Krishna Mukunda Murari: మీరా గురించి తెలిసిన నిజం.. కృష్ణ, అమృత ఏం చేశారంటే.. నేటి ఎపిసోడ్‌‌లో మలుపు

ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
సరోగసి మదర్ మంచిదని మాట్లాడుతుంటే కృష్ణకు డౌట్ వస్తుంది. ఆమె ఎవరని అడగ్గా మురారి ఏదో చెప్పి కవర్ చేసుకుంటాడు. తర్వాత వీళ్లు ఉన్న ఆస్పత్రికే ముకుంద వస్తుంది. ఆమెను చూసి మురారి షాక్ అవుతాడు. వెంటనే ఆమెను కృష్ణ చూడకుండా కవర్ చేస్తాడు. అనంతరం కృష్ణను పంపేసి ముకుందకు పొగుడుతూ మాట్లాడతాడు. తర్వాత ముకుందకు సరోగసి ప్రాసెస్ చేస్తారు. మరోవైపు, ఆదర్శ్.. ముకుంద కోసం వెతుకుతుంటే భవానీ వాళ్లు మురిసిపోతారు. అనంతరం ఆమె రావడంతో ఆదర్శ్ ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నించగా నోరు జారి నిజం చెప్పేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 11th

నేనంటే ఇష్టం ఏమైనా తగ్గిందా?
మీరా డబుల్ గేమ్ గురించి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడకు మురారి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడామె నేనంటే మీకు ఇష్టమేమైన తగ్గిందా? అని అడుగుతుంది. మురారి.. కృష్ణను హగ్ చేసుకుని నీ మీద రోజురోజుకీ ప్రేమ పెరగడం తప్ప తగ్గడం అనే ఛాన్స్ ఉంటుందా అంటాడు. దీనికామె 'నేను పిల్లలని కనలేని గొడ్రాలిని కదా. అందుకని నా మీద మీకు ప్రేమ తగ్గిందా అని అడుగుతున్నా' అంటుంది. దీంతో మురారి పిచ్చిగా మాట్లాడితే దెబ్బలు పడతాయి అని అంటాడు.

నువ్వు గొడ్రాలివి ఏంటి కృష్ణ?
కృష్ణ మాటలకు మురారి 'అయినా నువ్వు గొడ్రాలివి ఏంటి? సరోగసి ద్వారా పుట్టేది నీ బిడ్డే కదా. పిల్లలు ప్రేమకు గుర్తులు కావాలి కానీ కారణం కారని చెప్తాడు. మన బిడ్డ ఒకరి గర్భంలో పెరుగుతుంది. అది స్థిరంగా ఉండి మన చేతికి రావాలి. మన ఇంట్లో శుభ కార్యం జరగాలి' అంటాడు. దీంతో కృష్ణ 'దాంతో పాటు మరొక శుభకార్యం కూడా జరగాలి. ఆదర్శ్.. మీరాను ఇష్టపడుతున్నాడు కదా. వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే పెద్దత్తయ్యకు సగం భారం తగ్గుతుంది' అంటుంది. దీంతో అతడు వాళ్లిద్దరికీ పెళ్లి ఏంటి? ఆ ఆలోచనలు పెట్టుకోవద్దు అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 11th

పెళ్లి అయితే సెట్ అవుతుంది
మురారి అలా అనడంతో కృష్ణ 'అదేంటి అప్పుడు చేద్దామని ఇప్పుడు వద్దని అంటున్నారు' అని అడుగుతుంది. దీనికతడు తన బుద్ధి బాగోలేదని నువ్వే అన్నావ్ కదా అంటాడు. అప్పుడామె 'ఆదర్శ్‌తో పెళ్లి అయితే తన బుద్ధి సెట్ అవుతుందేమో అదే కరెక్ట్' అంటుంది. దీనికి మురారి 'ఇప్పుడు సరోగసి మథర్ గురించి చెప్తే అది క్యాన్సిల్ చేయించి వాళ్ళ పెళ్లి జరిపిస్తుంది' అని మనసులో అనుకుంటాడు. తర్వాత ముకుంద రెడీ అవడం చూసి ఆదర్శ్ పడిపోతాడు. అంతేకాదు, చాలా అందంగా ఉన్నావని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తాడు.

