Krishna Mukunda Murari: మురారిని కాపాడిన మీరా.. నిజం చెప్పిన కానిస్టేబుల్.. ఆమె ఎంట్రీతో బిగ్ ట్విస్ట్

ప్రేక్షకుల టేస్ట్‌లో చేంజ్ కనిపిస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:రేవతి ద్వారా మురారి గురించి తెలుసుకున్న భవానీ దేవి.. మినిస్టర్‌కు కాల్ చేసి అతడిని విడిపించమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ, మంత్రి ఆమె విన్నపానికి ఒప్పుకోనని చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి మురారిని లాకప్ డెత్ చేయించబోతన్నారని చెప్తాడు. దీంతో శ్రీనివాస్ దగ్గరకు కృష్ణ వెళ్తుంది. అప్పుడు ఆమె మాటలు విన్న ముకుంద ఏం జరిగిందని నిలదీయడంతో మురారిని అరెస్ట్ చేయించానని చెప్తాడు. అప్పుడు ముకుంద.. మురారిని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. అంతేకాదు, ఎమోషన్‌లో అసలేం జరిగిందో మొత్తం అతడికి చెప్పేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 25th

నిజం చెప్పేసిన ముకుంద:స్టేషన్‌కు వచ్చిన ముకుంద 'కృష్ణను అరెస్ట్ చేయించమని చెప్తే నాన్న నిన్ను చేయించాడు. నాన్నకు నీ మీద ఇంత కోపం ఉందని తెలియదు. తప్పంతా నాదే. నీకు దగ్గర కావాలని ఏదో చేయాలని అనుకుంటే ఏదో జరిగింది. ఏంటి మురారి నన్ను అలా చూస్తున్నావ్ నేను ముకుందను' అంటుంది. దీంతో అతడు షాక్ అవుతూ 'నువ్వు ముకుంద ఏంటి? తను చనిపోయింది కదా ఎవరు నువ్వు? ముకుందనని ఎందుకు చెప్తున్నావు' అని అడుగుతాడు. ఇదంతా ముకుంద తనలో తాను ఊహించుకుంటుంది. కానిస్టేబుల్ రావడంతో ఈ లోకంలోకి వస్తుంది.

మురారిని విడింపించింది:మురారిని వదలమని ముకుంద గొడవ చేస్తుంది. అప్పుడు ఎస్సై వచ్చి 'నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేశాం' అని చెప్తాడు. అప్పుడు ముకుంద హోమ్ మినిస్టర్‌కు ఫోన్ చేసి ఎస్సైతో మాట్లాడిస్తుంది. వెంటనే పోలీసులు మురారిని వదిలేస్తారు. అప్పుడు నడవలేక ఇబ్బంది పడుతున్న మురారిని చూసి ముకుంద చాలా బాధపడుతుంది. వెంటనే మురారికి సారి చెప్తుంది. అప్పుడతను 'మీరు రాకపోయి ఉంటే బయటకి వచ్చి ఉండే వాడిని కాదు. అలాంటిది మీరు సారి చెప్తున్నారు' అంటాడు. దీంతో ముకుంద రావడం అలస్యమైనందుకు అంటుంది.

మీరాగా మారిన ముకుంద:ఆ తర్వాత మురారి 'నేను పోలీస్ ఆఫీసర్‌ను. నన్ను నేను కాపాడుకోలేకపోయాను. ఇంట్లో వాళ్ళు విడిపించడానికి ట్రై చేసి ఉంటారు. వాళ్ళ వల్ల కూడా కాలేదు మీరు ఎలా విడిపించారు? ఇంతకీ మీరు ఎవరు' అని ప్రశ్నిస్తాడు. దీంతో 'నేను ముకుంద.. కాదు కాదు ముకుంద ఫ్రెండ్ మీరాను. హోమ్ మినిస్టర్ కూతురు ఫ్రెండ్‌ను' అంటూ కవర్ చేస్తుంది. దీంతో మురారి 'ముకుంద వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్ ఫ్రెండ్. మీరు చెప్తే ఎలా రిలీజ్ చేశారు' అని అనుమానంగా అడుగుతాడు. దీంతో మేమంతా ఫ్రెండ్స్ కాబట్టి కాదనలేక ఒప్పుకున్నారు అని అంటుంది.

