Krishna Mukunda Murari: అడ్డంగా దొరికిపోయిన మీరా.. ఆదర్శ్ మాటలు వినడంతో.. కృష్ణకు మరో డౌట్
ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
నందినీని ఇంట్లో నుంచి వెళ్లిపోమని ఆదర్శ్ అనడంతో మురారి అతడితో గొడవ పడతాడు. తర్వాత కృష్ణ అతడికి సర్ధి చెబుతుంది. దీని తర్వాత ఆ ఇంటికి భవానీ.. మీరాను తీసుకుని వస్తుంది. అప్పుడు అందరికీ పరిచయం చేస్తుంది. ఆదర్శ్ మాత్రం ఆమెను చూసి కోప్పడతాడు. మీరా బ్యాగ్రౌండ్‌పై కృష్ణకు డౌట్ వస్తుంది. కానీ, ఆమె జాలి పడడంతో మురారి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. తర్వాత మీరా తన ప్లాన్ ఎలాగైనా వర్కౌట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఎలాగైనా కేవలం నెల రోజుల్లో మురారిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది.

ఆదర్శ్ విషయంలో భయంగా
భోజనం చేయడం కోసం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అప్పుడు భవానీ దేవి.. ఆదర్శ్‌ను కూడా పిలవమని చెబుతుంది. దీంతో నందినీ తను పిలిచినా రావడం లేదు అని సమాధానం ఇస్తుంది. అప్పుడే రేవతి 'నేను నా కొడుకు మురారిని ఒక రకంగా, తనను మరొక రకంగా చూస్తున్నానని అంటున్నాడు' అని చెప్తుంది. దీంతో భవానీ 'వాడిని ఇలాగే వదిలేస్తే ఇంట్లో అందరినీ శత్రువులు మాదిరిగా చూస్తాడు. వాడిని మార్చాలి' అంటుంది. వీళ్లంతా ఇక్కడ ఉండగా మీరా అలియాస్ ముకుంద మాత్రం మురారి షర్ట్ పట్టుకుని గదిలోకి వచ్చి మురిసిపోతుంది.
నాకోసం వచ్చేయ్ మురారి
మీరా ఊహల్లోకి మురారి వస్తాడు. అప్పుడామె 'మురారి నేను నీ ముకుందను. నీ కోసం చూడు ఎలా మారిపోయానో. ఈ షర్ట్ నీకు చాలా బాగుంటుంది కానీ.. ఇది వేసుకుని నువ్వు కృష్ణ పక్కన ఉంటే బాగోదు. అదే నా పక్కన ఉంటే నీ అందం రెట్టింపు అవుతుంది. అసలు నీకు కృష్ణ సెట్ అవదు. ఎందుకు నువ్వు దాన్ని పట్టుకుని వేలాడతావు? వచ్చేయ్ మనం ఇద్దరం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దాం' అంటుంది. అప్పుడే అక్కడకు కృష్ణ రావడంతో షర్ట్ తీసి దాచి పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆమెను భోజనానికి కిందకు రమ్మని పిలిచి వెళ్ళిపోతుంది.

