Krishna Mukunda Murari: కవర్‌తో దొరికిపోయిన ముకుంద.. కృష్ణకు హాని చేయాలని.. ఫౌడర్ మార్చేయడంతో!

ఇండియాలో చాలా భాషల్లో సీరియళ్లు వస్తున్నాయి. కానీ, తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే: మురారి తనను కొట్టాడని కృష్ణ అందరికీ చెప్తుంది. దీంతో అతడితో పాటు ఇంట్లో వాళ్లూ షాక్ అవుతారు. తర్వాత మురారి వెళ్లి కృష్ణను అడగ్గా.. ముకుంద విషయాన్ని డైవర్ట్ చేయడానికి అబద్ధం చెప్పానని అంటుంది. అనంతరం వీళ్లిద్దరూ ఆదర్శ్ గురించి జాలిగా మాట్లాడుకుంటారు. ముకుంద ఎంతకైనా తెగిస్తుందని, వెంటనే శోభనం ఆపేయాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం చెప్పడానికి ఆదర్శ్ దగ్గరకు మురారి వెళ్తాడు. అప్పుడు అతడు ఎమోషనల్‌గా మాట్లాడడంతో పాటు ముకుంద వీళ్లను చూడడంతో మురారి వెనక్కి వచ్చేస్తాడు. ఈ విషయాన్ని తర్వాత కృష్ణకు చెబుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 7th

కవర్‌తో దొరికిపోయిన ముకుంద: ముకుంద చూస్తుందని ఆదర్శ్‌తో చెప్పలేకపోయాను అని మురారి అనడంతో కృష్ణ డీలా పడిపోతుంది. దీంతో ఎలాగైనా ఆదర్శ్‌తో మాట్లాడాలని కృష్ణ నిర్ణయించుకుంటుంది. అంతలోనే ఓ వ్యక్తి ఒక పార్శిల్ తీసుకుని వస్తాడు. ముకుంద దాన్ని చీర కొంగు లోపల దాచుకుని ఇంట్లోకి తీసుకు వెళ్తుండగా.. కృష్ణను గుద్దుకుంటుంది. దీంతో ఆ పార్శిల్ కింద పడిపోతుంది. అప్పుడు రేవతి అది తీసుకుని ఓపెన్ చేయాలని అనుకుంటుంది. అప్పుడు అది తీసుకున్న ముకుంద.. అందులో నెయిల్ పాలీష్ ఉందని అబద్ధం చెప్తుంది. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కృష్ణ కోసం పౌడర్ తీసుకువచ్చి: కృష్ణను చూసి ముకుంద 'నన్ను టెన్షన్‌లో పెట్టేసి హాయిగా నవ్వుకుంటున్నావా? ఇప్పుడు ఎలా నవ్వుతావో చూస్తాను' అని మనసులో అనుకుంటుంది. తర్వాత 'నా శోభనాన్ని ఎలాగైనా ఆపుకుంటాను, వాళ్ళ శోభనం మాత్రం జరగకూడదు' అని గీతికకు చెప్తుంది. దీనికామె 'ఎందుకు టెన్షన్? నేను ఒక పౌడర్ పంపిస్తాను. అది కృష్ణ రాసుకునేలా చెయ్. మొహం మొత్తం దద్దుర్లు వచ్చేస్తాయి. ముహూర్తం బాగోక ఇలా జరిగిందని మీ శోభనం కూడా క్యాన్సిల్ చేసేయ్' అని ఐడియా ఇస్తుంది. వెంటనే ముకుంద.. కృష్ణ వాళ్ళ గదిలోకి వచ్చి పౌడర్ డబ్బా మార్చేస్తుంది.

ముకుందను చూసిన మురారి: ముకుందను చూసిన మురారి 'చేయాల్సింది చేసి జారుకుంటావ్ ఏంటి? మా శోభనం ఆపడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావ్. ఏంటది పౌడర్ డబ్బా మార్చేశావు? అది రాసుకుంటే ఏమవుతుంది? దురదలు పుడతాయా? అది రాసుకుంటే గోకుతా కూర్చుంటాము.. శోభనం ఆగిపోతుంది. ఇది నీ వెధవ ఐడియా అంతే కదా. కానీ ఇప్పుడు నేను చూసేశాను కదా. అది పని చేయదు. ఇప్పుడు ఏం అర్థమైంది? నువ్వు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా మమ్మల్ని విడదీయలేవు. మా శోభనం జరుగుతుంది. ఈరోజు నుంచి మేము నిజమైన భార్యాభర్తలం కాబోతున్నాం' అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode March 7th

