Krishna Mukunda Murari: ప్లాన్ చెప్పిన కృష్ణ.. మొత్తం చూసేసిన ముకుంద.. మురారి యూటర్న్ తిరగడంతో!
విభిన్నమైన కాన్సెప్టులతో కార్యక్రమాలు వస్తున్నప్పటికీ.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారి తన సొంతం కావాలని ముకుంద పెట్టిన కాయిన్ నిలబడడంతో ఆమె సంతోషంగా ఉంటుంది. కానీ, కృష్ణ మాత్రం తన కాయిన్ నిలబడకపోవడంతో బాధ పడిపోతుంది. తర్వాత ముకుంద వచ్చి మురారితో మాట్లాడుతుండగానే ఆమె కాయిన్ కింద పడిపోయి ఉంటుంది. తర్వాత మురారి వాళ్లు రెస్టారెంట్‌కు వెళ్లగా అక్కడ వెయిటర్ తన శోభనం గురించి శాడ్ స్టోరీ చెప్తాడు. దీంతో ఆదర్శ్‌కు కూడా అలాగే అవుతుందని అనుకుంటారు. ఇక, ఇంటికొచ్చిన తర్వాత ముకుంద తీరు చూసి మధు, రేవతికి డౌట్ వస్తుంది. చివర్లో మురారి తనను కొట్టాడని కృష్ణ షాకిస్తుంది.

అంత ధైర్యం ఎక్కడుంది?:ఇంటికి వచ్చిన తర్వాత డల్‌గా ఉన్న కృష్ణను రేవతి ఏమైందని అడగ్గా.. మురారి కొట్టాడని చెబుతుంది. అంతేకాదు, ఫుల్లుగా మందు కొట్టి తనను కొట్టాడని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు మురారి 'నేను గుడిలో తీర్థం తీసుకున్నా.. బార్‌లో మందు కాదు' అంటూ ఊదుతాడు. అప్పుడు మధు 'పట్టపగలు నీకు మందు కొట్టే ధైర్యం ఎక్కడ ఉంది' అంటాడు. దీనికి కృష్ణ 'మందు కొట్టకపోయినా వాళ్ళు ఎలా కొడతారో అలా కొట్టాడు' అని చెప్పేసి వెళ్లిపోతుంది. దీంతో మధు ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటుండగా.. రేవతి అతడిపై కోప్పడుతుంది.
మురారికి ప్లాన్ చెప్పింది:అనంతరం కృష్ణ గదిలోకి వచ్చి కూర్చుని ఉండగా మురారి వచ్చి 'ఏంటి ఇది? కింద అందరికీ నేను తాగి కొట్టానని చెప్పావు' అని అడుగుతాడు. దీనికామె 'వాళ్ళను డైవర్ట్ చేయడం కోసం అలా చెప్పాను. ముకుంద ఇలా చేస్తుందని చెప్పలేను కదా' అంటుంది. దీంతో మురారి 'అవునులే.. నేనే కాసేపు ముకుంద సంగతి మర్చిపోయాను' అంటాడు. తర్వాత కృష్ణ వెయిటర్ చెప్పింది తలుచుకుని టెన్షన్ పడుతుంది. అప్పుడు మురారి 'శోభనం గదిలో నువ్వంటే ఇష్టం లేదు.. ఇంకా మురారిని ప్రేమిస్తున్నానని చెప్పేస్తుందేమో' అనడంతో కృష్ణ భయపడుతుంది.
ఎంతకైనా తెగిస్తుందేమో:మురారి మాటలతో కృష్ణ 'నేను తనతో ఒకసారి మాట్లాడతాను. మారిపోయానని చెప్పావ్ కదా ఏమైంది అదంతా అని అడుగుతా' అని అంటుంది. దీనికతడు 'ఇప్పటి వరకు నాకు మాత్రమే తెలుసు. నీకు కూడా విషయం తెలుసని తెలిస్తే ఎంతకైనా తెగిస్తుంది' అంటాడు. అప్పుడు కృష్ణ అయిన ఏదో ఆశ అనగా.. 'తను మారదు కృష్ణ.. ఆదర్శ్‌తో ఇష్టం లేదని చెప్పేస్తుంది. దాన్ని ఆపగలనని అనిపించడం లేదు' అంటాడు. దీంతో కృష్ణ.. ఆదర్శ్‌కు ఏం తెలియకూడదు అంటే అయితే శోభనం ఆపేయాలి అని మురారి అనుకుని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తాడు.

