Krishna Mukunda Murari: ఇద్దరి బర్త్‌డే ఒకేరోజు ఎలా? పాయింట్ పట్టుకున్న కృష్ణ.. అంతలోనే పంతులు షాక్
ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుందకు, ఆదర్శ్‌కు పెళ్లి చేద్దాం అని చెప్పగానే కృష్ణ వద్దు అంటుంది. దీంతో భవానీ, రేవతి ఏమైందని ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అప్పుడు కృష్ణ వాళ్లను అడిగి ఒప్పుకుంటే చేద్దాం అని కవర్ చేస్తుంది. తర్వాత ఇదే విషయం మురారికి చెప్పడంతో అతడు టెన్షన్ పడతాడు. ఇక, ముకుంద పుట్టినరోజు సందర్భంగా ఆదర్శ్ ఆమెకు లవ్ సింబల్ ఇచ్చి విషెస్ చెప్తాడు. అది చూసి ముకుంద సిగ్గు పడడంతో వీళ్లకు పెళ్లి చేయాలనుకున్న విషయం భవానీ చెప్తుంది. అప్పుడు వాళ్లు ఒప్పుకున్నట్లు సైగలు చేస్తారు. దీంతో ముకుందను పిలిచి మురారి క్లాస్ పీకుతాడు.

మీరే పెళ్లి ఆపేయండి అంటూ
ఆదర్శ్‌తో పెళ్లికి ముకుంద రెడీ అవుతున్నట్లుగా సిగ్నల్స్ ఇవ్వడంతో మురారి, కృష్ణ ఆమెతో మీటింగ్ పెడతారు. అప్పుడు కృష్ణ 'నువ్వు చేసే పనుల వల్ల సమస్యకు దూరం కావడం కాదు దగ్గర అవుతున్నాం' అంటుంది. దీంతో ముకుంద 'అయితే పెళ్ళిని ఆపేయండి. ఆదర్శ్ నాకు ఈ మధ్య పరిచయం అయ్యారు. కానీ మీకు కజిన్ కదా. తనే ఈ పెళ్లి వద్దని అనుకునేలా చేయండి. అంతే కానీ నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని బరువు నా నెత్తి మీద వేయకండి. కడుపులో బిడ్డ ఉండటం వల్ల నాకు నీరసంగా ఉంది' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మధు చెంప పగలకొట్టేసింది
ఆదర్శ్‌తో పెళ్లి వర్కౌట్ కాదని భావించిన సంగీత.. మధు దగ్గరకు తనను హీరోయిన్‌ను చేయమని అడుగుతుంది. కానీ, మధు మాత్రం 'వద్దు నువ్వు అమాయకురాలివి. ఈ ఫీల్డులోకి రావద్దు. ఇందులోకి వస్తే బయట కూడా నటించాలి. ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు' అంటూ భుజం మీద చేయి వేసి చెప్తాడు. అది చూసిన రజిని వెంటనే మధును చెంప మీద కొడుతుంది. అంతేకాదు 'నా కూతురు భుజం మీద చెయ్యి వేసి మాట్లాడతావా' అని తిడుతుంది. దీంతో సంగీత ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దని ఎదిరిస్తుంది.
ధైర్యం సరిపోవడం లేదని
మీరా చేసిన పనితో కృష్ణ, మురారి టెన్షన్ పడుతుంటారు. అప్పుడు వాళ్లు ఇప్పుడు ఏం చేద్దాం అని ఒకేసారి ఇద్దరూ అంటారు. తర్వాత మురారి 'ముకుంద వల్ల ఇద్దరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైంది' అంటాడు. దీనికి కృష్ణ 'అందుకే మీరా సరోగసి మథర్ అంటే టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు చూడండి ఈ పెళ్లి ఎలా ఆపాలో ప్లాన్ చేయాల్సి వస్తుంది. పెద్దత్తయ్య కళ్ళలో కళ్ళు పెట్టి అబద్ధం చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు. బిడ్డ కావాలని కలలు కంటే ఆ అవకాశం లేకుండా పోయింది. సరోగసి అనుకుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి' అని బాధపడుతుంది.
