Krishna Mukunda Murari: భవానీ ఇంట్లో అడ్డంగా దొరికిన మీరా.. నీ భర్త కావాలంటూ కృష్ణతో.. సూపర్ ట్విస్ట్

ఈ మధ్య కాలంలో ఊహించని కంటెంట్‌తో కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారిని కాపాడిన మీరాకు థ్యాంక్స్ చెప్పేందుకు భవానీ దేవి వెళ్లిందని తెలిసి ఆదర్శ్ కోప్పడతాడు. దీంతో కృష్ణ అతడికి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. తర్వాత భవానీ.. మీరాను వెతుక్కుంటూ వెళ్లగా.. ఆమె దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. దీంతో చలించిపోయిన భవానీ ఆమెను తనతో పాటు ఇంటికి వచ్చేయమని అడుగుతుంది. మొదట యాక్టింగ్ చేసినా తర్వాత ఓకే చెప్తుంది. మీరా ఇంటికి వస్తుందన్న విషయం తెలిసి అందరూ ఆమె కోసం ఎదురు చూస్తుంటారు. ఇక, ముకుంద తండ్రిని అతడి స్నేహితులు పరామర్శించేందుకు వస్తారు.

Krishna Mukunda Murari Serial Today Episode March 28th

దెబ్బలు అప్పుడే తగ్గియా అని:మురారి వైపు మాట్లాడుతున్న నందినీని ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటాడు. దీంతో మురారి కలుగజేసుకుని 'ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో నీకు నాకు ఉండేందుకు ఎంత హక్కు ఉందో.. తనకూ అంతే హక్కు ఉంది' అంటాడు. దీనికతడు 'పోలీసుల దెబ్బలు అప్పుడే తగ్గిపోయాయా? నీతులు చెప్పడానికి వచ్చావు. నీలాగే నందు కూడా నీతులు చెప్తుంటే ఇల్లు వదిలి పొమ్మని చెప్తున్నా. అదే నువ్వు చెప్తే పర్మినెంట్‌గా ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పాల్సి వస్తుంది' అంటూ దురుసుగా మాట్లాడతాడు. దీంతో అతడిపై నందిని సీరియస్ అవుతుంది.

అలాంటి రోజు వస్తుందంటూ:నందినీ మాటలతో ఆదర్శ్ 'మీరంతా ఒక్కటే.. మీరు చెప్పేది కూడా ఒక్కటే. అయినా నేను వెళ్లిపోయినప్పుడే నా కోసం రావాల్సింది కానీ ఎవరూ రాలేదు. ముకుంద అడ్డు తొలగించుకోవడం కోసం అప్పుడు నా దగ్గరకు వచ్చారు' అని మళ్లీ నిందిస్తాడు. దీంతో నందినీ ఎంత చెప్పినా వినవా అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు మురారి 'వాడు ఎంత చెప్పినా వినడు. నిజం ఏంటో వాడంతట వాడు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు వాడే అర్థం చేసుకుంటాడు' అని నందిని తీసుకెళ్తాడు. తర్వాత ఆదర్శ్‌తో మాట్లాడటానికి ఎందుకు వెళ్ళావని రేవతి అడుగుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 28th

మురారి బాధ.. మీరా ఎంట్రీ:తల్లి అడగ్గానే మురారి 'వాడు మాట్లాడకపోతే చాలా కష్టంగా ఉంది అందుకే వెళ్లాను' అంటాడు. దీంతో కృష్ణ 'ఇప్పుడు తను ఉన్న పరిస్థితిలో మనం ఎదురుపడితే ఇంకా ఆవేశ పడుతున్నాడు. తన కోపం పోయే వరకు మనం దూరంగా ఉండటం మంచిది' అని సలహా ఇస్తుంది. మరోవైపు, మీరాను తీసుకుని భవానీ ఇంటికి వస్తుంది. అప్పుడామె మనసులో 'మొదటి సారి ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను. అనుకున్నది సాధించకుండానే వెనక్కి వెళ్లిపోయాను. కానీ ఈసారి మాత్రం వెనుకడుగు వేసేది లేదు' అని అనుకుంటుంది.

