Krishna Mukunda Murari: కడుపులో చనిపోయిన బిడ్డ.. లెటర్‌లో షాకింగ్ మేటర్.. కథలో ఊహించని మలుపు

తరాలు మారుతున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మీరా వాంతులు చేసుకుంటుంటే సాయం చేసినందుకు కృష్ణ అలుగుతుందేమో అని మురారి ఆమెకు వివరణ ఇస్తుంటాడు. కానీ, తానేమీ ఫీల్ కాలేదని కృష్ణ చెప్తుంది. అనంతరం భవానీ దేవి.. కృష్ణను పిలిచి ముకుంద కడుపుతో ఉందని అంటుంది. ఇందుకోసం ఆమెను ఒకసారి చెక్ చేయమని కృష్ణతో చెప్తుంది. ఈ విషయం మురారికి చెప్పడంతో అతడు చెక్ చేసి అబద్ధం చెప్పమని అంటాడు. అనంతరం ముకుంద ఇంట్లో కనిపించకపోవడంతో ఆదర్శ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా అందరూ ఆమెను వెతుకుతుండగా కృష్ణకు ఫోన్ చేసి రెస్టారెంట్‌కు రమ్మని చెబుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 20th

లెటర్ చూసి షాక్ అయ్యారు:మీరా ఫోన్ చేసి రమ్మనడంతో మురారి, కృష్ణ బయలుదేరుతారు. అప్పుడు భవానీ ఆపేసి మీరాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని గట్టిగా చెబుతుంది. అనంతరం రెస్టారెంట్‌కు వచ్చిన మురారి వాళ్లు 'రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు' అని కంగారుగా అడుగుతారు. అయినా ఆమె సైలెంట్‌గా ఉంటుంది. దీంతో కృష్ణ ఏమైంది ఎక్కడికి వెళ్ళావని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు మీరా ఒక లెటర్ కృష్ణకు ఇస్తుంది. అది చూసి కృష్ణ షాక్ అవుతూ ఏడుస్తుంది. మురారి ఆ లెటర్ తీసుకుని చూసి కోపంతో రగిలిపోతాడు.

గర్భం తీయించుకుంటావా:ఆ లెటర్ చూసిన తర్వాత మీరా చెంపను కృష్ణ చెల్లుమనిపిస్తుంది. అంతేకాదు, 'ఎంత పని చేశావే.. నా బిడ్డను నీ కడుపులో చల్లగా పెంచుతానని మాట ఇచ్చి గర్భం తీయించుకుంటావా? నా బిడ్డను పొట్టన పెట్టుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఎవరిని అడిగి చేశావు' అని నిలదీస్తుంది. దీనికామె 'కారణం నువ్వే కృష్ణ.. నీకోసమే చేశాను' అంటుంది. అప్పుడు కృష్ణ 'నాకోసం నా బిడ్డను నాకు కాకుండా చేయడం ఏంటి' అని నిలదీస్తుంది. దీంతో మీరా 'కృష్ణ కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. నా కడుపులో ఉండటం కంటే తీసేయడమే మంచిది' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 20th

నీ బాధను చూడలేకే ఇలా:తర్వాత కృష్ణ.. మీరా గొంతు పట్టుకుని 'బిడ్డ కోసం ఎన్ని పాట్లు పడ్డానో తెలుసా? నాకు ఆ యోగం లేదని ఎంత కుమిలిపోయానో తెలుసా? మేము ఎవరో ఒక మంచి ఆవిడ దొరకపోతుందా అని ఎదురుచూస్తుంటే సంబంధం లేకుండా నువ్వు మధ్యలో వచ్చి.. నా బిడ్డని నీ కడుపులో వేసుకుని.. ఇప్పుడు ఏదో కారణంతో తీసేసి నేనే కారణం అంటావ్ ఏంటి' అని ప్రశ్నిస్తుంది. దీంతో మీరా 'అవును నువ్వే కారణం. నీ బాధ చూడలేక నేను బిడ్డని తీసేశాను. గర్భం ఉందని ఎన్ని రోజులు నాటకం ఆడుతావ్. మోసం చేస్తున్నాననే బాధతో ఎంత కుమిలిపోతావు. ఆ బాధ చూడలేక తీసేశాను. ఇప్పుడు బిడ్డ లేదు వెళ్ళి చెప్పేసేయ్. ఏదో ఒక కారణం వల్ల నీ గర్భం పోయిందని చెప్పు ఏ గోల ఉండదు' అని అంటుంది.