పెళ్లి గురించే ఆలోచనలో
కృష్ణ మాటలకు మురారి 'ఇవే కాదు చాలా సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించాలి. ముందు ఈ పెళ్లి జరగకుండా ఆపాలి' అంటాడు. దీనికామె ఇప్పుడు నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదని అంటుంది. దీనికి అతడు 'వీల్లేదు ఇప్పుడు నిజం బయట పెడితే చాలా సమస్యలు వస్తాయి' అని చెప్తాడు. అంతలో ఎదురుగా భవానీ ఉంటుంది. ఆమెను చూసి ఇద్దరూ టెన్షన్ పడతారు. దీంతో ఏమైంది? దేని గురించి అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నారు అని అడగ్గా.. ఆదర్శ్ పెళ్లి గురించని అబద్ధం చెప్తారు. ఏ టెన్షన్ లేదు కదాని భవానీ మరోసారి అడుగుతుంది.
చుక్కలు చూపిస్తానంటూ
ముకుంద డైరీ రాసుకుంటూ 'ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకవైపు గర్భవతి అనే అబద్ధం, మరోవైపు పెళ్లి ఆపే బాధ్యత. ఇవి చాలు కృష్ణని ఇంట్లో నుంచి బయటకు పంపించేయడానికి. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించే రోజు నా చెంప మీద కొట్టావు. ఈరోజు నుంచి నువ్వు బయటకు వెళ్ళే వరకు పట్టపగలు చుక్కలు చూపిస్తా' అనుకుంటుంది. తర్వాత ముకుంద అంతరాత్మ బయటకు వస్తుంది. నువ్వే ముకుంద అని తెలిస్తే పరిస్థితి ఏంటి అని ఆత్మ అడగ్గా.. వాళ్లు నా దగ్గర ఇరుక్కుని ఉన్నారు. బిడ్డ కోసం నన్ను ఏమీ చేయలేరు అంటుంది.
ఇద్దరి పుట్టినరోజులు ఎలా
కృష్ణ ఆలోచిస్తూ.. 'నిన్న మీరా పుట్టినరోజు కదా. ముకుంద పుట్టిన రోజు కూడా అదే అలా ఎలా అయ్యిందో' డౌట్ పడుతుంది. కానీ మురారి మాత్రం అలా ఏం లేదు ఏవేవో ఊహించుకోవద్దని చెప్తాడు. దీంతో కృష్ణ 'నాకు మాత్రమే ఈ డౌట్ ఎందుకు వస్తుంది? నేను అపోహ పడుతున్నానా? మీరా సరోగసి మథర్‌గా ఉండాలని అనుకుంటున్నట్టు ముందే ఎందుకు చెప్పలేదు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? నాకు ఎందుకో అనుమానంగా ఉంది' అంటుంది. దీంతో మురారి మనం ఇప్పుడు పెళ్లి ఆపడం గురించే ఆలోచించాలి అంటూ ఆమెకు సర్ధి చెబుతాడు.
బాగా ఇరుక్కున్నారంటూ
ఆదర్శ్, ముకుందకు పెళ్లి చేసేందుకు ముహూర్తం చూడడానికి పంతులు వస్తాడు. అది చూసిన కృష్ణ, మురారి షాక్ అవుతారు. వాళ్లను అలా చూసి ముకుంద తెగ సంతోషపడుతుంది. ఆ సమయంలోనే కృష్ణ దగ్గరలో ముహూర్తాలు లేకపోతే బాగుండని అనుకుంటుంది. కానీ, భవానీ 'కృష్ణకు నెలలు నిండకముందే పెళ్లి జరిగిపోవాలి. ఈ తింగరి అల్లరి చేస్తేనే ఆనందంగా ఉంటుంది. ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. అలా అని పనులన్నీ నెత్తిన వేసుకోకు. ఈ పెళ్లి బాధ్యత మీ ఇద్దరిదే' అంటుంది. దీంతో మకుంద బాగా ఇరుక్కున్నారని అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











