Krishna Mukunda Murari: మీరా కడుపుతో ఉందన్న భవానీ.. అంతలోనే మిస్సింగ్.. పెళ్లికి ముందు బిగ్ ట్విస్ట్

ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఇంటికి వచ్చిన పంతులు పెళ్లి వారంలోనే జరిగేలా ముహూర్తం పెడతాడు. దీంతో ఆదర్శ్ సంతోషిస్తుండగా కృష్ణ వాళ్లు టెన్షన్ పడుతుంటారు. దీంతో పెళ్లిని ఆపాలన్న బాధ్యతను కృష్ణ, మురారిదేనని ముకుంద తేల్చి చెప్తుంది. అంతేకాదు, భవానీ దేవి కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు కవర్ చేస్తుంది. కానీ, ముకుంద తీరు చూసిన కృష్ణకు డౌట్ వస్తుంది. అయితే, ఆమెను మురారి సపోర్ట్ చేస్తాడు. అనంతరం ముకుందకు వాంతులు అవుతాయి. అప్పుడు మురారి ఆమెకు సాయం చేస్తాడు. ఇది చూసిన వాళ్లకు ముకుంద ప్రెగ్నెంట్ అయిందన్న సందేహం వస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 18th

మిమ్మల్ని అపార్థం చేసుకోలే
కృష్ణ ఏదో ఆలోచిస్తుండగా మురారి వచ్చి 'మనం ఇప్పటికే చాలా టెన్షన్‌లో ఉన్నాం మళ్ళీ కొత్త వాటి గురించి ఆలోచించద్దు. నీకు మీరా నచ్చదు తను వాంతి చేసుకుంటే నేను చెవులు పట్టుకుంటే నీకు అసలు నచ్చదు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో' అంటూ వివరణ ఇవ్వబోతాడు. అప్పుడు కృష్ణ 'నేనేమీ మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు. అయినా నేను ఎందుకు అపార్థం చేసుకుంటాను' అంటుంది. దీనికతడు 'కారులో లిఫ్ట్ ఇచ్చినందుకు అలా అలిగావు. ఈరోజు తన తల పట్టుకున్నాను. భార్య ముందు ఇలా చేస్తే నచ్చదు కదా' అంటాడు.

నాకు మన బిడ్డనే ముఖ్యం
తర్వాత మురారి తను మన బిడ్డను మోస్తుంది అంటాడు. దీంతో కృష్ణ 'మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఈరోజు చూశాను. మన బిడ్డని మోస్తున్న అమ్మాయిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీరా ప్రవర్తన వల్ల లేనిపోని అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. ఇప్పుడు నాకు మన బిడ్డ ముఖ్యం. తల్లితో నాకు సంబంధం లేదు. మీరు మాటిచ్చారు కదా. ఇప్పుడు మీరాను కూడా బాగా చూసుకుంటాను. అపురూపంగా కంటి పాపని చూసుకుంటున్నట్టు చూసుకుంటానని మాట ఇస్తున్నా' అని చెప్పుకొస్తుంది.

మీరా నెల తప్పింది అని
కృష్ణకు భవానీ ఫోన్ చేసి రమ్మని పిలవగా ఆమె వెళ్తుంది. అప్పుడు 'మీరా నెల తప్పింది' అని భవానీ చెప్పడంతో కృష్ణ షాక్ అవుతుంది. వెంటనే 'సరోగసి గురించి తెలుసుకుందేమో. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా అందరికీ చెప్పి హడావుడి చేస్తారు. మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది' అని అడుగుతుంది. దీంతో భవానీ 'అనుమానం కాదు కాన్ఫమ్‌గా చెప్తున్నా. మనం భోజనం చేసేటప్పుడు వాంతులు చేసుకుంది కదా. అప్పుడు ఆదర్శ్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా అని అడిగాడు' అంటుంది. దీంతో కృష్ణ 'మీరా నెల తప్పడానికి ఆదర్శ్ కారణం కాదు. అసలు ఆ సంగతి ఆదర్శ్‌కు తెలియదు' అని మనసులో అనుకుంటుంది.