పెళ్లి ఉద్దేశం నాకు లేదని:తర్వాత మీరా 'ఇప్పుడు చేయించుకున్నట్టే సరోగసి చేయించుకోండి. మళ్ళీ ఇంకోకరిని చూసి ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నేను కాకుండా వేరొకరు అయితే లాభం కూడా. పెళ్లి ఆపాలనే టెన్షన్ కూడా ఉండదు. ఒకవేళ ఆపినా దొరికిపోతామనే భయం ఉండదు' అంటుంది. దీంతో కృష్ణ 'నీ కడుపులో ఉన్న నా బిడ్డ ఆదర్శ్‌తో పెళ్ళికి అడ్డం. అందుకే బిడ్డని తీసేసి ఏవేవో కారణాలు చెప్తున్నావ్' అంటుంది. దీనికామె 'ఆదర్శ్‌ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఎందుకు సరోగసికి ఒప్పుకుంటాను. రాత్రి నువ్వు భవానీ మేడమ్‌తో మాట్లాడింది విన్నాను' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 20th

అంతా బయటపడుతుంది:అనంతరం మీరా 'నాకు టెస్ట్ చేసి గర్భవతి అని తెలిస్తే ఏమవుతుంది? నువ్వు పడిన టెన్షన్ చూశాను. నీ చేత్తో నువ్వు నీ బిడ్డని తీయాల్సి వస్తుందని నేనే తీసేశాను. ఇదంతా నీ మంచి కోసమే చేశాను. నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను' అని వెళ్ళిపోతుంది. దీంతో కృష్ణ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆదర్శ్ ఇంటి దగ్గర ముకుంద ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ముకుంద వస్తుంది. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు వెళ్ళినట్టు అబద్ధం చెప్తుంది. భవానీ వచ్చి కృష్ణ రానివ్వు అంతా బయట పడుతుంది అని అంటుంది.

ఇది మన మంచికే అని:కృష్ణ బాధపడుతుంటే మురారి ఓదార్చడానికి చూస్తాడు. అప్పుడామె 'నేనే లేకపోయి ఉంటే మీ జీవితం బాగుండేది. నా దురదృష్టం మీకు అంటుకుంది. చచ్చిపోవాలని అనిపిస్తుంది' అని ఏడుస్తుంది. దీంతో మురారి 'తప్పు నాదే.. మీరా గురించి నువ్వు చెప్పినా వినిపించుకోలేదు. నువ్వే కరెక్ట్ తను బయటకు కనిపించేది వేరు లోపల వేరు. మనల్ని అడగకుండానే బిడ్డని వేసుకుంది. ఇప్పుడు తీసేసింది' అంటాడు. ఇప్పుడు పెద్దత్తయ్యకి ఏం చెప్పాలని కృష్ణ బాధపడుతుంది. దీంతో స్టార్టింగ్‌లో జరగడం మన మంచికే అని మురారి ఆమెను ఓదార్చుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 20th

రెండుసార్లు అడ్డు అని:భవానీతో రజినీ మాట్లాడుతుంది. 'నీ కొడుకుతో నా కూతురు పెళ్లి చేస్తావని ఆశతో వస్తే అడియాసలు అయ్యాయి' అంటుంది. దీంతో భవానీ 'ఇష్టం లేని వ్యక్తితో ఎలా కాపురం చేస్తామని నీ కూతురు చాలా క్లియర్‌గా ఉంది. దాని గురించి పట్టించుకోవద్దు' అంటుంది. దీంతో రజినీ 'అప్పుడు ముకుంద అడ్డు వచ్చింది. ఇప్పుడు మీరా అడ్డు వచ్చింది. నువ్వు ఇచ్చిన మాట తప్పావు' అంటుంది. దీంతో భవానీ 'చేసుకునేవాడికి ఇష్టం ఉండాలి. ఇప్పటికే భార్యని కోల్పోయాడు. ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసి ప్రయోజనం ఏముంది' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X