Krishna Mukunda Murari: మీరా పెళ్లికి ఏర్పాట్లు.. ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ.. రసవత్తరంగా నేటి ఎపిసోడ్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మీరాను చెక్ చేసిన తర్వాత అమృత కూడా వీక్‌నెస్ వల్లే పడిపోయిందని అబద్ధం చెప్తుంది. తర్వాత వీళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు కృష్ణ.. మీరా ప్రెగ్నెంట్ అవడానికి ఆదర్శే కారణం అంటుంది. అంతేకాదు, వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించాలని అనుకుంటుంది. మరోవైపు మీరా తను గర్భవతి కాలేదా అని డౌట్ పడుతుంది. మురారి కూడా అదే ఆలోచిస్తుండగా.. కృష్ణ వచ్చి నిజం చెప్తుంది. అప్పుడు మురారి సరోగసి మదర్ మీరానే అని నిజం చెప్తాడు. దీంతో కృష్ణ అతడితో మీరా ఏదో చెడు ఉద్దేశంతోనే అలా చేస్తుందని, ఆదర్శ్‌ ఆమెను ప్రేమిస్తున్నాడని అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 14th

తీగ లాగితే బయటపడుతుంది:మీరా గురించి కృష్ణ మాట్లాడుతూ.. 'సరోగసి మథర్ మన ఇంట్లో ఉంటే ప్రాబ్లం. నిజం బయట పడితే ఏం చేస్తారు? పైగా దీని వల్ల మనం ఆదర్శ్‌ను బలి చేస్తున్నాం. ఆదర్శ్ మీరాను ప్రేమిస్తున్నాడు. పెద్దత్తయ్య వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. మీకు లాగే నేను ఈ పెళ్లి వద్దని చెప్తే ఏం చేయాలి? తీగ లాగితే మన కథ బయటకు వస్తుంది. ఇవేమీ ఆలోచించకుండా ఆవిడ ఏదో ఆలోచనతో మీ బిడ్డని మోస్తాను అనగానే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా ఒప్పుకున్నారు' అని మురారిని నిలదీస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 14th

మన బిడ్డ గురించి ఆలోచించు:ఆ తర్వాత కృష్ణ 'ఇప్పటికే ఆదర్శ్ నా మొహం చూడటం లేదు. ముకుంద నావల్ల చనిపోయింది అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరా కూడా నా వల్ల తనకు కాకుండా పోతుందని తెలిస్తే ఇక ఈ జన్మకి నన్ను క్షమించడు. మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా' అంటుంది. దీంతో మురారి 'ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన బిడ్డ గురించి. అన్ని మర్చిపోయి మీరాని జాగ్రత్తగా చూసుకో' అని చెప్తాడు. అందరూ భోజనం చేస్తుంటే కృష్ణ కోసం స్పెషల్‌గా పెట్టిన వంటలు పెట్టమని భవానీ చెప్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 14th

నటించలేకపోతున్నాను అని:భవానీ మాటలతో కృష్ణ 'మీరా ఎదురుగా లేకపోయి ఉంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ బిడ్డని మోస్తున్న తల్లిని ఎదురుగా పెట్టుకుని నటించలేను' అని అనుకుంటుంది. అప్పుడు మీరా 'బిడ్డను మోస్తుంది నేను అయితే నువ్వు భోగాలు అనుభవించడం ఏంటి? ఈ సంతోషం కూడా నీకు మిగలనివ్వను' అని మనసులో అనుకుంటుంది. కృష్ణ కోసం చేసిన స్పెషన్ వంటకాలు తనకు కూడా పెట్టమని ముకుంద అడుగుతుంది. ఏంటి నీకు పెట్టాలా నువ్వు కడుపుతో ఉన్నావా.. చూస్తుంటే అలాగే ఉంది అని అనేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 14th

ప్రపోజ్ చేస్తాను అన్న ఆదర్శ్:ముకుంద స్పెషల్ ఫుడ్స్ తింటాను అనడంతో రేవతి అలాంటివి టేస్ట్ చేసే టైమ్ ముందు ముందు ఉందిలే అని అంటుంది. దీంతో ముకుంద ముసిముసి నవ్వులు నవ్వుతూ తెగ సిగ్గుపడిపోతూ ఆదర్శ్ వైపు చూస్తుంది. అది చూసి కృష్ణ, మురారి టెన్షన్ పడతారు. ఆదర్శ్ ముకుంద గురించి ఆలోచిస్తూ తెగ మురిసిపోతాడు. అప్పుడతను 'రెండు రోజుల్లో నీ బర్త్ డే రాబోతుంది. నీకు గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. నాకు తెలుసు ముకుంద నువ్వు కూడా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నావు. నీకు తప్పకుండా ప్రపోజ్ చేస్తాను' అని మనసులోనే అనుకుంటాడు.

మురారికి పెరిగిన సందేహం:మీరా వాలకం చూసిన తర్వాత మురారి 'మీరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఆ సిగ్గుపడటం ఏంటి? ఇంకా ఆదర్శ్‌కు ఆశలు పెరుగుతాయి కదా' అనుకుంటాడు. అంతలోనే అదర్స్ వచ్చి సంతోషంగా మురారిని హగ్ చేసుకుంటాడు. అప్పుడు 'ముకుంద అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. తనకు కూడా నేను అంటే ఇష్టమని అర్థం అయింది. ఇందాక పిన్ని అన్న మాటలకు ముకుంద నావైపు చూసేసరికి కన్ఫామ్ అయింది. అమ్మకు కూడా ఈ విషయం చెప్పాను. అమ్మ ఒకే అంటే అంతా హ్యాపీ' అంటాడు. దీంతో మురారి డల్ అయినా తర్వాత కవర్ చేస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 14th

మీరాను ప్రశ్నించిన కృష్ణ:ఆదర్శ్ మాటలకు కృష్ణ 'పెళ్లి అని ఏదేదో మాట్లాడుతున్నాడు. దీనంతటికీ కారణం మీరానే ముందు తనతో మాట్లాడాలి' అని ఫిక్స్ అవుతాడు. వెంటనే కృష్ణ కోపంగా మీరా దగ్గరకు వస్తుంది. 'మనం ఉన్న పొజిషన్ ఏంటి? నీ అంతట నువ్వే సరోగసి మథర్‌గా ఒప్పుకుని ఇప్పుడు ఈ వేషాలు ఏంటి? కడుపులో బిడ్డని పెట్టుకుని ఆదర్శ్ లో ఆశలు ఎందుకు రేకెత్తిస్తున్నావు? నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే ఎందుకు సరోగసికి ఒప్పుకున్నావు. మీ కుటుంబం అంటే ఇష్టం గౌరవం అని నమ్మించి సర్‌ను ఒప్పించి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు' అని నిలదీస్తుంది.

అవమానిస్తూ.. కరిగిస్తూనే:కృష్ణ మాటలకు మీరా 'ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు నేను తనని పెళ్లి చేసుకొను. కృష్ణ బిడ్డని నేను మోస్తున్నాను. కృష్ణ తల్లి కాదు. తను గొడ్రాలు జీవితంలో తనకు పిల్లలు కలగరని చెప్పనా' అంటూ ఎదురు తిరుగుతుంది. తర్వాత తనదైన మాటతీరుతో డ్రామాలు ఆడుతూ కృష్ణు మభ్యపెడుతుంది. తర్వాత ఆదర్శ్ వస్తే అతడితో వెళ్లిపోతుంది. అప్పుడు రేవతి, భవానీ కలిసి వాళ్లిద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇందుకోసం పంతులుకు కబురు పెట్టిస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X