Krishna Mukunda Murari: మురారి బిడ్డ సేఫ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ.. డస్ట్‌బిన్‌లో అసలైన నిజం
అప్పటి కంటే ఇప్పుడు కంటెంట్‌లో తేడాలు వచ్చినా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కింద కూర్చుని భోజనం చేస్తుంటే కృష్ణ కూడా అలాగే చేయబోతుంది. కానీ, భవానీ వద్దంటుంది. అప్పుడు ముకుంద వచ్చి తన పెళ్లిని ఎలా అయినా ఆపాలని, లేకపోతే మొత్తం బయటపెడతానని కృష్ణను బెదిరిస్తుంది. దీంతో కృష్ణ కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు అందరూ కంగారు పడుతుంటే తనకు ఏమీ కాలేదని అంటుంది. అనంతరం ముకుంద తీరుపై మురారికి డౌట్లు వస్తాయి. కావాలనే తను ఇలా చేస్తుందని అనుకుంటాడు. ఇక, ముకుంద తనకు నచ్చింది కాకుండా మురారికి నచ్చిన చీర తీసుకోవడంతో ఆదర్శ్ ఫీల్ అవుతాడు.

మీరా గురించి తెలిసిన నిజం:ఒకప్పుడు ముకుంద ఎలా ప్రవర్తించిందో.. మీరా కూడా అలాగే ప్రవర్తిస్తుందని కృష్ణ అనుమానం వ్యక్తం చేస్తుంది. మురారి మాత్రం అసలు తన టార్గెట్ ఏంటని ఆలోచిస్తాడు. తర్వాత కృష్ణ.. మీరా గదిలోకి వెళ్ళి చెక్ చేస్తుంది. కానీ, ఆమె ఎంత వెతికినా ఏం కనిపించదు. అప్పుడు కృష్ణ 'మీరాలో నాకు ఒక క్రిమినల్ కనిపిస్తుంది. ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది' అనుకుంటుంది. తర్వాత ఆ గదిలో ఉన్న డస్ట్ బిన్ చూస్తే అందులో బేబీ గ్రోత్ ట్యాబ్లెట్స్ పేపర్ ఉంటుంది. అది చూసిన కృష్ణ మీరా గర్భం తీయించుకోలేదు అని నిజం తెలుసుకుంటుంది.
కడుపులో బిడ్డ క్షేమం అంటూ:ఆ ట్యాబ్లెట్లు చూసిన తర్వాత కృష్ణ 'మీరా ఎందుకు ఇలా చేస్తుంది? బిడ్డ ఉన్నందుకు సంతోషించాలా? అబద్ధం చెప్పినందుకు బాధపడాలా' అనుకుంటుంది. తర్వాత వాటిని తీసుకుని కృష్ణ గదికి వచ్చి మోసపోయామని మురారితో 'మీరా గర్భం తీయించుకోలేదు. మనతో అబద్ధం చెప్పింది' అని నిజం మొత్తం చెప్తుంది. అంతేకాదు, మీరా కడుపులో మన బిడ్డ క్షేమంగా ఉంది. మరి ఎందుకు అబద్ధం చెప్తుంది? మన బాధ చూడలేక సరోగసికి ఒప్పుకున్నట్టు చెప్పింది. మన బిడ్డని కడుపులోకి వేసుకున్నాక గర్భం తీయించుకున్నానని అబద్ధం చెప్తుంది' అంటుంది.

ఇలాంటి ఆడదాని కడుపులో:తర్వాత కృష్ణ 'మనకి చెప్పకుండా మన బిడ్డని మోస్తూ ఏం చేయాలని అనుకుంటుంది' అంటుంది. దీంతో మురారి మన బిడ్డను అడ్డం పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తుందో అనుకుంటాడు. తర్వాత ఇలాంటి ఆడదాని కడుపులో మన బిడ్డ పెరుగుతుంది. తన నుంచి మన బిడ్డని ఎలా కాపాడుకోవాలో అని ఇద్దరూ టెన్షన్ పడతారు. తర్వాత కృష్ణ 'మీరా గర్భం ఉంచుకుందని తన నోటితో తనే చెప్పేలా చేయాలి' అని డిసైడ్ అవుతుంది. అందుకోసం ఆమెను మరోసారి కలవాలని అనుకుంటుంది.
ముకుందను ఇరికించింది:ఆదర్శ్ పెళ్లి ఎక్కడ చేయాలని భవానీ దేవి ఆలోచిస్తుండగా కృష్ణ వస్తుంది. అప్పుడామెను పెళ్లి ఎక్కడ చేద్దామని అడుగుతుంది. అప్పుడు ముకుంద కూడా పక్కనే ఉండడంతో ఆమెను ఇరికించాలని అనుకుని 'వాళ్ళు ఎంతో ఇష్టపడి చేసుకుంటున్నారు.. వాళ్ళనే అడగండి' అని ముకుందను పిలుస్తుంది. అంతేకాదు, 'పెళ్లి ఎక్కడ చేసుకోవాలనే ఫాంటసీ ఏమైనా ఉందా చెప్పు? అయినా పెళ్లిది ఏముంది ఎక్కడ చేసుకుంటున్నామని కాదు ఎవరిని చేసుకుంటామనేది ముఖ్యం కాదా' అని అంటుంది. తర్వాత మీరాను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