అంతరాత్మతో మాట్లాడి:ఫస్ట్ నైట్ గురించి ముకుంద ఆలోచిస్తుంటుంది. అంతలోనే అద్దంలో ఆమె అంతరాత్మ కనిపిస్తుంది. 'ఈరోజు నీ శోభనం అంట.. అందరూ హడావుడి చేస్తుంటే నీ మొహం చూడు మాడిపోయి ఉంది. కానీ ఇదే శోభనం మురారితో అయి ఉంటే ఇలా ఉండేదానివా? అప్సరసలా అందంగా తయారై మెరిసిపోయే దానివి. ఏం పాపం చేసుకున్నావో నీకు ఈ ఖర్మ పట్టింది. శోభనం ఎలా ఆపాలో చూడు' అని హెచ్చరిస్తుంది. తర్వాత ముకుంద 'ఈ ప్లాన్ వర్కౌట్ అయితే శోభనం కచ్చితంగా ఆగిపోతుంది. కానీ శోభనం జరిగిపోతే నేను తట్టుకోలేను' అని అనుకుంటుంది.
ఈ శోభనం ఆపలేవని:ముకుంద శోభనం ఆపడానికి ప్లాన్ వేస్తుండగా.. ఆదర్శ్ మాత్రం దాని గురించే ఊహల్లో ఉంటాడు. అప్పుడే మురారి అతడిని శోభనం ఆపాలని అడగడానికి వస్తాడు. కానీ, అడగలేక కాలు నొప్పి ఎలా ఉంది అని కవర్ చేస్తాడు. అప్పుడు ఆదర్శ్ 'నొప్పి బాగానే ఉంది.. శోభనం క్యాన్సిల్ చేయమని చెప్పడానికి రాలేదు కదా' అని జోక్‌గా అడిగేస్తాడు. తర్వాత ఆదర్శ్ 'అయినా నా శోభనాన్ని నువ్వు ఆపలేవు. నాది ఆపితే మీది కూడా ఆగిపోతుంది. ముకుంద చాలా డిసప్పాయింట్ అవుతుంది. మొన్న రెస్టారెంట్‌లో ఏమైందో చూశావ్ కదా' అంటాడు.
తండ్రిలా ఆలోచిస్తావ్:తర్వాత ఆదర్శ్ 'నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో నాకు అర్థమైంది. నువ్వు తండ్రిలా ఆలోచిస్తున్నావు. నువ్వు నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం. ముకుంద గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నావో నేను చెప్పనా.. గతంలో జరిగింది మనసులో పెట్టుకుని తనని ఎక్కడ దూరం పెడతానోనని అలా చేయవద్దని చెప్పడానికి వచ్చావు. ఒక మనిషికి పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ.. నువ్వు నాకు పునర్జన్మ ఇచ్చావు. ముకుందకు నేనంటే ఇష్టం లేదని తెలిసి ఎక్కడో జీవశ్చవంలా బతుకుతుంటే నాకోసం తనను మార్చి నాకు పునర్జన్మ ఇచ్చావ్. ఇప్పుడు మళ్ళీ ముకుందను బాగా చూసుకోమని నాకు చెప్పాలా? తనను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను' అని మాట ఇస్తాడు. వీళ్ళ మాటలు దూరం నుంచి ముకుంద వింటుంది.

ముకుంద చూసిందని:ముకుంద చూడడం గమనించిన మురారి.. ఆదర్శ్‌కు నిజం చెప్పకుండానే వెళ్లిపోతాడు. కానీ, ముకుంద మాత్రం ఈ శోభనం ఎలాగైనా ఆపుతానని అంటుంది. మరోవైపు కృష్ణ దగ్గరకు వచ్చిన సుమలత ఇంకా రెడీ అవలేదేంటి అని అడుగుతుంది. దీనికామె భయంగా ఉందని అనగా.. 'అందరికీ భయం ఉంటుంది కానీ నీకు మాత్రం భయం ఉండకూడదు. నువ్వు మురారి ఏడాది నుంచి కలిసే ఉంటున్నారు కదా' అంటుంది. తర్వాత మురారిని కృష్ణ ఏమైందని అడగ్గా.. ముకుంద మా మాటలు వింటుందని ఆదర్శ్‌తో ఏం చెప్పలేదు అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











