Krishna Mukunda Murari: దేవ్ పేరు చెప్పి షాకిచ్చిన మురారి.. అడ్డంగా దొరికిపోయిన ముకుంద
దాదాపు రెండు దశాబ్దాలకు ముందు నుంచే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే: ముకుంద గురించి నిజం తెలుసుకున్న తర్వాత కృష్ణ వాళ్ల శోభనం ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంటుంది. ఆ వెంటనే మురారికి ఓ ప్లాన్‌ను చెబుతుంది. ఆ తర్వాత వాళ్లు ఇంటికి వెళ్లి పంతులు దగ్గరకు వెళ్లామని చెబుతారు. అంతేకాదు, ఆదర్శ్ వాళ్లతో పాటు తమకు కూడా శోభనం ముహూర్తం పెట్టారని చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. అనంతరం వాళ్లను ప్రశ్నించగా గ్రహచారం ప్రకారమే ముహూర్తం పెట్టారని చెబుతుంది. ఇక, శోభనం ఆగిపోయినా ధైర్యంగా ఉండేలా ఆదర్శ్‌ను మోటివేట్ చేయాలని కృష్ణ, మురారి డిసైడ్ అవుతారు.
మురారిని రెచ్చగొట్టిన కృష్ణ: మురారి ఫోన్‌కు ముకుంద పంపిన మెసేజ్‌ను చూసిన కృష్ణ అతడిని వెళ్లమని చెబుతుంది. కానీ, మురారి మాత్రం 'ఆ చెత్త అంతా వినే ఓపిక నాకు లేదు. తనతో మాట్లాడాలంటేనే చిరాకుగా ఉంది. తను పిచ్చి వాగుడు వాగితే కోపంలో ఏదో ఒకటి చేస్తానని భయంగా ఉంది' అంటాడు. దీంతో కృష్ణ.. మురారిని రెచ్చగొడుతూ 'ఇది కాదులే ఇంకేదో విషయం ఉంది' అంటుంది. దీనికతడు 'అంటే ఏంటి ముకుందని ఫేస్ చేసే ధైర్యం లేదని అనుకుంటున్నావా' అంటాడు. అప్పుడు కృష్ణ 'నేను అంటుంది ఆ భయం కాదులే' అంటుంది.

మనల్ని దూరం చేయలేరు: తర్వాత కృష్ణ 'తను ఏం మాట్లాడితే.. నేను బాధపడతానోనని మీరు ఆలోచిస్తున్నారు. ఏబీసీడీల అబ్బాయి.. ఒక్క ముకుంద కాదు వంద ముకుందలు వచ్చినా కూడా నా ఏసీపీ సర్‌ను, నన్ను దూరం చేయలేరు' అంటుంది. దీంతో మురారి 'ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ముకుంద మనసు మార్చలేకపోయాము. ఇవన్నీ ఆలోచిస్తుంటే నిజంగానే భయమేస్తుంది' అంటాడు. దీనికామె 'ఏం చేయాలో ఒక ప్లాన్ వేసుకున్నాం కదా. దాన్ని ఫాలో అవుదాం. వెళ్ళి తనతో మాట్లాడి మీరు ఏం చెప్పాలో అది చెప్పి రండి' అంటుంది.
శోభనం నీకు నాకు అంటూ: తన దగ్గరకు వచ్చిన మురారితో ముకుంద 'ఏంటి మురారి ఏం చేస్తున్నావు? ఆదర్శ్‌ను ఇంట్లో నుంచి బయటకి పంపించేసి మా శోభనం ఆపమంటే మీ శోభనానికి ముహూర్తం పెట్టించుకుని వస్తావా' అంటుంది. దీనికతడు 'అవును నేనే ముహూర్తం పెట్టించా? తప్పేముంది' అంటాడు. దీంతో ముకుంద 'నాకు కోపం తెప్పించకు.. ఎప్పటికైనా శోభనం అనేది జరిగితే అది నీకు నాకు మాత్రమే జరగాలి. మన ఇద్దరికీ వేరే వాళ్ళతో కాదు' అంటుంది. ముకుంద మాటలతో మురారి అర్థం లేకుండా మాట్లాడొద్దని సీరియస్ అవుతాడు.
