Krishna Mukunda Murari: నిజం చెప్పేసిన భవానీ..ఒప్పుకుని షాకిచ్చిన మీరా..ఇదేం ట్విస్టు బాబోయ్

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీరాను ఆదర్శ్ ప్రేమిస్తున్నాడని, వాళ్లిద్దరికి పెళ్లి చేద్దాం అని మురారితో కృష్ణ చెప్తుంది. దీంతో అతడు కోప్పడతాడు. అప్పుడు తనకు చెప్పకుండా సరోగసికి ఎందుకు ఒప్పుకున్నారని కృష్ణ నిలదీస్తుంది. దీంతో ఆమెను ఒప్పించేలా మురారి ప్రయత్నిస్తాడు. మీరా తనను చూసి సిగ్గు పడడంతో ఆమెకు ప్రపోజ్ చేయాలని ఆదర్శ్ ప్లాన్ చేసుకుంటాడు. ఆ విషయాన్ని మురారికి వెళ్లి చెప్తాడు. అప్పటి నుంచి అతడిలో టెన్షన్ పెరుగుతుంది. అనంతరం మీరాను కృష్ణ సూటి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. దీంతో మీరా ఆమెను గొడ్రాలు అంటూ అవమానిస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 15th

నీ కంగారు అలా అనిపించట్లే

ఆదర్శ్ , ముకుందకు ఎంత వీలైతే అంత త్వరగా పెళ్లి చేద్దామని రేవతి అంటుంది. దీంతో కృష్ణ కంగారుగా వద్దని అరుస్తుంది. ఎందుకు వద్దని అంటున్నావని రేవతి అడుగుతుంది. అలాగే, భవానీ కూడా 'వాళ్ళ పెళ్లి అనగానే పక్కన బాంబు పడినట్టు ఉలిక్కిపడ్డావు. మొహంలో కంగారు కనిపిస్తుంది. అసలు ఏమైంది' అని అడుగుతుంది. దీంతో కృష్ణ 'వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు' అంటుంది. నువ్వు పడే కంగారు అలా అనిపించడం లేదు నా కళ్ళలోకి చూసి చెప్పమని భవానీ అనగా కవర్ చేస్తుంది.

ఆలోచించాల్సిన పని లేదని
కృష్ణ మాటలకు భవానీ ఆదర్శ్ చేసుకుంటానని రాయబారం పంపించాడు ఇంకేముంది అంటుంది. దీనికామె మీరా ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా అంటుంది. అప్పుడు భవానీ 'ఇష్టం లేకుండానే వాడితో షాపింగ్‌కు వెళ్తుందా? వాడి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేని చిన్నపిల్ల కాదు. ఇష్టం లేకపోతే ఆదర్శ్‌తో అంత చనువుగా ఉండదు' అని చెప్తుంది. రేవతి కూడా 'పొద్దున్న డైనింగ్ టేబుల్ దగ్గర నేను అన్న మాటకు ఆదర్శ్‌ను చూసి సిగ్గుపడింది. ఇక ఇష్టాయిష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడు పెళ్లి చేస్తారా అని ఎదురుచూస్తున్నారు' అంటుంది.

ఆ అర్హతలు ఆమెకున్నాయి

వాళ్ల మాటలకు కృష్ణ 'అప్పుడు ముకుందతో కూడా ఇలాగే తొందరపడి పెళ్లి చేశారు కదా. తర్వాత ఏం జరిగిందో చూశాం కదా' అంటుంది. దీంతో భవానీ 'ఏదో ఒకటి రెండు సంఘటనలు చూసి అలా అనుకోవడం కరెక్ట్ కాదు' అనడంతో 'తను ఆదర్శ్‌కు సరిపోతుందో లేదో పెళ్లి చేసినా ఇద్దరు సంతోషంగా ఉంటారో లేదో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది' అని కృష్ణ చెప్తుంది. దీంతో భవానీ 'ఇంకేం అవసరం లేదు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. నీకు ఈ ఇంటి కోడలు అయ్యే అర్హతలు ఎన్ని ఉన్నాయో అన్ని అర్హతలు ఆ అమ్మాయికి ఉన్నాయి. ఆదర్శ్ గురించి చెప్పాల్సిన పని లేదు. పేరు మార్చి ముకుంద అని పెట్టుకున్నాడు' అంటుంది. దీనికి రేవతి కూడా సపోర్ట్ చేస్తుంది.

