Krishna Mukunda Murari: ముకుంద కన్నింగ్ ప్లాన్.. గుడిలో ఆదర్శ్‌కు గాయం.. కృష్ణ మరో స్కెచ్‌తో ఝలక్

గతంలో కంటే ఈ మధ్య కాలంలో కొత్త కంటెంట్ వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:ఆదర్శ్ విషయంలో ముకుందకు సర్ధి చెప్పేందుకు మురారి ప్రయత్నిస్తాడు. కానీ, ఆమె మాత్రం అతడి మాటలను అస్సలు పట్టించుకోదు. పైగా ఆదర్శ్‌ను పంపకపోతే అందరికీ నిజం చెప్పేస్తానని బెదిరిస్తుంది. దీంతో మురారి ఆమెకు ఎదురు తిరుగుతాడు. దీంతో దేవుడే కాపాడతాడని అంటుంది. అప్పుడు మురారి.. దేవ్ గురించి ప్రస్తావించి ముకుందకు షాకిస్తాడు. అనంతరం రేవతి అందరినీ తీసుకుని దేవుడి గుడికి వెళ్తుంది. అక్కడ పంతులు భార్యభర్తలు జంటగానే ప్రదక్షిణలు చేయాలని ఒక టాస్క్ ఇస్తాడు. దీంతో ముకుందకు మరో ఎదురుదెబ్బ తగులుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 4th

పంతుల చెప్పడంతో షాక్:దంపతులు ఒకరి కాళ్లపై ఒకరు కాళ్లు వేసి ప్రదక్షిణలు చేయాలని పంతులు చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. అప్పుడు కృష్ణ మనసులో ఇలాంటివి చేస్తేనే ముకుందకు బుద్ది వస్తుంది అనుకుంటుంది. అప్పుడు ముకుంద 'పూజ అయిపోయిందని అనుకుంటే మళ్ళీ ఇదేంటి? అసలు ఆదర్శ్ గాలి తగలకూడదని అనుకుంటుంటే మళ్ళీ తనను హత్తుకుని ప్రదక్షిణలు చేయడమా? ఇదంతా మురారి ప్లాన్ కాదు కదా. ఇది అసలు జరగకూడదు ఏదో ఒకటి చేయాలి' అని మనసులో అనుకుంటూ.. కొత్త ప్లాన్ కోసం ఆలోచనలో పడిపోతుంది.

భర్తతో పందెం పెట్టానని:పంతులు చెప్పిన తర్వాత ముకుంద 'గుడిలో ఇలాంటి ప్రదక్షిణలు చేస్తారా' అని అడుగుతుంది. దీనికి కృష్ణ దంపతులు ఇద్దరిని దగ్గర చేసే యజ్ఞం లాంటిది అంటుంది. అప్పుడు మధు 'అసలు ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరైనా వద్దని అంటారా? ముకుంద ఎందుకు వద్దని అంటుందో అర్థం కావడం లేదు' అంటాడు. దీంతో ముకుంద 'నేనేం వద్దని అనలేదు.. ఒకరి పాదాల మీద నిలబడటం అంటే నొప్పులు పుడతాయి కదా' అంటుంది. దీంతో మురారి, ఆదర్శ్ మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు అంటారు. తర్వాత కృష్ణ తాను భర్తతో పందెం పెట్టానని అంటుంది.

గట్టిగా పట్టుకోమని చెప్పి:ఆ తర్వాత కృష్ణ 'నన్ను ఎక్కడా దించకుండా ప్రదక్షిణలు చేయలేరని నేను.. చివరి వరకు వదలకుండా చేస్తానని ఏసీపీ సర్ పందెం కాసుకుంటున్నాం. ఏం ముకుంద పట్టుకోలేమా చివరి వరకు' అని అడుగుతుంది. దీంతో ముకుంద ఎందుకు పట్టుకోలేం అంటుంది. తర్వాత కృష్ణ మురారి పాదాలు మీద పాదాలు పెడుతుంది. ముకుంద మాత్రం ఆదర్శ్ మీద చెయ్యి వేసేందుకు ఇబ్బంది పడుతుంది. దీంతో కృష్ణ 'పెళ్ళిలో చక్రపాదాలు తొక్కినట్టు సుకుమారంగా చేస్తున్నావ్ ఏంటి? చాలా గట్టిగా పట్టుకో' అని కృష్ణ చెప్తుంది. కానీ, ముకుంద పరవాలేదు అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 4th

