Krishna Mukunda Murari: మీరానే ముకుంద అని తెలిసిన నిజం.. నేటి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్

ఈ మధ్య కాలంలో కొత్త కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మీరా మీద డౌట్లు రావడంతో కృష్ణ ఆమె రూమ్‌లోకి వెళ్లి వెతుకుతుంది. అప్పుడామెకు కడుపులో బిడ్డ ఎదుగుదల కోసం వాడే ట్యాబ్లెట్లు కనిపిస్తాయి. దీంతో అసలు తను అబార్షన్ చేయించుకోలేదని నిజం తెలుస్తుంది. ఆ విషయం మురారికి చెప్పడంతో అతడికి ఎన్నో సందేహాలు వస్తాయి. తర్వాత మీరాను కృష్ణ షాపింగ్‌కు వెళ్దాం అని రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంది. అక్కడ ఆమెతో నిజం చెప్పించాలని తాము మరోసారి సరోగసికి వెళ్తున్నామని అబద్ధం చెప్తుంది. అయినా మీరా నోరు మెదపకపోవడంతో లాగి పెట్టి చెంప మీద ఒకటి ఇచ్చేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 23rd

చెంప పగలగొట్టేసిన కృష్ణ:మీరాను రెస్టారెంట్‌కు తీసుకు వచ్చిన కృష్ణ సరోగసి ద్వారా మళ్లీ బిడ్డను కనాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. దీంతో ఆమె టెన్షన్ పడుతోంది. అంతేకాదు, 'సరోగసి చేయించుకోవడం వల్ల కదా ఇంట్లో చెప్పకుండా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజులు ఆగిన తర్వాత చేయవచ్చు కదా' అని అంటుంది. దీనికి కృష్ణ 'ఇప్పుడు కూడా ఇంట్లో చెప్పి చేయాలనే అనుకుంటున్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకేమైనా ఉంటే చెప్పు' అని అడుగుతుంది. అలా పదే పదే అడిగినా మీరా ఏం లేదని అంటుంది. దీంతో కృష్ణ లాగిపెట్టి మీరా చెంప పగలగొడుతుంది.

అసలు ఎవరు నువ్వు?:తర్వాత కృష్ణ కోపంగా 'నా బిడ్డని నీ కడుపులోనే ఉంచుకుని తీయించేశానని అబద్ధం చెప్పావు. ఎందుకు మాతో అబద్ధం చెప్పావు? బిడ్డను నీ కడుపులోనే పెట్టుకుని ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నీ లాంటి దుష్టురాలి కడుపులో నా బిడ్డ పెరుగుతున్నా.. పెరుగుతుంది నా బిడ్డ కాబట్టి వదిలేస్తున్నా. ఎందుకు అబద్దం ఆడావు? ఎందుకు ఆదర్శ్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? నీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు వాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? నా కుటుంబానికి నీకు సంబంధమేంటి' అని ప్రశ్నిస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 23rd

నేనే ముకుందనంటూ:కృష్ణ సీరియస్‌గా అడగడంతో మీరా 'దాహంగా ఉంది వాటర్ తీసుకురా. నాకోసం కాదు నా కడుపులో ఉన్న నీ బిడ్డ కోసం. నీకు ఎవరి పేరు వింటే కోపం చిరాకు పుట్టుకు వస్తాయో.. ఎవరిని చూస్తే తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంటుందో ముకుంద.. ఆ ముకుందని నేనే' అని నిజం చెప్పేస్తుంది. దీనికామె 'ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ముకుంద ఏంటి' అని ప్రశ్నిస్తుంది. దీంతో మీరా 'నిజం చెప్పమంటావు చెప్తే నమ్మవు. నేను మీరా కాదు ముకుంద. ముకుందలా ఉండి మురారిని గెలవలేనని అర్థమైంది. అందుకే చనిపోయానని అందరినీ నమ్మించి మారాను' అంటుంది.