ఆ మనిషి మనకు కరెక్ట్ కాదు
తర్వాత కృష్ణ ఏడుస్తూ జరిగింది మొత్తం మురారికి చెప్తుంది. దీంతో అతడు 'ఇలా జరుగుతుందని ముందే ఆలోచన వచ్చినా ఎలాగోలా ఆపేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి' అని టెన్షన్ పడతాడు. దీంతో కృష్ణ 'మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కానీ ఎంచుకున్న మనిషి కరెక్ట్ కాదు. పెద్దత్తయ్య పెళ్లి ప్రస్తావన తీసుకుని వస్తుందని తెలుసు కానీ ఇప్పుడే చేస్తుందని అనుకోలేదు. ఈ పెళ్లి ఇష్టం లేదని మీరా ఒక్క మాట చెప్తే చాలు' అంటుంది. దీంతో మురారి 'కానీ మీరాని చూస్తే చెప్పేలా లేదు.ఈ పెళ్లి కూడా పెద్దమ్మ సంతోషం కోసమే కదా' అంటాడు.

మన బిడ్డ పరిస్థితి ఏంటి?

తర్వాత మురారి 'రేపు పెద్దమ్మ సంతోషం కోసం పెళ్లి తప్పదు అంటే మన బిడ్డ పరిస్థితి ఏంటి' అని భయపడతాడు. దీంతో కృష్ణ 'మీకు తోడుగా నేను, నాకు తోడుగా మీరు ఉంటారు. మనం ఒకరికొకరు తోడుగా ఉంటే ప్రపంచాన్ని గెలుస్తాం. ఈ సమస్యను గెలవలేమా' అంటుంది. దీనికతడు 'ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి. బిడ్డ కావాలంటే పెళ్లి జరగదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి' అంటాడు. తర్వాత ఆదర్శ్ పెళ్లి గ్రాండ్‌గా జరిగేలా ఫంక్షన్ హాల్ చూడమని భవానీ మధుకి చెప్తుంది. ఫంక్షన్ హాల్ ఎందుకు మన కృష్ణ ఊర్లో పెళ్లి చేద్దామని రేవతి సలహా ఇస్తుంది.

గిఫ్ట్ చూసి సంతోషంగానే
ముకుంద వచ్చి అటు ఇటు చూస్తుండగా ఆదర్శ్ కోసమే అని రజినీ అంటుంది. అది విన్న ముకుంద 'నేను ఆదర్శ్ కోసం వెతకడం లేదు. కానీ అందరూ అలాగే అనుకోవాలి. అప్పుడే కృష్ణ కుళ్ళి కుళ్ళి చస్తుంది' అని ముకుంద మనసులో అనుకుంటుంది. అప్పుడు మురారి మీరా వైపు కోపంగా చూస్తాడు. అంతలోనే ఆదర్శ్ వచ్చి ముకుంద ముందు మోకాళ్ళ మీద కూర్చుని గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ బర్త్ డే అంటాడు. గిఫ్ట్ తీసుకుని థాంక్స్ చెప్తుంది. గిఫ్ట్ ఏంటో చూడమని సంగీత అంటే అందులో లవ్ సింబల్ ఉంటుంది. అది చూసి చాలా బాగుందని ముకుంద అంటుంది.

పెళ్లి గురించి చెప్పేయగా

అనంతరం అందరి ముందే ముకుందకు, ఆదర్శ్‌కు పెళ్లి గురించి చెప్తారు. దీంతో ఇద్దరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. అది చూసి మురారి వాళ్లు ముకుందను రెస్టారెంట్‌కు రమ్మంటారు. అక్కడ ఆమెకు క్లాస్ పీకడానికి సిద్దం అవుతారు. అప్పుడు ముకుంద నాటకాలు మొదలు పెడుతుంది. అంతేకాదు, కృష్ణను నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఇంట్లో నువ్వు డ్రామాలు ఆడుతున్నావని అంటుంది. దీంతో కృష్ణ 'నువ్వు చేసే ప్రతి పని సమస్యకు దగ్గర అయ్యేలా చేస్తుంది' అని చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X