Krishna Mukunda Murari: ముకుంద కొత్త ప్లాన్.. కృష్ణను అలా బెదిరిస్తూ.. నిజం కనిపెట్టిన మురారి!

ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:తన పిలుపు మేరకు వచ్చిన కృష్ణ, మురారికి ముకుంద ఒక లెటర్ ఇస్తుంది. అందులో అబార్షన్ చేయించుకున్నట్లు రాసి ఉంటుంది. అది చూసిన కృష్ణ తల్లడిల్లిపోతూ ఆమెపై ఫైర్ అవుతుంది. మురారి కూడా ఆమెను తిడతాడు. అప్పుడు ముకుంద.. కృష్ణ బాగు కోసమే తాను ఇలా చేసినట్లు వివరిస్తుంది. కానీ, వాళ్లు మాత్రం వినిపించుకోరు. దీంతో మురారి.. కృష్ణను ఓదార్చుతాడు. ఇక, తన కూతురితో ఆదర్శ్ పెళ్లి చేయాలని భవానీ దేవితో రజినీ గొడవకు దిగుతుంది. కానీ, ఆమె మాత్రం సంగీతతో ఆదర్శ్‌కు పెళ్లి ఇష్టం లేకుండా ఏమీ చేయలేనని తేల్చి చెప్పేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 21st

పెళ్లిని మీరే ఆపాలి అంటూ:అందరూ కలిసి కింద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడే కృష్ణ వాళ్ళు వస్తారు. వాళ్లను చూసి పెళ్లి సందడి మొదలయింది అని కృష్ణ బాధగా అంటుంది. తర్వాత కృష్ణ కింద కూర్చుంటే ఒట్టి మనిషివి కూడా కాదు పైన కూర్చోమని భవానీ చెప్తుంది. ఆ సమయంలో ముకుంద కావాలని కృష్ణ బాధపడేలా మాట్లాడుతుంది. అంతలో కృష్ణకు పొలమారుతుంది. ముకుంద వెంటనే నీళ్ళు తీసుకెళ్ళి తాగిస్తూ 'గర్భం తీసేశానని ఈ పెళ్లి ఆపాల్సిన పని లేదని రిలాక్స్ అయిపోతారు ఏమో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా మీరే ఈ పెళ్లి ఆపాలి' అంటూ షాక్ ఇస్తుంది.

కళ్లు తిరిగి పడిపోయిన కృష్ణ:ముకుంద 'ఈ పెళ్లి ఆపకపోతే మీ విషయం మొత్తం చెప్పేస్తాను' అని కృష్ణను బెదిరిస్తుంది. ముకుంద మాటలకు కృష్ణ స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో అందరూ కంగారుపడతారు. అప్పుడు భవానీ డాక్టర్‌కు ఫోన్ చేయమని అనగా.. మురారి కంగారుగా వద్దని అంటాడు. కానీ భవానీ వినకుండా ఫోన్ చేస్తుంది. అంతలోనే వేరే డాక్టర్ అయితే విషయం చెప్పేస్తారని మురారి కంగారుపడి కృష్ణ మొహం మీద నీళ్ళు చల్లుతాడు. దీంతో ఆమె కళ్ళు తెరుస్తుంది. తర్వాత భవానీ ఆస్పత్రికి వెళ్దాం అంటే.. ప్రెగ్నెంట్‌గా ఉంటే ఇలాగే అవుతుందని కృష్ణ కవర్ చేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 21st

ముకుందపై మరోసారి డౌట్:కృష్ణ కంగారు చూసి మధుకు డౌట్ వస్తుంది. తర్వాత మురారి 'మీరాకు ఆదర్శ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాడు మాత్రం తననే పెళ్లి చేసుకోవాలని చాలా అనుకున్నాడు. అప్పుడు ముకుంద.. ఇప్పుడు మీరా.. వాడికి ఎందుకు ఇలా జరుగుతుంది' అని కృష్ణ చెప్పి బాధపడతాడు. దీంతో కృష్ణ 'మీరాకు మన కుటుంబానికి ఏంటి సంబంధం? మిమ్మల్ని ముకుంద వాళ్ళ నాన్న అరెస్ట్ చేయించినప్పుడు హోమ్ మినిస్టర్‌తో మాట్లాడి విడిపించింది. తర్వాత అనాథ అంటే పెద్దత్తయ్య ఇంట్లో చోటు ఇచ్చింది. హ్యాపీగా ఆదర్శ్‌ను పెళ్లాడొచ్చు కదా' అంటుంది.