మురారిని చూసే ఇలా:ఆ తర్వాత మీరా 'మురారిని చూసి నాకు ఈ ఐడియా వచ్చింది. తను రూపం మార్చుకున్నాడు. తనను పొందటం కోసం నేను రూపం మార్చుకుంటే తప్పు ఏంటి? పైగా ఆ రూపం నాకు కలిసి రాలేదు. వేరే రూపంతో ట్రై చేద్దామని ఈ రూపానికి వచ్చాను. ఈ రూపం నాకు బాగా వర్కౌట్ అయింది. ఒకప్పుడు మురారిని తాకడానికి ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మురారి బిడ్డని కడుపులో పెట్టుకుని మిమ్మల్ని శాసించే స్థాయికి వచ్చాను. నిన్ను జైలుకు పంపించే పని మా నాన్నకి చెప్తే మా నాన్న మురారిని జైలుకు పంపించాడు' అంటూ నిజాలను చెప్పేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 23rd

నీ గర్భం పోగొట్టానని:మీరా 'మురారిని విడిపించుకుని అత్తయ్య దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి మళ్ళీ మన ఇంట్లోకి అడుగుపెట్టాను. నువ్వు పిల్లల్ని కంటే మురారి నాకు దక్కడని నీ గర్భసంచిని పోగొట్టి సరోగసి ఐడియా నేనే ఇచ్చాను. తర్వాత నేనే సరోగసి మథర్ అయి సక్సెస్ ఫుల్‌గా బిడ్డను నా కడుపులో పెట్టుకుని ఇలా నీ ముందు నిలబడ్డాను. ఇదంతా నిజం కృష్ణ. అయినా నమ్మకపోతే నా కడుపులో ఉన్న నీ బిడ్డ మీద ఒట్టు' అంటుంది. దీంతో కృష్ణ ముకుంద అని గట్టిగా అరుస్తుంది. అంతేకాదు, ఎంతకు తెగించావే నువ్వు అసలు మనిషివేనా అనగా.. మురారి కోసం ఎంతకైనా తెగిస్తాను అంటుంది.

మీరా బ్లాక్‌మెయిల్‌తో:అనంతరం మీరా 'నేనే ముకుంద అని తెలిసిపోయింది కాబట్టి ఈ విషయం ఎవరితో అయినా చెప్పి నన్ను ఏదో చేయాలని ఆలోచిస్తున్నావ్ ఏమో.. పొరపాటున ఈ విషయం ఎవరితో అయినా చెప్తే బిడ్డను తీయించేసుకుని నీకు గర్భం రాదని నీకు జీవితాంతం బిడ్డలు పుట్టరని గొడ్రాలిగా ఉంటావని భవానీ అత్తయ్యకు చెప్తాను. ఇంట్లో నుంచి బయటకు పంపించి మురారిని నా వాడిని చేసుకుంటాను' అంటుంది. దీంతో ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని కృష్ణ అడుగుతుంది. దీంతో 'మురారి కావాలి నువ్వు ఇచ్చే వరకు నేను తీసుకునే వరకు ఇలాగే జరుగుతుంది' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 23rd

జాగ్రత్తగా చూసుకుందాం:ముకుంద ఇచ్చిన షాక్‌తో మైండ్ బ్లాక్ అయిన కృష్ణ ధీనంగా ఇంటికి వస్తుంది. అప్పుడే మురారి ఆమె దగ్గరకు వస్తాడు. కానీ, అతడికి మీరానే ముకుంద అన్న నిజం చెప్పకుండా దాస్తుంది. అప్పుడు మురారి ఇకపై మీరాను జాగ్రత్తగా చూసుకుందాం అంటాడు. దీనికామె సరే అంటుంది. అనంతరం తాను తన బాబాయి ఇంటికి వెళ్తానని అడుగుతుంది. దీంతో ఓకే అంటాడు. తర్వాత ఈ విషయం చెప్పేందుకు భవానీ దగ్గరకు వెళ్లగా ఆమె కూడా ఒప్పుకుంటుంది. దీంతో కృష్ణ అత్తను మోసం చేస్తున్నందుకు బాగా బాధపడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X