Krishna Mukunda Murari: నిజం చెప్పేసిన మురారి.. శోభనం గదిలో టెన్షన్.. ఆదర్శ్ ఏం చేస్తాడు?
ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే: కృష్ణ వాళ్ల ఫస్ట్ నైట్ ఆపేసి.. దాని ద్వారా తన శోభనం కూడా ఆపేయాలని ముకుంద ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం కృష్ణకు దురదలు వచ్చే పౌడర్‌ను ఇవ్వాలని అనుకుంటుంది. అయితే, ఈ విషయం మురారికి తెలిసిపోతుంది. అప్పుడతను ముకుందకు క్లాస్ పీకుతాడు. మంచిగా ఆదర్శ్‌తో కాపురం చేసుకోమని అంటాడు. కానీ, ముకుంద మాత్రం తనకు మురారినే కావాలని గొడవ చేస్తుంది. ఇక, ఆదర్శ్‌తో మాట్లాడేందుకు కృష్ణ వెళ్లగా.. అతడు ఎమోషనల్‌గా మాట్లాడతాడు. దీంతో ఏమీ చెప్పకుండానే కృష్ణ తిరిగి వస్తుంది. తర్వాత ముకుంద శోభనం కోసం రెడీ అవుతుంది.

నేను ఎప్పటికీ అంగీకరించను: ముకుంద శోభనం కోసం రెడీ అవడంతో రేవతి 'నువ్వు మారలేదని అందరి మనసులో ఏదో ఒక మూల అనుమానం ఉండేది. ఈ క్షణంతో అది కూడా పోయింది. నువ్వు ఆదర్శ్‌ను అంగీకరించడం.. ఇలా రెడీ అవడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్తుంది. దీంతో ముకుంద 'క్షమించండి అత్తయ్య.. నేను ఆదర్శ్‌ను ఎప్పటికీ అంగీకరించలేను. మీ సంతోషం క్షణాల్లో ఆవిరి కాబోతుంది' అని మనసులో అనుకుంటుంది. తర్వాత రేవతి 'భవానీ అక్క నిన్ను ఇలా చూస్తే చాలా సంతోషించేది' అని చెబుతుంది.

మురారితో బిడ్డను కంటానని: ఆ తర్వాత రేవతి 'నువ్వు ఎప్పుడెప్పుడు మనవడినో, మనవరాలిని ఇస్తావోనని భవానీ అక్క ఎదురు చూస్తుంది. ఇంతకీ ఎవరిని ఇస్తున్నావు' అని అడుగుతుంది. దీనికి ముకుంద 'మనవడినో, మనవరాలినో ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఎవరు కావాలో చెప్పండి' అంటుంది. దీనికి రేవతి ఆ విషయం మీ అత్తయ్యను అడుగు అంటుంది. దీంతో ముకుంద మనసులో 'మీరే నా అత్తయ్య. ఎప్పటికైనా మీ కొడుకు మురారి బిడ్డను, నేను నా కడుపున మోసేది మీ మనవడినే. ఇది మాత్రం జరిగి తీరుతుంది' అని అనుకుంటుంది.
నీ బతుకేంటి ఇలా ఉందని: మురారి అద్దం ముందు చూసుకుంటూ 'అచ్చం శోభనం పెళ్లి కొడుకులా బాగున్నావు కానీ.. శోభనం మాత్రం లేదు. నీ బతుకు ఏంటి ఇలా తయారైంది? ఇప్పుడు ఏమైనా నీ శోభనం జరుగుతుందా ఏంటి? ఇదంతా ఫేక్ సినిమా సెట్. అక్కడ చూస్తే ముకుంద అనే బాంబ్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అర్థం కావడం లేదు' అని ఆమెను తిట్టుకుంటాడు. అంతలో మధు వచ్చి 'ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు. పెద్దమ్మ నిన్ను రెడీ చేయమంటే వచ్చాను కానీ నువ్వు ఆల్రెడీ రెడీ అయిపోయావు. సరే ఆల్ ది బెస్ట్' అని మురారిని విసిగిస్తాడు.
వాళ్లెంత అదృష్టవంతులో: మురారి దగ్గర నుంచి మధు నేరుగా ఆదర్శ్ దగ్గరకు వస్తాడు. అప్పుడతను ముకుంద ఫొటో చూసి మురిసిపోతాడు. అది చూసిన మధు 'మురారి, నువ్వు మీ భార్యలను ఎంతగా ప్రేమిస్తున్నారు. మీలాంటి వాళ్ళు దొరికినందుకు వాళ్ళు ఎంత అదృష్టవంతులో' అంటాడు. దీనికి ఆదర్శ్ 'ఏం అలాంటి భార్యలు దొరకడం మా అదృష్టం కాదా? ముకుంద నాకు భార్యగా దొరకడం నా అదృష్టం కాదా' అంటాడు. అప్పుడు మధు నువ్వు ఇంకా అదృష్టవంతుడివని కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా పార్టీ కోసం డబ్బులు వేయమనగా.. ఆదర్శ్ వాళ్లకు పంపుతాడు.

