Krishna Mukunda Murari: మురారి లాకప్ డెత్.. నిజం చెప్పేసిన కానిస్టేబుల్.. ముకుంద ఏం చేసిందంటే!
గతంలో కంటే ఇప్పుడు అభిరుచులు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుంద మరణ వాగ్మూలం చూసిన తర్వాత ఆదర్శ్ ఇంకా గొడవ చేస్తాడు. దీంతో కృష్ణకు కోపం వస్తుంది. తర్వాత ముకుంద దగ్గరకు తండ్రి రావడంతో చెప్పినట్లు చేశావా అని అడుగుతుంది. కానీ, అతడు మురారిని అరెస్ట్ చేయించి.. కృష్ణను చేయించనట్లుగా అబద్ధం చెప్తాడు. తర్వాత ఇంట్లో మళ్లీ మురారి ప్రస్తావన రావడంతో ఆదర్శ్ రెచ్చిపోతాడు. కృష్ణకు సారీ చెప్పిన అతడు.. మురారిని మాత్రం అపార్థం చేసుకుంటాడు. చివర్లో మురారి కోసం కృష్ణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ అతడు కనిపించడు. దీంతో మురారిని ఏదో చేస్తారని ఆమెకు సందేహం వస్తుంది.

భవానీ దేవికి షాకిచ్చిన మంత్రి
రేవతి ద్వారా మురారి గురించి తెలుసుకున్న భవానీ దేవి వెంటనే మినిస్టర్‌కు కాల్ చేస్తుంది. అప్పుడామె 'నా కోడలు ముకుంద సూసైడ్ చేసుకుంది. ఆ కేసుకు సంబంధించి మురారిని అరెస్ట్ చేశారు' అని చెప్తుంది. దీనికాయన 'అతడిని విడిపించమని ఫోన్ చేయలేదు కదా. అది అయితే నా చేతుల్లో లేదు. నాకంటే పవర్ ఉన్న వాళ్ళు, మహిళా మండలి సంఘం వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వారిని శిక్షించకుండా ఎలా వదిలేస్తారని నన్ను ఉతుకుతారు' అని చెప్తాడు. దీంతో అలా అనకండి మా మురారి తప్పు ఏం లేదు అని బ్రతిమాలుతుంది.
సాయం చేయనన్న మినిస్టర్
భవానీ దేవి మాటలకు మినిస్టర్ 'తన చావుకు కారణం మురారి అని చెప్పి ముకుంద సూసైడ్ నోట్‌లో ఉంటే తను అమాయకుడని అంటారేంటి? అయినా ఈ విషయంలో నేను ఏ సహాయం చేయలేను' అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు మంత్రి పక్కనే ఉన్న శ్రీనివాస్ 'స్నేహితుడు కోసం చాలా చేస్తున్నావు థాంక్స్. ఇప్పుడు మురారిని విడుదల చేస్తే మళ్ళీ వాడి చుట్టూ పిచ్చిదానిలా తిరుగుతుంది. రూపం మారినా దాని తలరాత మారకుండా పోతుంది' అంటాడు. దీనికి మినిస్టర్ 'మురారి తలరాత మార్చేస్తున్నాం కదా. నీ బిడ్డకి ఏం కాదులే' అని హామీ ఇస్తాడు.
ఆదర్శ్‌కు మధు హెచ్చరికలు
ఆదర్శ్ మందు తాగుతుంటే మధు వచ్చి 'ఎవరు ఎంత చెప్పినా ఎందుకు నీ ప్రవర్తన మార్చుకోవడం లేదు' అని నిలదీస్తాడు. దీంతో ఆదర్శ్ క్లాస్ పీకడానికి వస్తే వినే ఓపిక లేదని అంటాడు. అప్పుడు మధు 'కృష్ణను ఎందుకు బాధ పెట్టేలా మాట్లాడతావు. ఇంకొకసారి ఇలా జరగకూడదు' అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఆదర్శ్ 'పెగ్గు కోసం బెగ్గింగ్ చేసే నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా? పో బయటకి' అని అవమానిస్తాడు. దీనికతడు 'నాకు వచ్చే కోపానికి ఇక్కడే నీ బుర్ర పగలగొట్టాలని ఉంది కానీ. ఈ ఇంటి మనుషుల పట్ల ప్రేమ ఉంది' అని అంటాడు.