అబద్దాలు చెప్పిన మీరా:తనకు సాయం చేసినందుకు మురారి.. మీరా అలియాస్ ముకుందకు థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడామె 'ముకుంద చనిపోయే ముందు నాకు కాల్ చేసింది. మురారి లేకుండా నేను బతకలేను అందుకే వెళ్లిపోతున్నానని చెప్పింది. నీ మీద ముకుందకు ఎప్పుడు కోపం లేదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంది' అని చెప్తుంది. తర్వాత తన ఇంటికి రమ్మని మురారి పిలుస్తాడు. అప్పుడు ముకుంద ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఇక, కృష్ణ ఇంట్లో కూర్చుని ఏడుస్తుంటుంది. అంతేకాదు, పెద్దత్తయ్య వచ్చేలోపు మనం ఏమీ చేయలేమా అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 25th

ముకుంద ఫ్రెండ్ వల్లే:మురారి గురించి కృష్ణ బాధపడుతుంటే.. ఆదర్శ్ మాత్రం అతడు బయటకు రాడని అనుకుంటాడు. అంతలోనే కానిస్టేబుల్స్ మురారిని తీసుకుని వస్తారు. అప్పుడతను 'ఏసీపీ సర్ ఇంటికి తిరిగి వచ్చారన్నా.. ఆయన్ని మీరు చూస్తున్నారంటే దానికి కారణం ఒకావిడ. ముకుంద ఫ్రెండ్ అంట. తను వచ్చి విడిపించింది' అని చెప్తాడు. కృష్ణ అది నిజమేనా అని మురారిని అడిగితే నిజమేనని అంటాడు. అప్పుడు ఆదర్శ్ 'నువ్వు అసలు బయటకి రావని అనుకున్నాను. బయటకి వచ్చేశావ్ లక్కీ ఫెలో. ఎవరు విడిపించారు ముకుంద ఫ్రెండా? చాలా ఆశ్చర్యంగా ఉందే. నువ్వే తనని మోసం చేశావని క్లియర్‌గా సూసైడ్ నోట్ రాసి చనిపోయింది కదా. ఈ విషయం తన ఫ్రెండ్‌కు కూడా తెలిసే ఉంటుందే అయినా నిన్ను ఎలా విడిపించింది' అని అడుగుతాడు.

మీరాపై ఆదర్శ్ డౌట్లు:తర్వాత ఆదర్శ్ 'తన స్నేహితురాలు చావుకు కారణమైన వాడిని కాపాడింది అంటే తను స్నేహితురాలు ఎలా అవుతుంది ద్రోహి అవుతుంది. అలాంటి ద్రోహులను నడిరోడ్డు నిలబెట్టి ప్రాణాలు తీసేయాలి' అంటాడు. దీంతో మురారి 'నోర్ముయ్.. ఇంకొక్క మాట ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడొద్దు. ముకుంద ఫ్రెండ్ అయి ఉండి కూడా సూసైడ్ నోట్ నిజం కాదని నమ్మి నన్ను విడిపించింది. కానీ నువ్వు నాతో చిన్నప్పటి నుంచి కలిసి ఉండి నేనెంటో తెలిసి కూడా నన్ను నమ్మలేకపోతున్నావ్. ఆవిడ గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదు' అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 25th

అందులో తప్పు లేదు:మీరా గురించి మురారి, ఆదర్శ్ మధ్య గొడవ జరుగుతుంది. మురారిని చూసి ఇంట్లో వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు రేవతి 'ఆ లెటర్ ముకుంద రాసి ఉండదు. శ్రీనివాస్ చేసి ఉంటాడు' అంటుంది. దీంతో మురారి 'ఆదర్శ్ నా ఫ్రెండ్.. వాడే నా గురించి తెలిసిన వాడు నన్ను అర్థం చేసుకోలేదు. నా తప్పేమీ లేకపోయినా నేను దక్కలేదనే కదా ఆత్మహత్య చేసుకుంది. అలాంటప్పుడు శ్రీనివాస్ అంకుల్ తప్పుగా అర్థం చేసుకోవడంలో ఆశ్చర్యం ఏముంది' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X