మీరాను టెస్ట్ చేయమని
భవానీని కన్విన్స్ చేయడానికి కృష్ణ ప్రయత్నిస్తుంది. కానీ, ఆమె వినిపించుకోదు. అప్పుడు కృష్ణ 'అలా డౌట్ వస్తే ప్రెగ్నెన్సీ తెలిసిపోతుంది. సరోగసి ద్వారా వచ్చే బిడ్డ వద్దని చెప్తే బిడ్డ కంటే ఆదర్శ్‌తో పెళ్లి ముఖ్యమంటే నా చేతులతో నా బిడ్డని తీసేయాల్సి వస్తుంది' అని బాధపడుతుంది. అప్పుడు భవానీ 'నా అనుమానం నిజమై తను నిజంగానే తల్లి కాబోతుందని తెలిస్తే నిన్ను చూసుకున్నట్టే తనని జాగ్రత్తగా చూసుకుంటాను. టెస్ట్ చేస్తే ఎందుకో పాజిటివ్ వస్తుందని అనిపిస్తుంది. రేపే వెళ్ళి టెస్ట్ చెయ్' అని చెప్తుంది. ఇదంతా మీరా చాటుగా వింటూనే ఉంటుంది.

అబద్ధం చెప్పి తప్పించు
తర్వాత విషయాన్ని మురారికి చెప్పిన కృష్ణ 'బిడ్డని వద్దనుకోవాలా' అంటుంది. దీంతో అతడు కంగారు పడతాడు. తర్వాత కృష్ణ 'వద్దని అనుకుంటే నేను ఉంటానా? పరిస్థితులన్నీ అక్కడికే తీసుకెళ్తున్నాయి' అని టెన్షన్ పడుతుంది. దీంతో మురారి 'టెస్ట్ చేశాను గర్భం లేదని అబద్ధం చెప్పి తప్పించుకో' అంటాడు. దీనికామె 'ఎంతకాలం ఇలాగా? నా గర్భం పోయింది మీకు వారాసులని ఇవ్వాలని సరోగసికి వెళ్లానని చెప్పేస్తా' అంటుంది. మురారి వద్దని చెప్తాడు. కానీ, కృష్ణ మాత్రం ఆదర్శ్ జీవితం కూడా దీనిపై ఆధారపడి ఉందని బాధ పడుతుంది.

కనిపించిన ముకుంద
ఆదర్శ్ కంగారుగా ముకుంద కోసం వెతుకుతూ అందరినీ ఎంక్వైరీ చేస్తుంటాడు. దీంతో అతడి ప్రేమను చూసి భవానీ, రేవతి మురిసిపోతారు. తర్వాత మురారి వాళ్లను అడుగు అని సలహా ఇస్తారు. ఆ వెంటనే ఆదర్శ్ కంగారుగా ముకుందని చూశారా రాత్రి నుంచి కనిపించడం లేదని చెప్తాడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్తుందని మురారి అంటాడు. దీంతో ఆదర్శ్ 'ఎవరికీ చెప్పలేదు. నాకు చాలా కంగారుగా ఉంది. నాతో పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయిందని అనుకుంటే ఆ ఛాన్స్ లేదు నేనంటే తనకు చాలా ఇష్టం. ముహూర్తాలు కూడా పెట్టాము' అంటాడు.

వాళ్లు అలా.. ఆదర్శ్ ఇలా
నందిని, సుమలత, ప్రసాద్ ఇంటికి వస్తారు. ఇల్లంతా సందడిగా ఉంటుంది. నందిని సంతోషంగా కృష్ణని ఎత్తుకుని తిప్పేస్తుంది. నాకు మేనల్లుడిని ఇస్తున్నావా మేనకోడలిని ఇస్తున్నావా అని అడుగుతుంది. దీంతో భవానీ 'నాకు మా అమ్మని ఇస్తానని కృష్ణ మాట ఇచ్చింది' అని భవానీ సంతోషంగా చెప్తుంది. మురారి, కృష్ణ ఎమోషనల్‌గా చూస్తారు. మరోవైపు, ముకుంద ఇంకా రాలేదు ఏంటని ఆదర్శ్ టెన్షన్ పడతాడు. అప్పుడే మీరా కృష్ణకి ఫోన్ చేసి మనం ముగ్గురం కలిసిన రెస్టారెంట్‌కు రండి. అక్కడికి వచ్చాక మాట్లాడుకుందామని చెప్తుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X