Krishna Mukunda Murari: కడుపుతో అడ్డంగా దొరికిన ముకుంద.. కుట్ర బయటపడుతుందని.. కథలో ఊహించని ట్విస్ట్
జనరేషన్లు మారుతున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
తనతో మాట్లాడేందుకు వచ్చిన మురారి, కృష్ణను పెళ్లి ఆపాల్సిన బాధ్యత మీదే అంటూ ముకుంద తేల్చేస్తుంది. దీంతో వాళ్లకు టెన్షన్ పెరిగిపోతుంది. అలా ఇద్దరూ భయపడుతుండగా ముకుంద రాక్షసానందం పొందుతుంది. అంతేకాదు, ఇంకా ఇంకా నరకం చూపించాలని అనుకుంటుంది. అనంతరం మధు, సంగీతకు మంచి చెప్తుంటే అపార్థం చేసుకున్న రజినీ అతడిని కొడుతుంది. దీంతో సంగీత తల్లికి ఎదురు తిరుగుతుంది. ముకుంద, ఆదర్శ్ పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు వస్తాడు. అప్పుడు పెళ్లి బాధ్యతను భవానీ.. కృష్ణ వాళ్లకు అప్పగిస్తుంది.

వారంలోనే పెళ్లంటూ షాక్
ఆదర్శ్, ముకుంద పెళ్లి బాధ్యతను భవానీ కృష్ణ వాళ్ళకి అప్పగిస్తుంది. తర్వాత ఇద్దరి జాతకాలను బట్టి వచ్చే శుక్రవారం ముహూర్తం ఉందని పంతులు చెబుతాడు. దీంతో కృష్ణ వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు వాళ్లు వారం రోజుల్లో పెళ్లి పనులు అంటే అయిపోతాయా అనడంతో ఎందుకు అవవు అని ఆదర్శ్ చెబుతాడు. తర్వాత ఆదర్శ్‌ను చూసి మీరా తెగ సిగ్గుపడిపోతుంది. కానీ, మురారి వాళ్ళు తన వైపు చూసేసరికి ముఖం మాడ్చుకుంటుంది. అనంతరం శుక్రవారమే ముహూర్తం పెడుతూ పంతులు లగ్నపత్రిక కూడా రాస్తాడు.
కుట్ర బయటపడుతుంది
ముహూర్తాలు పెట్టిన వెంటనే ముకుంద.. కృష్ణ వాళ్లను పిలుస్తుంది. అప్పుడామె 'నువ్వు కడుపు లేకపోయినా మ్యానేజ్ చేస్తున్నావు. మీరు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా' అని అడుగుతుంది. దీంతో మురారి 'పెద్దమ్మ ఇంత త్వరగా ముహూర్తాలు పెట్టిస్తుందని ఊహించలేదు' అంటాడు. దీంతో ముకుంద 'కృష్ణకు గర్భసంచి పోతుందని మీరు ఊహించారా? పోయింది కదా. మీ బిడ్డను నా కడుపులో మోయాల్సి వస్తుందని ఊహించారా? కానీ మోస్తున్నాను కదా. పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు. తొందరగా ఏదో ఒకటి చేయండి లేదంటే మన ముగ్గురి కుట్ర బయట పడుతుంది' అని బెదిరిస్తుంది. దీంతో కృష్ణ 'మీరా కుట్రలు ఎవరు చేయడం లేదు. తెలియకుండా ఇరుక్కుపోయి ఎలా బయటకు రావాలో తెలియడం లేదు' అంటుంది.

