Krishna Mukunda Murari: ఉన్నట్లుండి మురారి మిస్సింగ్.. డీఎన్ఏ టెస్టుకు రెడీ.. కథలో ఊహించని ట్విస్ట్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న భవానీ కోపం వచ్చి ఆదర్శ్ చెంప చెల్లుమణిపిస్తుంది. అంతేకాదు, ఎందుకు తొందరపడి ప్రెగ్నెంట్ చేశావని ప్రశ్నిస్తుంది. దీంతో ఆదర్శ్ తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి కడుపు రావడానికి కారణం ఎవరని ముకుందను ప్రశ్నించగా.. ఆమె మురారి అని అబద్దం చెప్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. అంతేకాదు, ఆదర్శ్ అయితే అది నిజమే అని నమ్మేసి మురారిని అపార్థం చేసుకుంటాడు. తర్వాత మురారి ఇంట్లో కనిపించకపోవడంతో నిజమే అని నమ్ముతారు.

Krishna Mukunda Murari Serial Today Episode May 27th

మురారిదే తప్పు అనుకుని:మీరా గురించి తెలిసిన తర్వాత ఆదర్శ్.. మురారిని అపార్థం చేసుకుని నోటికొచ్చినట్లు తిడతాడు. దీంతో రేవతి 'వాడు ఎదుటివాళ్ళ జీవితాలతో ఎప్పుడు ఆదుకోవాలని మురారి అనుకోలేదు. నువ్వు ముకుందని ఇష్టపడుతున్నావని తెలిసి తన ప్రేమని త్యాగం చేశాడు' అని చెప్తుంది. భవానీ కూడా ఆదర్శ్‌ను తిడుతుంది. దీంతో ఆదర్శ్ 'వాడు అంటే నాకు ఇష్టమే కానీ.. పరిస్థితులను బట్టి ఇంతకంటే గొప్పగా మాట్లాడలేకపోతున్నాను. ప్రతిసారి నా గుండెల్లో మంటలు రేపేది వాడే' అంటాడు. తర్వాత మురారికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో ఇంకా తిడతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 27th

అబద్దాలు చెప్పనంటూనే:ఆదర్శ్ మాటలకు భవానీ 'నిన్ను పెంచినట్టే వాడిని పెంచాను. మురారి ఏ తప్పు చేయడు. వాడికి ఆ అవసరం లేదు' అంటుంది. అంటే ఏంటి మీరా తప్పు చేసిందా అని రజిని నోరు జారుతుంది. మురారి తప్పు చేయలేదని అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా అంటుంది. అప్పుడు రజినీ 'నువ్వు తల్లి కావడానికి కారణం ఎవరు' అని మరోసారి అడుగుతుంది. దీనికి మీరా 'ఒక్కోసారి ఒక్కో పేరు చెప్పే అలవాటు నాకు లేదు' అనడంతో మధు 'మరి ఇన్నాళ్ళూ ఎందుకు అబద్ధాలు చెప్పావు? నువ్వు తల్లివి కావడానికి మురారి కారణం అయితే అది చెప్పకుండా ఆదర్శ్ తో పెళ్ళికి ఎందుకు రెడీ అయ్యావు' అని నిలదీస్తాడు. తర్వాత భవానీ కూడా నువ్వు చెప్పేది నిజం అయితే ఆదర్శ్‌తో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని ప్రశ్నిస్తుంది.

ఇద్దరికీ లైన్ వేసిందంటూ:భవానీ మాటలకు మీరా అది మురారి వచ్చాక అడగండి అని చెప్తుంది. అప్పుడు రజినీ 'ఇంటికి రాగానే ఇద్దరికీ లైన్ వేసింది. ఎవరు పడితే వాళ్ళతో ఇంటికి కోడలు అవుదామని అనుకుంది. కానీ ఇంతలోనే మురారితో ఇలా జరిగిపోయింది' అని అంటుంది. దీంతో సంగీత 'మురారి బావకు బంగారం లాంటి కృష్ణ అక్క ఉంది. ఈ మీరా అబద్ధాలు చెప్తుంది' అని అంటుంది. దీంతో మీరా 'నా మాట మీద నమ్మకం లేకపోతే మురారి వచ్చాక అడగండి' అంటుంది. దీంతో సంగీత 'అవసరం లేదు. నాకు ఆదర్శ్ బావకు పెళ్లి చేస్తానని నువ్వే రెడీ అయ్యావు' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 27th

డీఎన్ఏ టెస్ట్‌కు రెడీగానే:తర్వాత అనాథనంటూ యాక్టింగ్ చేసిన మీరా 'మీరు చెప్పిన దానికి అనుమానం ఉంటే మురారి వచ్చేవరకు ఓపిక పట్టండి. ఒకవేళ మురారికి ఏ సంబంధం లేదని చెప్తే.. తను అబద్ధం చెప్పినా చెప్తాడు. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించండి. అప్పుడు నా బిడ్డకు మురారి తండ్రి అని తేలుతుంది' అని చెప్తుంది. దీంతో నందినీ ఒకవేళ కాదని తేలితే అనడంతో మీరా 'ఈ ఇంటి గుమ్మానికి ఉరి వేయండి. నేను ఎక్కడికి పారిపోను' అని కోపంగా వెళ్ళిపోతుంది. అందరూ దిగులుగా కూర్చుని ఉంటారు. తన కొడుకు అలాంటి వాడు కాదని రేవతి ఏడుస్తుంది.

ఏదో కుట్ర జరుగుతుంది:మురారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదని భవానీ అంటుంది. అప్పుడు రేవతి 'నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది కానీ మురారి లేకపోవడం వల్ల మీరా ఎన్ని మాటలు అన్నా సమాధానం చెప్పలేకపోతున్నాం. పైగా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్తుంది. ఒకవేళ మురారి తప్పు చేశాడా? అందుకే డీఎన్ఏ టెస్ట్ అంటుందా. ఏదో కుట్ర జరుగుతుంది. నా కొడుకు తప్పించుకుని పారిపోయే వాడు కాదు' అని అనుమానపడుతుంది. అప్పుడు భవానీ 'మన అదృష్టం బాగుండి కృష్ణ ఇంట్లో లేదు. లేకపోతే తట్టుకునేది కాదు' అని అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 27th

కృష్ణ దగ్గరకు భవానీ వెళ్లి:మురారి గురించి కృష్ణ దగ్గర ఎంక్వైరీ చేసేందుకు భవానీ వెళ్తుంది. అప్పుడు ఆమె కంగారు పడుతూ 'ఏసీపీ సర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది' అని అడుగుతుంది. దీంతో భవానీ 'ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్లాడు. పనిలో పడి అంతా మర్చిపోయాడు' అని అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. తర్వాత 'మురారి ఇంట్లో లేడని తెలిస్తే ఏమౌవుతుంది? తనని వెతుక్కుంటూ వచ్చానని తెలిస్తే కంగారుపడుతుంది' అని అనుకుంటుంది. తర్వాత ఊరిలో జాతర ఉందని చెప్పి భవానీ వాళ్లను ఎక్కడికి వెళ్లకుండా ప్రభాకర్ ఆపేస్తాడు. అనంతరం ముకుంద బిడ్డను అడ్డం పెట్టుకుని ఇంట్లో వాళ్లతో పని చేయించుకోవాలని అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.''''

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X