ముకుంద ప్లాన్ చెప్పాడు: ముకుంద పౌడర్ డబ్బా ప్లాన్ గురించి కృష్ణకు మురారి చెప్తాడు. దీనికామె 'అయినా ఎందుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తూ ఉండేది కదా' అంటుంది. దీంతో మురారి 'మనం ఏం చేసినా తను ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది. మనం ఎలాగైనా కారణం చెప్పకుండా శోభనం ఆపాలి' అని అంటాడు. దీంతో కృష్ణ 'ఇప్పుడు ఏం చేసినా ఈ శోభనం ఆగేలా లేదు. నా భర్తను నాకు కాకుండా చేసి తన సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను అంటే ఆవేశంతో చెప్పిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో ఆ పరిణామాలు నా జీవితం మీద కుటుంబం మీద ఎలాంటి పరిణామాలు చూపిస్తాయో. ఈ శోభనాలు ఏర్పాటు చేసి తప్పు చేశానా' అని అనుకుంటుంది.
శోభనం గదిలోనే చెప్పాలి: తన దగ్గరకు వచ్చిన రేవతిని కృష్ణ.. ముకుంద వెళ్లిపోయిందా అని అడుగుతుంది. ఆమె లేదు అనగానే కృష్ణ 'అంటే శోభనం గదిలో నిజం చెప్పాలని ముకుంద డిసైడ్ అయిందా' అని అనుకుంటుంది. తర్వాత ముహూర్తం టైమ్ కి ఇద్దరినీ గదిలోకి పంపించాలని రేవతి సుమలతకి చెప్తుంది. మురారి దగ్గరకి వెళ్లాలని తొందరపడుతుంటే కాస్త ఆగమని సుమలత అంటుంది. మరోవైపు, ఆదర్శ్.. ముకుందతో గడిపిన క్షణాలు తలుచుకుంటూ మురిసిపోతాడు. కృష్ణ పాల గ్లాసు పట్టుకుని మురారి గదిలోకి వెళ్తుంది. కృష్ణని అలా చూసి మురారి మైమరిచిపోయాడు.
పాల గ్లాస్ పక్కన పెట్టేసి: ఆత్రంగా ఉన్న మురారితో కృష్ణ 'ముకుంద గురించి ఆలోచించారా? నాలాగా పాల గ్లాసు తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఏం జరుగుతుందోనని టెన్షన్‌గా ఉంది' అంటుంది. దీనికి మురారి 'నాకు టెన్షన్‌గా ఉంది. ఏం చేస్తాం ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు. తను ఏం చేసిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం తప్ప' అని చెప్తాడు. ముకుంద గదిలోకి వెళ్ళిపోతుంది. శోభనం పెళ్లి కూతురుగా ముకుందని చూసి ఆదర్శ్ 'ఈ క్షణం కోసం నువ్వు ఇలా దేవ కన్యలా నడిచి వస్తుంటే చూసి మురిసిపోయే అద్భుత క్షణం కోసం నేను ఎన్నాళ్ళుగానో ఆశగా ఎదురుచూశానో తెలుసా' అంటూ ఆమె చేతిలోని పాల గ్లాసు అందుకోబోతుంటే ముకుంద దాన్ని తీసుకొనివ్వకుండా టేబుల్ మీద పెట్టేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











