Krishna Mukunda Murari: కృష్ణకు షాకిచ్చిన భవానీ.. నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే!
ఇండియాలోని ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మురారి, కృష్ణ తల్లిదండ్రులు కాలేకపోతున్నారని భావించిన భవానీ దేవి వాళ్ల కోసం సర్‌ప్రైజ్ పార్టీని చేయాలని ప్లాన్ చేస్తుంది. అందుకోసం హడావిడి చేస్తుండగా ఆదర్శ్‌కు నిజం తెలిసి షాక్ అవుతాడు. మరోవైపు, కృష్ణ తన సరోగసి మదర్‌ను చూపించమని డాక్టర్ వైదేహిని అడుగుతుంది.
కానీ, ఆమె మాత్రం అలా వివరాలు చెప్పమని తేల్చి చెప్తుంది. అనంతరం ముకుంద డాక్టర్ దగ్గరకు వస్తుంది. అప్పుడామె కృష్ణ అడిగిన విషయం చెప్తుంది. అది తెలిసి ముకుంద సంతోషిస్తుంది. ఇక, పార్టీకి వచ్చిన వాళ్లు ఆదర్శ్‌ను అవమానిస్తూ మాట్లాడడంతో అతడికి కోపం వస్తుంది.


Click it and Unblock the Notifications