ఇష్టం లేకపోతే వెళ్లిపోతాం
ఆదర్శ్ కిందకు రావడంతో భవానీ భోజనం చేయమని చెప్తుంది. కానీ, అతడు మనసు బాలేదని అంటాడు. దీంతో ఏమైందని అడగ్గా 'ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఉంటే.. మనసు కష్టంగా ఉంటుంది' అని చెప్తాడు. దీంతో నందినీ 'మురారి, కృష్ణ ఉండటం ఇష్టం లేదని అంటున్నాడు. నన్ను కూడా ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడు' అని తల్లికి చెప్తుంది. దీంతో మురారి, కృష్ణ అంత కష్టంగా ఉంటే వెళ్లిపోతామని లేస్తారు. అప్పుడు భవానీ సీరియస్‌గా కూర్చోమని చెప్తుంది. కొన్ని బంధాలు నిలబడాలంటే కొన్నింటిని లెక్కలోకి తీసుకోవాలి అని ఆమె చెబుతుంది.
మీరాను పంపించేయమని
తర్వాత భవానీ 'కొన్నింటిని లెక్క తీసుకోకూడదు. కొన్నాళ్ళు నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉన్నావు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళను దూరంగా పొమ్మంటున్నావా' అని అడుగుతుంది. దీనికి ఆదర్శ్ 'నేను చెప్పింది మీరా గురించి. శిక్ష పడాల్సిన వాళ్ళకు శిక్ష పడకుండా చేసింది. తనని ఇంట్లోకి తీసుకురావడం నాకు నచ్చలేదమ్మా' అంటాడు. అదంతా ఆమె వింటుంది. అప్పుడు 'నా అనుమానమే నిజమైంది. ఇప్పుడు కృష్ణ, మురారి అంటే ఆదర్శ్‌కు ఇష్టం లేదు. ఇది ఒకందుకు మంచిదే. వాళ్ళు గొడవ పడితేనే కదా నా పని సులువు అవుతుంది' అని మీరా అనుకుంటుంది.
ఆలోచనలు దారి తప్పాయి
ఆదర్శ్ పదే పదే మీరాను పంపించేయమని అంటాడు. దీంతో భవానీ 'నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను కానీ.. ఎప్పుడు కొట్టలేదు ఈరోజు కొట్టాను. మొదటిసారి నిన్ను కొట్టాను అంటే నీ ఆలోచనలు దారి తప్పాయి. అర్హత ఉన్నవాళ్ళకే ఈ ఇంట్లో చోటు ఉంటుంది. అర్హత లేనివాళ్ళు ఎప్పటికైనా వెళ్లిపోవాల్సిందే ముకుందలాగా' అంటుంది. దీంతో మీరా 'నేను ఎక్కడికి పోలేదు అత్తయ్య. ఈ ఇంట్లో ఎక్కువగా ఉండే అర్హత నాకు మాత్రమే ఉంది. అది మీకు తొందర్లోనే అర్థం అవుతుంది' అని మనసులో అనుకుంటుంది.

యాక్టింగ్ ఇరగదీసిన మీరా
అనంతరం మీరా వచ్చి యాక్టింగ్ షురూ చేస్తుంది. 'ఇంత పెద్ద కుటుంబంతో కలిసి ఉంటానని కలలో కూడా ఊహించలేదు' అని ఏడుస్తుంది. అందరూ తన యాక్టింగ్ నిజమని నమ్మేస్తారు. ఆదర్శ్ కోపాన్ని పోగొట్టాలని తన మనసు గెలుచుకోవాలని అనుకుంటుంది. అందరికీ తాను వడ్డిస్తానని అడుగుతుంది. మీరా.. ఆదర్శ్‌కు వడ్డిస్తుంటే కోపంగా చూస్తాడు. తర్వాత తనకు ఇష్టమైనట్టుగా ఫుడ్ వడ్డిస్తుంటే నా ఇష్టాలు నీకు ఎలా తెలుసని మీరాను ఆదర్శ్ గట్టిగా నిలదీస్తాడు. దీంతో సుమలత నువ్వు సీరియస్‌గా చూసేసరికి టెన్షన్‌లో వేసి ఉంటుంది అంటుంది.
కృష్ణకు డౌట్.. దండను
ముకుంద ఫొటోకు దండ ఉండడం చూసి మీరా షాక్ అవుతుంది. ఎలాగైనా దాన్ని తీయించాలని అనుకుంటుంది. అనంతరం ఆమె అన్నం కలపడం చూసి కృష్ణ 'కృష్ణ నువ్వు అచ్చం మా ముకుందలాగే కలుపుకుంటున్నావు' అనడంతో అందరూ తనవైపు చూస్తారు. అప్పుడామె ఏదో చెప్పి కవర్ చేస్తుంది. తర్వాత మీరా 'ముకుందతో ఉన్న ఒక జ్ఞాపకం చాలా బాధేస్తుంది. అది తను రైలు కింద పడిపోవడం. అది గుర్తుకు వచ్చినప్పుడు నా గుండె తరుక్కుపోతుంది. మర్చిపోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నా. కానీ గోడ మీద ఉన్న ఫోటో చూస్తుంటే నాకు అదే గుర్తుకు వస్తుందని చెప్తుంది. ఏమి అనుకొకపోతే ఆ ఫోటోకి ఉన్న దండతో పాటు ఫోటో కూడా తీసేస్తారా' అని అడుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