ఇది బాధ కాదు వెర్రితనం: మురారి మాటలకు ముకుంద 'నన్ను ప్రేమించిన వాడివి. నా బాధని అర్థం చేసుకుంటావని నీతో పంచుకుంటే.. అది తీర్చాల్సింది పోయి నీకు నచ్చినట్టు చేస్తుంటే ఏమనుకోవాలి? నా బాధ నీకు అర్థం అవుతుందా' అంటుంది. దీనికతడు 'ఇది బాధ కాదు వెర్రితనం. మనం ఆలోచిస్తున్నామనే దాని వల్ల బాధ, సంతోషం కలుగుతాయి. నీ బాధ పోవాలంటే ముందు నీ ఆలోచనలు మార్చి సంతోషంగా ఉండు. ఒకప్పుడు నీ గురించి ఆలోచిస్తే సంతోషం కలిగేది కానీ ఇప్పుడు బాధగా ఉంటుంది' అంటాడు. దీనికామె మారిపోయింది నువ్వు మారాల్సింది నువ్వే అంటుంది.
వెనక్కి రావడం కుదరదు: ఆ తర్వాత ముకుంద 'నా మాట విని ఆదర్శ్‌ను పంపించేసి మనం ఒకటయ్యే దారి చూడు' అని చెప్తుంది. దీంతో మురారి 'నువ్వు ఎంత చెప్పినా వినవా? ఆదర్శ్‌ను ఎక్కడికి పంపించమంటావ్? ఇది తన ఇల్లు. ఏం తప్పు చేశాడని పంపించాలి? నిన్ను ప్రేమించడం నీతో కలిసి బతకడం తాను చేసిన నేరమా? కలిసి ప్రయాణం చేయాలని అనుకున్నాం కానీ ఇప్పుడు మన దారులు వేరయ్యాయి. చాలా దూరం ప్రయాణం చేశాం. ఇక తిరిగి వెనక్కి రావడం కుదరదు' అని చెప్పేస్తాడు. కానీ ముకుంద మాత్రం నేను నీతోనే ఉన్నాను అని అంటుంది.

మీ దేవ్ అన్న దిగి రావాలి: ముకుంద మాటలకు మురారి 'అవును బంధాలకు విలువ ఇచ్చి తలవంచుకుని బతుకుతున్నా. నువ్వు కూడా నీ మూడు ముళ్ళ బంధానికి విలువ ఇచ్చి చూడు' అంటాడు. కానీ ముకుంద మాత్రం ఆఖరి సారి అడుగుతున్నా మన శోభనం అపుతున్నావా లేదా అని ప్రశ్నించగా ఆపను అంటాడు. దీంతో అయితే నేనే ఆపేస్తాను పైన దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడని ముకుంద అంటుంది. దీనికి మురారి 'దేవుడా? మీ దేవా' అని అడిగేసరికి షాక్ అవుతుంది. తర్వాత ముకుంద కవర్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ, మురారి దేవుడు ఇలాంటి కోరికలు తీర్చడంటాడు.
అడ్డంగా దొరికిన ముకుంద: శోభనం ముందు గుడిలో పూజలు చేయడం వాళ్ల ఆనవాయితీ కావడంతో రెండు జంటలను రేవతి తీసుకు వస్తుంది. అప్పుడు ముకుంద, మురారి అడుగులో అడుగులు వేస్తూ వెళ్తుంది. అది మధు చూసి కృష్ణకు చెప్తాడు. ఆమె మాత్రం కవర్ చేస్తూ అతడినే తిడుతుంది. అనంతరం ముకుంద.. మురారి గురించి దేవుడిని కోరుకుంటుంది. కృష్ణ మాత్రం న్యాయం చేయమని అడుగుతుంది. తర్వాత భార్యభర్తలు ఒకరి పాదాలపై ఒకరు నిలబడి ప్రదక్షిణలు చేయాలి అని పంతులు షాక్ ఇస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











