని మనసులో అనుకుంటాడు. అయితే, కృష్ణనే అరెస్ట్ చేయించాడనుకుని తండ్రికి ముకుంద థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత 'నా విజయానికి మొదటి మెట్టు పడింది. మురారి కృష్ణని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తను బయటకి రాకూడదు' అని అంటుంది.
బయటకు రావడం కష్టమని
ముకుంద మాటలకు శ్రీనివాస్ 'హోమ్ మినిస్టర్ ఇన్ ఫ్యూయెన్స్‌తో అరెస్ట్ చేయించాను. ఎవరు రికమెండ్ చేసినా బయటకి రావడం కష్టం' అని చెప్తాడు. దీంతో ముకుంద మరి మురారి పరిస్థితి ఏంటి? తను ఎలా ఉన్నాడని అడుగుతుంది. దీనికాయన 'ఎలా ఉంటాడు నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాడు' అని చెప్తాడు. దీంతో ముకుంద 'మురారి శిక్ష అనుభవించడం ఏంటి' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తండ్రి 'కృష్ణకు దూరంగా ఉండటం అంటే మురారికి శిక్ష కదా' అని కవర్ చేస్తాడు. తర్వాత ముకుంద రేపు వెళ్లి మురారికి సాయం చేసి దగ్గర అవుతానని అంటుంది. కానీ, తండ్రి మాత్రం మనసులో 'రేపటి కల్లా మురారి లాకప్ డెత్ అయి ఉంటాడు' అని అనుకుంటాడు.
ఆదర్శ్‌పై చేయేత్తిన కృష్ణ
కృష్ణ వాళ్లు ఇంటికి వచ్చిన వెంటనే మురారిని బయటకు తీసుకు రావడం గురించి మాట్లాడుతుంటారు. అప్పుడు మధు 'కమిషనర్ అబ్బాయి నా ఫ్రెండ్ తనతో మాట్లాడాను. ఇందులో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడంట. మేమేమి చేయలేమని అంటున్నారు' అని చెప్తాడు. దీంతో కృష్ణ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఆదర్శ్ 'వాడు రాడు కృష్ణ మర్చిపో. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ మురారిని బయటకి తీసుకురాలేరు. జీవితాంతం జైలులో మగ్గి అక్కడే చావాల్సిందే' అంటాడు. దీంతో కృష్ణకు కోపం వచ్చి ఆదర్శ్ మీదకు చేయి లేపుతుంది.
వాడు పాపమే చేశాడంటూ
కృష్ణ మాటలకు ఆదర్శ్ 'తప్పు కాదు పాపం చేశాడు. వాడు చేసిన పాపాలకు తగిన శిక్ష పడింది. వాడి జీవితం జైలులో అంతం కావాల్సిందే మర్చిపో' అంటాడు. దీంతో కృష్ణ 'షటప్ ఆదర్శ్.. ఇంకొక మాట మాట్లాడితే ప్రాణాలు తీసేస్తాను. ఆయన్ని ఎవరైనా అర్థం చేసుకోకపోవచ్చు కానీ నువ్వు అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరి కన్నా మురారి గురించి నీకే బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు నువ్వు అలా మాట్లాడకూడదు' అంటుంది. తర్వాత ఆదర్శ్.. కృష్ణకు సారీ చెబుతాడు. కానీ, మొత్తం ఆదర్శ్ చేశాడని అపార్థం చేసుకుంటాడు.
ముకుంద చెప్పింది నిజం
ఆ తర్వాత ఆదర్శ్ 'ముకుంద మరణ వాంగ్మూలం చదివిన తర్వాత కూడా వాడిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? తన విషయంలో జరిగింది ఒకటి అయితే నేను అనుకున్నది ఒకటి. ముకుందను నేను ప్రేమించానని తెలుసుకుని మురారి తన ప్రేమని త్యాగం చేశాడని అనుకున్నాను. కానీ ప్రేమించి మోసం చేసి మోజు తీరిపోయాక నాతో పెళ్లి చేశాడు' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. అంతేకాదు, ముకుంద చెప్పిందే నిజం అంటాడు. తర్వాత కృష్ణకు కోపం వచ్చి మురారిని తానే విడిపించుకుంటానని చెబుతుంది.
స్టేషన్‌లో మురారి మిస్సింగ్
మురారికి కృష్ణ భోజనం తీసుకుని వెళ్తుంది. కానీ, అక్కడ అతడు కనిపించడు. దీంతో ఏమయ్యాడని స్టేషన్‌లో గొడవ చేయడంతో ఆమెను బలవంతంగా బయటకు పంపించేస్తారు. తర్వాత ఓ కానిస్టేబుల్ ఇందులో పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తాడు. దీంతో కృష్ణ వేరే స్టేషన్లకు కూడా వెళ్లి చూస్తుంది. కానీ, మురారి కనిపించడు. బాధగా ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు విషయం చెప్పగా ఆదర్శ్ సరిగ్గా జరిగిందని అంటాడు. అప్పుడు రేవతి మొత్తం అక్కకు చెప్పేశానని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