లాకప్ డెత్ అని చెప్పడంతో
రేవతికి భవానీ దేవి ఫోన్ చేసి మినిస్టర్ హెల్ప్ చేయనని చెప్పినట్లు చెబుతుంది. అంతేకాదు, 'ఆయన శ్రీనివాస్ ఫ్రెండ్ కదా అతనికి మాట ఇచ్చి ఉంటాడు. డైరెక్ట్‌గా అడిగితే మహిళా సంఘాలని ఏవేవో మాట్లాడుతున్నాడు' అని చెప్తుంది. రేవతి ఏడుస్తుంటే రెండు రోజుల్లో వచ్చేస్తున్నానని అంటుంది. కృష్ణ ఇంటికి కానిస్టేబుల్ వచ్చి 'ఏసీపీ సర్ మంచివారు. కానీ ఆయన వెనుక కుట్ర జరుగుతుంది. ఏదో ఒకటి చేసి ఆయన్ని బయటకి తీసుకురండి. లేదంటే లాకప్ డెత్ జరుగుతుంది' అని చెప్తాడు. ఆ మాటకు కృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది.
శ్రీనివాస్ బాబాయి చేతిలోనే
ఆ తర్వాత కృష్ణ 'శ్రీనివాస్ బాబాయ్ ఒక్కరు మాత్రమే మురారిని కాపాడగలుగుతాడు. అవసరం అయితే ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడతా' అని బయల్దేరుతుంది. తర్వాత ముకుందను శ్రీనివాస్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. మురారిని కలిసి కృష్ణని బయటకి తీసుకురావడానికి వెళ్తానని ముకుంద చెప్పేసరికి శ్రీనివాస్ టెన్షన్ పడతాడు. ఈ టైమ్ లో వద్దు తర్వాత వెళ్లవచ్చని సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ ముకుంద మాత్రం అందుకు ఒప్పుకోదు. ఈ ఒక్కరాత్రి ముకుందని ఆపితే తెల్లారే సరికి మురారి ఉండదని ఆలోచిస్తాడు. అప్పుడే కృష్ణ శ్రీనివాస్ ఇంటికి వస్తుంది.
తండ్రి మోసం తెలుసుకుని
కృష్ణను తన ఇంట్లో చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఆమెను వెళ్లిపోమని చెబుతాడు. కానీ, కృష్ణ మాత్రం మురారిని విడిపించమని బ్రతిమాలుతుంది. ఇదంతా ముకుంద చూసి మురారిని ఎందుకు అరెస్ట్ చేయించారని అనుకుంటుంది. అంతలోనే కృష్ణ లాకప్ డెత్ గురించి చెబుతుంది. వాళ్ల మాటలు విని ముకుంద కోపంతో రగిలిపోతుంది. వెంటనే 'ఆపండి నాన్న నేను నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి' అని నిలదీస్తుంది. దీనికాయన 'అవును మురారిని నేనే అరెస్ట్ చేయించా. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. కృష్ణ అమాయకురాలు' అంటాడు.
మురారికి నిజం చెప్పింది
తండ్రితో ముకుంద గొడవ పడుతుంది. మురారి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అంటుంది. కానీ, ఆయన చెప్పనని అనడంతో చనిపోతానని బెదిరిస్తుంది. దీంతో తప్పక శ్రీనివాస్.. మురారి జాడ గురించి చెప్పేస్తాడు. మరోవైపు, కృష్ణ నిరాశగా ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఆదర్శ్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. దీంతో కృష్ణ తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. అనంతరం ముకుంద.. మురారి దగ్గరకు వెళ్లి 'ఈ దెబ్బలు ఏంటి కొట్టారా? తప్పు నాదే నన్ను క్షమించు. కృష్ణని అరెస్ట్ చేయమని చెప్తే నాన్న నిన్ను అరెస్ట్ చేయించారు. నాన్నకి నీ మీద ఇంత కోపం ఉందని నాకు తెలియదు తప్పంతా నాదేనని తన చెంపలు తానే వాయించుకుంటుంది. నీకు దగ్గర కావాలని ఏదో చేయాలని అనుకుంటే ఏదో జరిగింది' అని నిజం చెప్పేస్తుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











