Krishna Mukunda Murari: ప్రభాకర్‌కు తెలిసిన నిజం.. అందరికీ చెప్పేసిన డాక్టర్.. మురారిపై ఆదర్శ్ డౌట్
ఇండియాలోని అన్ని భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కృష్ణ తన పుట్టింటికి వెళ్తుంది. ఆమెను చూసి బాబాయి గొడవలు ఏమైనా పెట్టుకుని వచ్చావా అని అడుగుతుంది. కానీ, వాళ్లకు అబద్దాలు చెప్తుంది. తర్వాత కృష్ణ తన పుట్టింటికి వెళ్లిందని ఇంట్లో వాళ్లు మాట్లాడుతుంటే ముకుంద విని సంతోష పడుతుంది. అనంతరం ముకుంద, ఆదర్శ్ పెళ్లి సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించేందుకు ఫొటోగ్రాఫర్‌ను మధు తీసుకు వస్తాడు. అది చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అవగా.. ఆదర్శ్ మాత్రం సంతోషిస్తాడు. తర్వాత తన ఇంట్లో ఉన్నా కృష్ణ తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ముకుంద నుంచి ఎలా కాపాడుకోవాలని అనుకుంటుంది.
ఆ తర్వాత కృష్ణకు భవానీ దేవి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు ప్రభాకర్ ఫోన్ తీసుకుని ఆమెతో మాట్లాడతాడు. ఆ సమయంలోనే భవానీ దేవి.. కృష్ణ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అతడికి చెప్తుంది. దీంతో ప్రభాకర్ ఫుల్ ఖుషీ అవుతాడు. అనంతరం తమకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు కృష్ణ ఏదేదో చెప్పి కవర్ చేస్తుంది. ఇక, ఫొటోషూట్ జరుగుతున్న సమయంలో ముకుంద యాక్టింగ్ చూసి మురారికి కోపం వస్తుంది. ఇష్టం లేకున్నా ఎందుకు ఇలా నటిస్తుందని అనుకుంటాడు.
ఫొటోషూట్ జరుగుతున్నప్పుడు మురారిని చూస్తూ ముకుంద 'కృష్ణ పుట్టింటికి వెళ్లావా? నిన్ను శాశ్వతంగా అక్కడే ఉంచేస్తాను' అని అంటుంది. ఆ వెంటనే కళ్లు తిరిగి పడిపోతుంది. మరోవైపు, కృష్ణ తల్లి కాబోతుందని శకుంతల ఊరిలో ఉన్న కొందరు ఆడవాళ్లను తీసుకుని వస్తుంది. వాళ్లంతా కృష్ణకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు పిన్ని, బాబాయి ఎంత సంతోషంగా ఉన్నారో వివరిస్తారు. దీంతో కృష్ణకు సంతోషంతో పాటు భయం కూడా కలుగుతుంది.
అనంతరం కళ్లు తిరిగి పడిపోయిన ముకుందను డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. అన్నీ చూసిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెబుతుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. భవానీ మాత్రం తనకు ఈ డౌట్ ముందే వచ్చిందని అంటుంది. ఆ సమయంలో ముకుంద 'నేను ఇదే కావాలనుకున్నాను' అంటూ అనుకుంటుంది. ఇక, ఆదర్శ్ మాత్రం మురారి మీద డౌట్ పడతాడు. అతడు ముకుంద విషయంలో చేసిన వాటిని గుర్తు చేసుకుని కోపంగా వెళ్లిపోతాడు. తర్వాత రజినీ వెటకారంగా మాట్లాడుతుంది. ఇలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తైంది.
శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
మగపిల్లలు ఉన్న ఇంట్లో పెళ్లి కాని అమ్మాయిని పెట్టుకోవడం తప్పు అని రజినీ అంటుంది. దీంతో భవానీకి కోపం వచ్చి ఆదర్శ్ చెంప చెల్లుమణిపిస్తుంది. అంతేకాదు, పెళ్లికి ఒప్పుకున్నా కూడా ఎందుకు తొందరపడి ముకుందను ప్రెగ్నెంట్ చేశావని ప్రశ్నిస్తుంది. దీంతో ఆదర్శ్ 'మీరా తల్లి కావడానికి కారణం నేనే అనుకుంటున్నావ్ కదా. కాదు కానే కాదు. ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు. ముకుంద చనిపోయాక ఇక ఎవరి కోసం బతకాలి ఆనుకున్నా అప్పుడే మీరా వచ్చింది. తన మాట ప్రవర్తన ఎందుకో ముకుందలా అనిపించింది' అని చెబుతాడు.
ఆ తర్వాత ఆదర్శ్ 'అందుకే తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఆ విషయం నీకు చెప్పాను. నీకు ఇష్టమని తెలిశాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నేను ఎప్పుడు హద్దు దాటలేదు. తన మనసులో వేరొకరు ఉన్నారని తెలిసినా, తను తల్లి కాబోతుందని తెలిసినా తన వైపు చూసేదాన్ని కాదు. అసలు తను ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. నేనంటే ఇష్టం ఉన్నట్టే ఉంది పెళ్లి అంటే సరే అంది కానీ ఇంతలోనే ఇలా అవుతుంది. నా తలరాత ఇంతేనేమో. నేను కోరుకున్నది నాకు దక్కదేమో. నేను నీ కొడుకుని ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయను' అంటాడు.
అనంతరం భవానీ వచ్చి మీరాను ప్రెగ్నెంట్ చేసింది ఆదర్శ్ కాదని చెప్తుంది. దీంతో అందరూ మీరా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని అనుకుంటారు. అంతలోనే ముకుందకు స్పృహ రావడంతో ఆమెను ప్రశ్నిస్తారు. పైగా కడుపు చేసిన వాడిని తిడతారు. అప్పుడు మీరా తన కడుపులో బిడ్డకు తండ్రి మురారి అన్న నిజం చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత అతడి గురించి వెతకగా కనిపించకుండా వెళ్లిపోతాడు. మరోవైపు, కృష్ణ తల్లి కాబోతుందని తన బాబాయి, పిన్ని సంతోషంగా ఉంటారు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