ప్రేమ ముగిసిన అధ్యాయమే: నోరు మూసుకుని చక్కగా కాపురం చేసుకో అని మురారి అనడంతో ముకుంద అది కలలో కూడా జరగదు అంటుంది. దీంతో అతడు 'మరి ఏం చెప్తావ్? నేను తప్పు చేయడం లేదని అంటావా? ఇప్పుడు దొంగ చాటుగా నువ్వు చేసే ఈ పని ఏంటి తప్పు కాదా' అని ప్రశ్నిస్తాడు. దీనికామె 'నేను ఏం చేసినా నా ప్రేమ.. సారి మన ప్రేమని బతికించుకోవడానికే' అంటుంది. దీంతో మురారి 'ప్రేమ ప్రేమ.. అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం దాన్ని పట్టుకుని నువ్వు మనశ్శాంతి పోగొట్టుకుని మాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావు' అంటూ కోప్పడతాడు.

నీ మీద అసహ్యం వస్తుంది: మురారి మాటలకు ముకుంద 'ఇప్పుడు నువ్వు అలాగే అంటావు మురారి. కానీ నా ప్రయత్నాలు ఫలించి మన ప్రేమ నిలబడిన తర్వాత నువ్వే నన్ను మెచ్చుకుంటావు. మెచ్చుకోవడం కాదు రోజు రోజుకీ నీ మీద అసహ్యం పెరిగేలా చేసుకుంటున్నావు' అంటుంది. దీంతో మురారి 'నువ్వు ఒక్కసారి నీ మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుని చూడు. నీ మీద అణువణువునా ప్రేమ పెంచుకున్న ఆదర్శ్ కనిపిస్తాడు. ఒక అద్భుతమైన జీవితం కనిపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు మనసు మార్చుకో' అంటూ ముకుందకు హితబోధ చేస్తాడు. అయినా ఆమె మాత్రం అస్సలు వినదు. దీంతో 'మా శోభనం ఎటూ జరగదు అలాగే మీ శోభనం కూడా జరగనివ్వను' అంటుంది. దీంతో మురారి జరిగి తీరుతుంది ముకుంద అనగా చూద్దాం అని వెళ్లిపోతుంది.

ముకుందను విడవలేనని: ఆదర్శ్ దగ్గరకు వచ్చిన కృష్ణ ఫ్రెండ్స్‌తో కలిసి తాగొచ్చు కదా అంటుంది. దీనికతడు 'నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావ్ కదా? ఈరోజు నా శోభనం కదా.. ఇక్కడ ముకుందని వదిలేసి అక్కడ ఫ్రెండ్స్‌తో తాగుతూ ఎలా ఉంటాను? నేను ముకుంద సంతోషంగా ఉండాలని కోరుకునేది మీ ఇద్దరే. ఇందాక మురారి కూడా వచ్చి ముకుందని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అప్పుడు నేను తన మనసులో లేనని చెప్పి వెళ్లిపోయాను. కానీ ఇప్పుడు తన మనసులో నేనే ఉన్నానని తెలిశాక తనని వదిలి వెళ్లిపోతానా? ముకుంద పూర్తిగా మారిపోయింది. ఇందాక గుడిలో నా కాలికి గాజు గుచ్చుకునేసరికి ఎంత బాధపడిందో తెలుసా? ఇప్పుడు నేను ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్తే తాగుతాను. అలాగే శోభనం గదిలోకి వెళ్తే తను ఎంత బాధపడుతుంది. దేవుడే పిలిచినా వెళ్లను' అంటాడు.

అనుమానం పోయిందని: కృష్ణ మాటలకు ఆదర్శ్ ఎమోషనల్‌గా సమాధానం చెప్తాడు. దీంతో కృష్ణ కూడా బాధ పడుతుంది. మరోవైపు ముకుంద మాత్రం అద్దం ముందు కూర్చుని 'ఎందుకు మురారి ఇలా చేశావ్? నీ పడకగదిలోకి పాల గ్లాసుతో రావాల్సిన నన్ను.. పాలని విషంగా భావించే పరిస్థితి తీసుకొచ్చావు. కుటుంబం కోసం నీ చుట్టూ దడి కట్టుకున్నావు. పెళ్ళైన వాళ్ళని ప్రేమిస్తే తప్పు అయినప్పుడు ప్రేమించిన వాళ్లను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం తప్పు కాదా' అనుకుంటుంది. అంతలో రేవతి వచ్చి ముకుందను చూసి మారిపోయావని అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X