Krishna Mukunda Murari: అనుకున్నది చేసిన మీరా.. మురారిని చంపాలని ప్లాన్.. ఇదెక్కడి ట్విస్టు బాబోయ్
చాలా భాషల నుంచి కొత్త కంటెంట్‌తో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఆదర్శ్‌ను భోజనానికి పిలవకపోతే ఫీల్ అవుతాడని ఇంట్లో వాళ్లంతా మాట్లాడుకుంటారు. అప్పుడే అతడు అన్న మాటలను భవానీకి రేవతి చెప్తుంది. ఆ తర్వాత అతడు వచ్చి నానా మాటలు అంటాడు. దీంతో మురారి, కృష్ణ వెళ్లిపోబోతారు. అప్పుడు ఆదర్శ్ తాను అనేది మీరా గురించి అని, ఆమెను ఇంటి నుంచి పంపించమని అంటాడు. అదంతా విన్న మీరా.. అక్కడకు వచ్చి యాక్టింగ్ షురూ చేస్తుంది. ఏడుస్తూ తన పరిస్థితి గురించి అబద్దాలు చెప్తుంది. తర్వాత ఆమె స్వయంగా భోజనం వడ్డిస్తుంది. ఆ సమయంలో ముకుందలా చేస్తున్నావని కృష్ణ అడుగుతుంది.

మీరాపై కృష్ణకు మళ్లీ డౌట్
గోడ మీద ఉన్న ముకుంద ఫొటోను మీరా తీసేయమని అడగ్గానే భవానీ దేవి 'తను ఇంట్లో ఉన్నప్పుడు బాధపెట్టింది. ఇప్పుడు ఫోటో కూడా బాధపెడుతుంది. నీ చేతులతో నువ్వే తీసేయ్' అని ఆదర్శ్‌కు చెప్తుంది. అప్పుడు ఫోటో తీసేస్తున్నందుకు ముకుంద సంతోషిస్తుంది. కృష్ణ మాత్రం 'ఆదర్శ్ ముకుంద ఫోటో తీయమన్నాడు అంటే అర్థం ఉంది. మీరా ఎందుకు తీయమన్నది' అని డౌట్ పడుతుంది. ఆమె అలా ఆలోచిస్తుంటే ఏమైందని మురారి అడుగుతాడు. దీంతో కృష్ణ 'చనిపోయిన వాళ్ళ ఫోటో హాల్లో పెట్టి దండ వేస్తే తప్పా' అనగా.. కాదు అని చెబుతాడు.
మీరా ఎందుకు వద్దంది?
మురారి జవాబు చెప్పగానే కృష్ణ 'మన ఇంట్లో జరిగింది ఏంటి? మీరా తీయమని చెప్పగానే అందరూ కలిసి తీసేశారు. ముకుంద ఎలాగూ మన మధ్య లేదు కనీసం తన ఫోటో అయిన ఉండాలి కదా' అని బాధపడుతుంది. దీంతో మురారి 'ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముకుందను మనం ఏదో చేశామని ఆదర్శ్ అనుకుంటున్నాడు. ఫోటో చూస్తే అదే గుర్తుకు వస్తుందని తీయమన్నాడు' అని సర్ది చెప్తాడు. అప్పుడు కృష్ణ 'ఆదర్శ్ సరే.. మీరా ఎందుకు తీయమంది? తను చెప్పిన రీజన్ ఎందుకో కరెక్ట్‌గా అనిపించడం లేదు' అంటూ డౌట్ బయటపెడుతుంది.