తన మనసులో ఉన్నారేమో:కృష్ణ మాటలకు మురారి 'మీరాకు ఈ ఇంట్లో స్థానం దక్కడమే ఎక్కువ. అలాంటిది కోడలి స్థానం వస్తుంటే ఎందుకు కాదనుకుంటుంది. తన మనసులో ఎవరైనా ఉన్నారేమో' అంటాడు. దీంతో కృష్ణ 'ఒక అమ్మాయి ఎవరినైనా ఇష్టపడితే ఇలా సరోగసికి ఒప్పుకోదు. ఆదర్శ్ అంటే ఇష్టం లేకపోతే చెప్పేయొచ్చు కదా. మనల్ని ఎందుకు అడ్డం పెట్టుకుని ఇలా చేస్తుంది. మన మీద ఎందుకు డామినేట్ చేయాలని చూస్తుంది. మనకి చెప్పకుండా బిడ్డని తీసుకుంది, తీసేసింది. అంతా తన ఇష్ట ప్రకారం చేస్తుందో అర్థం కావడం లేదు' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 21st

మీరా వెనుక అజెండాతోనే:కృష్ణ చెప్పిన దానితో మురారి 'నాకు అదే అనుమానంగా ఉంది. మీరా వెనుక ఏదో తెలియని కోణం ఉంది. నువ్వు అన్నట్టు దీని వెనుక ఏదో అజెండా ఉంది. ఆ అజెండా ఏంటో తెలుసుకోవాలి' అని డిసైడ్ అవుతాడు. తర్వాత పెళ్లి షాపింగ్ జరుగుతుంది. చీరలు తీసుకోకుండా ముకుంద సైలెంట్‌గా ఉంటే నందిని చీర సెలెక్ట్ చేస్తుంది. అది బాగోలేదని ఆదర్శ్ అంటాడు. తర్వాత ఆదర్శ్ స్వయంగా చీర సెలెక్ట్ చేస్తాడు. ముకుంద.. కృష్ణ వైపు చూస్తుంది. అప్పుడామె మనసులో కొంచెం ఓపిక పట్టు నీ అసలు రంగు తెలిస్తే అప్పుడు అంతు తేలుస్తానని అనుకుంటుంది.

మురారిదే కావాలి అంటూ:తర్వాత కృష్ణ సీమంతం, పెళ్లి కోసం రెండు చీరలు సెలెక్ట్ చేయమని అంటారు. అప్పుడు ముకుంద మాత్రం మురారి సెలెక్ట్ చేసిన దానినే తీసుకోవాలని అనుకుంటుంది. అందుకు తగ్గట్లే కృష్ణ కోసం అతడు సెలెక్ట్ చేసిన చీరను లాగేసుకుని తానే తీసుకుంటానని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు ముకుంద 'నీ సీమంతానికి టైమ్ ఉంది కదా అందుకే తీసుకుంటాను' అంటుంది. దీంతో రేవతి పెళ్లి కూతురివి నువ్వు.. నీకు నచ్చింది అన్నావ్ కదా తీసుకో అని చెప్తుంది. దీంతో ఆదర్శ్ మొహం మాడ్చుకుని వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 21st

మురారికే అసలు సందేహం:చీర తీసుకున్న వెంటనే మురారి 'మీరా మనతో ఆడుకుంటుంది. నీకోసం సెలెక్ట్ చేసిన చీర తను తీసుకుందని మురారి కోపంగా అంటాడు. తను లాక్కున్న విధానం చూస్తే చీర మీద ఆశ కంటే నీకు దక్కకూడదన్న ఆలోచనతో తీసుకున్నట్టు అనిపించింది. నాకొక డౌట్ వచ్చింది నన్ను కాపాడటం వల్ల ఇంటికి వచ్చిందని అనిపించడం లేదు. ఇంటికి రావడం కోసమే నన్ను కాపాడిందని అనిపిస్తుంది. అసలు ఆ సమస్యకు తనే కారణమా? తన ప్రతి కదలిక వెనుక ఏదో ఉంది. ఒకప్పుడు ముకుంద ఎలా ప్రవర్తించిందో మీరా కూడా అలాగే ప్రవర్తిస్తుంది. తన టార్గెట్ ఏంటి? నువ్వా లేక నేనా లేక మన బిడ్డనా? లేకపోతే మన కుటుంబమా? అని అనుమానిస్తాడు. ఇలా నేటి ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X