నడుము దగ్గర పట్టుకో:ముకుంద ఎంత తప్పించుకోవాలని చూసినా కృష్ణ మాత్రం వదిలిపెట్టకుండా ఆమెను ఆదర్శ్‌కు దగ్గర చేయాలని చూస్తుంది. మధు 'మోసేది ఆదర్శ్ అయితే నువ్వు ఇంత బాధపడుతున్నావ్ ఏంటి' అని డౌట్‌గా అడుగుతాడు. తర్వాత ఆదర్శ్‌కు ఏం కాదు పాదాలు పెట్టమని కృష్ణ దగ్గరుండి మరీ ఎక్కించేస్తుంది. ఆదర్శ్ పట్టుకోకపోయే సరికి 'ముకుంద ఇబ్బంది పడటానికి నువ్వు మొహమాట పడటానికి సరిపోయింది తనని పట్టుకో' అని మురారి కావాలని ఇరికించేస్తాడు. భుజాల మీద చేయి వేసి పట్టుకుంటే అక్కడ కాదు నడుము దగ్గర పట్టుకోమని ఇబ్బంది పెడతారు.

ఆదర్శ్‌ గాయపడేలా:రెండు జంటలూ ప్రదక్షిణలు చేసేందుకు వెళ్తారు. మురారి వాళ్లు సంతోషంగా వెళ్తుంటే.. ముకుంద ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత 'ఇంక నా వల్ల కాదు.. ఈ క్షణమే ఆదర్శ్ నన్ను వదిలేలా ఏదో ఒకటి చేయాలి' అనుకుని తన చేతి గాజులు ముక్కలు చేసి ఆదర్శ్ పాదాలకు గుచ్చుకునేలా వేస్తుంది. అవి గుచ్చుకోగానే ఆదర్శ్ తనని వదిలిపెడతాడు. మురారి వచ్చి తన కాలి గాయం చూస్తాడు. గాజులు ఇక్కడికి ఎలా వచ్చాయని కృష్ణ అంటే ముకుంద 'నా గాజులే.. సారి ఇదంతా నావల్ల ఎక్కడ పడిపోతానో అనే భయంతో గట్టిగా పట్టుకునేసరికి గాజులు పగిలాయి' అంటాడు.

ముకుందే చేసిందని:ముకుంద సారీ చెప్పడంతో ఆదర్శ్ 'కావాలని ఏం చేయలేదు కదా పర్లేదులే' అని అంటాడు. తర్వాత ముకుంద 'నువ్వు చెప్పింది నిజమే మీరు ఈజీగా మోయగలుగుతారు కానీ.. పట్టుకుని ఉండటమే కష్టం. పందెంలో వాళ్ళే గెలిచారు నువ్వు ఒడిపోయావ్ సారి' అంటుంది. దీంతో ఆదర్శ్ తనకేమి కాలేదని ప్రదక్షిణలు కంటిన్యూ చేద్దామని అంటే వద్దని ముకుంద చెప్తుంది. అప్పుడు మురారి 'నువ్వు బాధపడితే ముకుంద అసలు తట్టుకోలేదు వద్దులే రెండు ప్రదక్షిణలు చేశాం కదా' అంటాడు. కృష్ణ మాత్రం ముకుంద కావాలని చేసింది అని బాధపడుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode March 4th

ముకుంద కోరిక అలా:గుడిలో కొంతమంది కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు. కోరికలు తీరాలని కోరుకుంటూ ఇలా కాయిన్స్ నిలబెడతారని కృష్ణ, రేవతి చెప్తారు. కాయిన్ నిలబడితే కోరిక తీరుతుంది, పడిపోతే కోరిక నెరవేరదని రేవతి చెప్తుంది. ఇప్పుడు ఇది చేసే ఓపిక ఎవరికి లేదు వెళ్లిపోదామని ఆదర్శ్ అంటే ముకుంద మాత్రం సంతోషంగా నేను చేస్తానని ఆపుతుంది. తర్వాత మురారి తనకు సొంతం కావాలని కోరుకుంటుంది. కృష్ణ కూడా మురారితో 'మన కోరిక ఏంటో తనకి తెలుసు కదా. తన కోరిక నెరవేరదు మా కోరిక నెరవేరుతుందని రుజువు చేయాలి' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X