ఆమె కోసమే చేస్తున్నాను
తర్వాత ముకుంద 'పెళ్లి ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అది ఏదైనా అయితే పెళ్లి కూతురి కడుపులో మా బిడ్డ పెరుగుతుందని చెప్పలేరు కదా. అప్పుడు ఆదర్శ్ కావాలని మీరు ఈ పెళ్లి చెడగొట్టారు. అది అందరి దృష్టిలో కుట్ర కిందకు వస్తుంది కదా. ఎలాగైనా పెళ్ళిని ఆపండి' అని చెప్తుంది. దీంతో కృష్ణ 'ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్క మాట చెప్తే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు' అంటుంది. దీనికామె 'నేను ఎందుకు చెప్పలేనో నీకు కారణం చెప్పాను కదా. పెద్దావిడ నాకోసం ఇంత చేశారు. ఇప్పుడు కోడలిని చేసుకుంటానంటే కాదని అనగలనా' అంటుంది.
పెళ్లి కోసం ఆశగా లేదు
అనంతరం ముకుంద 'ఈ పెళ్లి కోసం నేనేదో ఆశ పడుతున్నానని అనుకోవద్దు. మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. హ్యాపీగా మీ బిడ్డని మీకు కనిపెడతాను. నా నోటితో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తానని అనుకోవద్దు' అని చెప్తుంది. దీంతో మురారి 'టెన్షన్ తీసుకోవద్దు బిడ్డకు ప్రాబ్లం అవుతుంది' అని అంటాడు. మరోవైపు భవానీ సంతోషంగా ఉంటుంది. రేవతి వచ్చి 'కృష్ణ ఎప్పుడు హుషారుగా ఉంటుంది. కానీ ఇది కృష్ణకి నచ్చినట్టు లేదు. ఇందాక మీరు ఆ మాట అన్నప్పుడు మొహం మాడ్చుకుంది' అని చెప్తుంది. దీంతో భవానీ తను అలా చేస్తే ఊరుకోను అంటుంది.

మీరా కావాలనే చేస్తోంది
మీరా వెళ్లిన తర్వాత కృష్ణ 'మీరా ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది' అంటుంది. దీంతో మురారి 'అలా ఏమి లేదు. అనవసరంగా మీరాని అనుమానించడం మానేయ్' అంటాడు. తర్వాత భవానీ కృష్ణని పిలిచి 'పెళ్లి పనులు చూసుకోవడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. రెస్ట్ తీసుకో' అని చెప్తుంది. తర్వాత పెళ్లి పనులు చూసుకోవడానికి ఈవెంట్ మేనేజర్ తీసుకుని వస్తాడు మధు. పెళ్లి పనులన్నీ చేస్తాడని చెప్తాడు. నిన్ను దగ్గరుండి చూసుకోవడానికి మనుషులను పిలిపిస్తున్నానని భవానీ చెప్తుంది. ఎవరని కృష్ణ రేవతిని అడుగుతుంది.
ముకుందకు వాంతులు
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. అంతలో ముకుందకి వాంతులు అవుతాయి. మురారి పరుగున వెళ్ళి ఆమె చెవులు మూస్తాడు. అప్పుడే ఆదర్శ్ వచ్చి వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు. అప్పుడు ముకుంద 'నీతో ఈ సేవలు చేయించుకోవడం కోసం నీ బిడ్డని నా కడుపులో పెట్టుకున్నాను. ఇక నుంచి నేను నీ వెంట పడటం కాదు.. నువ్వే నా వెంట పడతావు' అని అనుకుంటుంది. తర్వాత రజినీ 'కడుపుతో ఉన్న కృష్ణకు వాంతులు కావడం లేదు. పెళ్లి కానీ ముకుంద వాంతులు చేసుకుంది' అంటుంది. దీంతో రేవతి ఆమెను తిడుతుంది.
అందరిలో డౌట్ స్టార్ట్
రజినీ మాటలతో ముకుంద 'అందరిలో డౌట్ మొదలైంది. ఇంకో రెండు సార్లు ఇలా జరిగితే మొత్తం తెలిసిపోతుంది' అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్ 'ఏమైంది? ప్రాబ్లం ఏంటి ఎవరితోనూ చెప్పలేకపోతే నాతో అయినా చెప్పు' అని అడుగుతాడు. మరోవైపు భవానీ 'ఎవరితోనూ చెప్పుకోలేని ప్రాబ్లం ఏమై ఉంటుంది. ఒకవేళ ముకుంద కూడా తల్లి కావడం లేదు కదా. దానికి ఆదర్శ్ కారణం కాదు కదా' అని అనుమానపడుతుంది. అప్పుడే రజినీ కూడా ఇంట్లో ఎవరు నెల తప్పారో నాకు అర్థం కావడం లేదని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