కుక్కలా వెంటపడుతున్నాడు
ఆదర్శ్‌ను ముకుంద 'ఎక్కడికి వెళ్తే అక్కడికి పెంపుడు కుక్కలాగా వెంట పడుతున్నాడు' అని తిట్టుకుంటుంది. తర్వాత ఆదర్శ్ 'మీ ఓనర్ చనిపోయాడని అన్నావ్ కదా. మరి బాగా రెడీ అయిపోయావేంటి' అని ప్రశ్నిస్తాడు. దీంతో ముకుంద డ్రామాను షురూ చేసేస్తుంది. అనంతరం ఆదర్శ్ 'ఊరు వెళ్తున్నాను రెండు రోజుల వరకు రాను. తిరిగి వచ్చాక సర్‌ప్రైజ్ ఇస్తాను' అని అంటాడు. దీంతో ముకుంద మనసులో 'మీరు ఇవ్వడం కాదు.. నేనే మీకు సర్‌ప్రైజ్ ఇస్తాను. ఈ జన్మలో నా జోలికి రారు' అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 11th

మీరా నువ్వు కూడా కూర్చో
ఇంట్లో పూజకు ఏర్పాట్లు చేస్తారు. మురారి, కృష్ణ జంటను పంతులు పొగుడుతాడు. అమృత కూడా మెచ్చుకుంటుంది. వాళ్లిద్దరూ పీటల మీద కూర్చున్న తర్వాత మీరాను కూడా కూర్చోమని మురారి పిలుస్తాడు. అంతేకాదు, నువ్వు లేకపోతే పూజ లేదు ఈ పూజ జరగడానికి కారణం నువ్వే అంటాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. కానీ, అమృత అనుమానంగా చూస్తుంది. అప్పుడు రజినీ 'ఈ పూజ చేస్తుంది నీ బిడ్డ కోసం కదా మురారి. మరి తన కోసం చేస్తున్నట్టు మాట్లాడతావు ఏంటి' అడిగేస్తుంది. దీంతో మురారి నేను ఉన్నానంటే కారణం తనే కదా అంటాడు.

మురారిపైన కృష్ణకు కోపం
తర్వాత మురారి 'తను ఇప్పుడు ఈ ఇంటి మనిషి కదా. అందుకే కూర్చోమని చెప్తున్నా' అంటాడు. దీంతో మీరా వచ్చి కృష్ణ పక్కన కూర్చుంటుంది. తర్వాత మురారి పూజ చేస్తూ మీరా వైపు చూస్తుంటాడు. పూజలో ప్రతిదీ మీరాకి ఇస్తుంటే కృష్ణ కోపంగా చూస్తుంది. అప్పుడు ముకుంద 'బిడ్డ కోసం చేయాల్సిన పూజ నేను చేయాలి. ప్రస్తుతం బిడ్డ వచ్చింది త్వరలోనే మురారి కూడా వచ్చేస్తాడు' అనుకుంటుంది. తర్వాత పూజారి తమలపాకుని ఎడమ చేత్తో తీసుకుని మురారి తల చుట్టూ తిప్పమని కృష్ణకి చెప్తాడు. దీంతో మురారి పుణ్యం బిడ్డకే దక్కేలా చూడు అంటాడు.

ముకుంద ప్రెగ్నెంట్ అని
పూజ తర్వాత ముకుంద కళ్లు తిరిగి పడిపోతుంది. కృష్ణ చెక్ చేసి మీరా ప్రెగ్నెంట్ అని తెలుసుకుంది. అప్పుడు మురారి 'వేరే వాళ్ళ వల్ల తల్లి అయ్యిందని కృష్ణ చెప్పేస్తుందేమో.. అప్పుడు ముకుంద నింద మోయలేక నిజం చెప్పేయాల్సి వస్తుంది' అని టెన్షన్ పడతాడు. కానీ, కృష్ణ ఏం లేదు నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని అబద్ధం చెప్తుంది. తర్వాత భవానీ.. అమృత ఒకసారి నువ్వు కూడా చెక్ చేయమని చెప్తుంది. అమృత ముకుందని టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అని అర్థం అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X