కృష్ణ అవమానాన్ని తలుస్తూ:భవానీతో కలిసి వచ్చిన మీరా ఇంట్లోకి కుడి కాలు పెట్టి వస్తుంది. అప్పుడు కృష్ణ చేసిన అవమానం తలుచుకుంటుంది. ఇంట్లో వాళ్ళకు భవానీ.. మీరాను పరిచయం చేస్తుంది. నా బిడ్డ ప్రాణాలు కాపాడావ్ అని రేవతి తనకు కృతజ్ఞతలు చెప్తుంది. తర్వాత భవానీ 'ఈ ఇంట్లో పరిచయం చేయాల్సిన ముఖ్యమైన వ్యక్తి నా ప్రియమైన కోడలు తింగరి కృష్ణ' అంటుంది. అప్పుడు ముకుంద మాత్రం మనసులో 'నాకు మాత్రం ప్రియమైన శత్రువు కదా' అని అనుకుంటుంది. తర్వాత భవానీ.. నీకు ఏ సమస్య వచ్చినా కృష్ణకి చెప్పుకో తను పరిష్కరిస్తుందని అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 28th

కృష్ణే నా సమస్య అత్తయ్యా:భవానీ మాటతో మీరా.. కృష్ణే నా సమస్య అని అనుకుంటూ పైకి మాత్రం ఆమెను పొగుడుతుంది. తర్వాత కృష్ణ కూడా హెల్ప్ చేస్తానని అంటే.. 'నీ మొగుడు కావాలి ఇచ్చేయ్.. అయినా నువ్వు ఇచ్చేదేంటి నేను లాక్కోవడానికి కదా వచ్చింది' అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్ వచ్చి మీరా వైపు కోపంగా చూస్తాడు. మురారిని కాపాడిన మీరా తనే అని ఆదర్శ్‌కు పరిచయం చేస్తుంది. దీంతో సీరియస్‌గా చూస్తాడు. దీంతో తన భార్య చనిపోయింది కదా అందుకే డల్ గా ఉన్నాడని భవానీ కవర్ చేస్తుంది. తర్వాత మీరా ఇకపై ఇక్కడే ఉంటుందని అందరికీ చెబుతుంది.

దండను తీసేద్దామనుకుని:తర్వాత భవానీ.. మీరాను ముకుంద అని పిలుస్తుంది. కానీ, పొరపడ్డానని చెప్తుంది. తర్వాత ఆమెకు ముకుంద రూమ్ ఇవ్వమని నందినీకి చెబుతుంది. అప్పుడు మీరా.. ముకుంద ఫొటోకు వేసిన దండ తీయాలని అనుకుంటుంది. తర్వాత మురారిని విడిపించినందుకే ఆదర్శ్ తనపై కోపంగా ఉన్నాడని మీరా అర్థం చేసుకుంటుంది. అందుకే ఆదర్శ్‌తో మంచిగా ఉండాలని అనుకుంటుంది. అంతేకాదు, నెల రోజుల్లోపు మురారిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. తర్వాత మీరా లైఫ్ గురించి భవానీ చెప్పగానే కృష్ణకు డౌట్లు మొదలవుతాయి.

దెబ్బలు తగిలితే విరక్తిగా:కృష్ణ డౌట్ పడడంతో భవానీ 'నాకు ఆ డౌట్ వచ్చింది కానీ.. జీవితంలో చాలా దారుణమైన దెబ్బలు తిన్నట్టు అనిపించింది. కొన్ని ఎదురుదెబ్బలు తగిలితే జీవితం మీద విరక్తి వస్తుంది. అలాంటి వాళ్ళు విరక్తి బతుకు గురించి ఆలోచిస్తారు. మీరా కూడా అలాంటిదే ఏ ఆశలు కోరికలు ఉన్నట్టు అనిపించలేదు' అని పొగుడుతుంది. తర్వాత కృష్ణ ఆమెపై జాలి చూపిస్తుంటే మురారి వార్నింగ్ ఇస్తాడు. ఇక, మురారి షర్ట్ తీసుకుని మీరా మాట్లాడుతుండగా నందినీ వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X