వేరే ప్లాన్ ఏదో ఉంది అని:కృష్ణ మాటలతో మీరా 'పెళ్లి ఎక్కడ చేయాలో మీరు డిసైడ్ చేస్తే బాగుంటుంది' అని వెళ్ళిపోతుంది. దీంతో మురారి 'ఎందుకు మీరాని రెచ్చగొడుతున్నావు? తిక్కలేస్తే నీకు గర్భం లేదని చెప్పేస్తుందేమో' అంటాడు. దీంతో కృష్ణ 'తను చెప్పదు.. నిజం బయట పెట్టి మనల్ని బుక్ చేయాలని అనుకుంటే ఎప్పుడో చెప్పేది. వేరే ప్లాన్ ఏదో ఉంది. అందుకే ఇలా నాటకం ఆడుతుంది' అని చెప్తుంది. పెళ్ళికి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రాయమని భవానీ.. ముకుందను పిలుస్తుంది. అప్పుడే కృష్ణ, మురారి వచ్చి ఆస్పత్రికి వెళ్తున్నాం అని చెబుతారు.
అబద్దం చెప్పి తీసుకొచ్చి:తర్వాత మీరాను కూడా తమతో పాటు రమ్మని కృష్ణ పిలుస్తుంది. చిన్న షాపింగ్ ఉంది అందుకే తీసుకెళ్తాం అని అంటుంది. కానీ, అప్పుడే ఆదర్శ్ వచ్చి 'మనం వెళ్దామని అనుకున్నాం కదా' అంటాడు. దీంతో అతడిని అందరూ ఆట పట్టిస్తారు. అనంతరం కృష్ణ.. మీరాను తీసుకుని రెస్టారెంట్‌కు తీసుకొస్తుంది. దీంతో ముకుంద 'ఏమైంది ఇక్కడకి తీసుకొచ్చావు? నువ్వు ఏదో మాట్లాడటానికే ఇక్కడికి రమ్మన్నావ్.. కానీ షాపింగ్ అని అబద్ధం చెప్పావ్ కదా' అంటుంది. దీనికామె 'నాకోసం ఆలోచించి గర్భం తీయించుకున్నానని అన్నావ్ కదా' అంటుంది.

సరోగసికి వెళ్తున్నామని:కృష్ణ మాటకు ముకుంద 'అవును.. లేకపోతే బిడ్డను నా కడుపులో పెట్టుకున్న దాన్ని తొమ్మిది నెలలు మోసి నీ చేతిలో పెట్టడానికి నాకేంటి ప్రాబ్లం? కానీ మీ బిడ్డని ఇవ్వకపోతున్నందుకు చాలా బాధగా ఉంది' అంటుంది. దీంతో కృష్ణ 'మరీ అంత బాధపడకు. ఎందుకంటే మా బిడ్డ ఎక్కడికీ పోలేదు' అనగానే.. నేను గర్భం తీయించుకోలేదని తెలిసిపోయిందా ఏంటని టెన్షన్ పడుతుంది. అప్పుడు కృష్ణ 'మేము మళ్ళీ సరోగసికి వెళ్దామని డిసైడ్ అయ్యాం' అని చెప్తుంది. దీంతో ముకుంద 'వీళ్ళు ఇంకెవరితోనో బిడ్డని కంటే నా ఆటలు ఎలా సాగుతాయి' అనుకుంటుంది. తర్వాత కృష్ణ 'సరోగసికి వెళ్తున్నాం కదా అందుకే మా బిడ్డ ఎక్కడికి పోలేదని అంటున్నా. ఇంకేమైనా చెప్పాలా' అని అడుగుతూ చెంపపై కొడుతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