షర్ట్ కనిపించడం లేదని
తర్వాత కృష్ణ 'బాగా తెలిసిన వాళ్ళు పోతే చనిపోయి దేవుడితో సమానంగా దండ వేస్తారు. అలాంటిది మీరా ఎందుకు అలా అన్నది. అసలు తన మనసులో ఏముంది' అని ఆలోచిస్తుంది. దీనికి మురారి 'తన అంతరంగం మంచిదే అయి ఉంటుంది. లేకపోతే నన్ను నమ్మి ఎలా విడిపిస్తుంది. తన గురించి ఎక్కువగా ఆలోచించొద్దు' అని చెప్తాడు. తర్వాత కృష్ణ.. మురారి షర్ట్ కనిపించడం లేదని వెతుకుతుంది. కానీ, ముందే ఆ షర్ట్ మీరా దొంగిలించి తన గదిలో పెట్టుకుంటుంది. మురారి గార్డెన్‌లోనే ఎక్కడో పడి ఉంటుందని వెళ్ళి చూస్తానని అంటాడు.
అది మీకు దొరకదు అని
మరోవైపు ముకుంద.. మురారి షర్ట్ తీసుకుని చూసి మురిసిపోతూ ఉంటుంది. మురారి బెడ్ మీద తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటుంది. తర్వాత హాల్లో మురారి ఏదో ఆలోచిస్తూ ఉంటే ముకుంద వచ్చి ఏంటి వెతుకుతున్నారు అని అడుగుతుంది. దీంతో అతడు షర్ట్ కనిపించడం లేదని చెప్పగా.. 'నా దగ్గరే ఉంది. ఇక అది దొరకదు. నువ్వు నాకు దగ్గరైనప్పుడు మాత్రమే దొరుకుతుంది' అని మనసులో అనుకుంటుంది. తర్వాత ఆ షర్ట్ అంటే ఇష్టమా అని అడగ్గా.. ఇష్టమే నాకంటే కృష్ణకి మరీ ఇష్టం అని మురారి సమాధానం చెబుతాడు.
తండ్రిని కలిసిన మీరా
తర్వాత మీరా బయటకు వెళ్తున్నానని చెప్తుంది. దీంతో మురారి.. కృష్ణను తోడుగా తీసుకెళ్లమని చెప్తాడు. దీంతో ఆమె 'ఎందుకు నా బండారం నేను బయట పెట్టుకోవడానికా' అని మనసులో అనుకుని ఒక్కదాన్నే వెళ్లిపోతానని అంటుంది. తర్వాత తండ్రిని కలిసి మాట్లాడుతుంది. కూతురిని చూసుకుని శ్రీనివాస్ సంతోషిస్తాడు. తర్వాత చేరాల్సిన చోటుకి చేరిపోయావా అని అడుగుతాడు. దీనికామె మురారి ఫ్యామిలీతో ఉన్న ఫోటో చూపించి.. కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఫోటో నీకు పంపుతా. అది నేను మురారి మెడలో దండలతో ఉన్న ఫొటో అని చెబుతుంది.

దేవుళ్లలా కొత్త అవతారం
మీరా మాటలకు శ్రీనివాస్ షాక్ అవుతాడు. తర్వాత ఆమె 'నాకు డబ్బు చాలా అవసరం. ఇల్లు త్వరగా అమ్మేయ్. మురారిని దక్కించుకోవడం కోసం చాలా ప్లాన్స్ చేయాలి. అందుకోసం డబ్బు కావాలి. దేవుళ్ళు కొత్త అవతారాలు ఎత్తుతారు. అలాగే నేను కూడా కొత్త అవతారం ఎత్తాను. అందుకే నేను దేవతను. నా ఫోటో పెట్టి దండ వెయ్' అంటుంది. దీంతో శ్రీనివాస్ 'మురారి అనే వాడిని లేకుండా చేస్తే ఈ బాధలు ఉండేవి కావు. కానీ పాపం కృష్ణ.. మురారిని ఏమైనా చేస్తే అన్యాయం అయిపోతుంది' అని బాధపడతాడు. వేరే ఏదో ఒక ప్లాన్ వేయాలని డిసైడ్ అవుతాడు.
ఎవరికి అన్యాయం చేశాం
ఇక, మురారి పోలీస్ అయి ఉండి నేనే పోలీసు దెబ్బలు తినాల్సి వచ్చింది అనడంతో కృష్ణ ఏడుస్తుంది. అలాగే 'మనం ఎవరికి ఏం అన్యాయం చేశాం మనకే ఇలా ఎందుకు జరుగుతుంది' అని బాధపడుతుంది. మురారి ఆమెను ఓదారుస్తాడు. అప్పుడు కృష్ణ 'ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ బాబాయ్ నిన్ను వదిలేస్తారా ? మళ్ళీ ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది' అంటుంది. దీంతో మురారి ఆమెను ఓదార్చుతాడు. తర్వాత ఆరద్శ్ మందు తాగడానికి వెళ్తుండగా మధు ఆపుతాడు. దీంతో అతడిని తీవ్రంగా అవమానిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











