Krishna Mukunda Murari: మీరాను కాల్చిన ఆదర్శ్.. మురారిని ఆమె కిడ్నాప్ చేసిందా? రంజుగా నేటి ఎపిసోడ్
సుదీర్ఘ కాలం నుంచే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారి ఇంట్లో కనిపించకపోవడంతో అతడు నిజంగానే తప్పు చేశాడని ఆదర్శ్ అనుకుంటాడు. అంతేకాదు, నోటికి వచ్చినట్లు తిడతాడు. అప్పుడు ఆడవాళ్లంతా మురారికి సపోర్ట్ చేస్తారు. ఆ సమయంలో రజినీ.. ముకుందను అనుమానిస్తుంది. దీంతో ఆమె అబద్దాల మీద అబద్దాలు చెప్తుంది. అంతేకాదు, అవసరం అయితే డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుంటానని అంటుంది. అనంతరం భవానీ దేవి.. కృష్ణ దగ్గరకు వెళ్తుంది. ఆమె మురారి గురించి అడిగితే అబద్దం చెబుతుంది. ఇక, ముకుంద తన కడుపును అడ్డం పెట్టుకుని పని చేయించుకోవాలని ప్లాన్ చేస్తుంది.

మీ అన్నయ్య ఒప్పుకునేవాడు:ఆదర్శ్ అన్నం తినకుండా వెళ్లిపోవడంతో రేవతి 'ఇంటికి పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ఏంటో' అంటుంది. దీంతో ముకుంద 'మీరు నన్నే కదా అంటుంది. నేను మీ వారసుడిని మోస్తున్నాను' అంటుంది. దీంతో రజినీ నీ బిడ్డకు తండ్రి మురారి అంటే ఎవరూ నమ్మరు అంటుంది. దీంతో ముకుంద 'అందుకే కదా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్తుంది. మీ అన్నయ్య ఉండి ఉంటే నా బిడ్డకు తండ్రి తనేనని ఒప్పుకునే వాడు. బిడ్డని మోస్తున్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటానని చెప్పి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు' అంటూ మాట్లాడుతుంది.
మళ్లీ ఇద్దరం కలిసి వస్తామని:గుడిలో జరిగే జాతరకు వెళ్లేందుకు రెడీ అవమని శకుంతల అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన చీరను ఇస్తుంది. అప్పుడు ప్రభాకర్.. అల్లుడు కూడా వచ్చి ఉంటే బాగుండేదని అంటాడు. దీంతో కృష్ణ 'ఆయన ఏదో పని మీద వెళ్లారు కదా. నేను పెద్దత్తయ్యతో ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇద్దరం కలిసి వస్తాం' అని చెప్తుంది. దీంతో భవానీ 'కృష్ణ ఇంటికి వస్తే మురారి లేడనే విషయం తెలుస్తుంది. బాబోయ్ నిజం తెలిస్తే ప్రాణాలు వదిలేస్తుంది. ఇంటి దగ్గర జరిగిన విషయాలు తింగరి దానికి తెలియకూడదు' దేవుడిని వేడుకుంటుంది.

గన్ తీసుకు వచ్చిన ఆదర్శ్:మందు తాగుతూ ముకుంద మాటలు గుర్తు చేసుకున్న ఆరద్శ్.. గన్ తీసుకుని కోపంగా వస్తాడు. వచ్చీ రావడమే ఆమె తలకు గురి పెడతాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆదర్శ్‌ను అడ్డుకుంటారు. అప్పుడతను 'దీని లాంటి మోసగత్తెకి ఇదే నేను విధించే శిక్ష' అని కాల్చబోతాడు. దీంతో గన్ గాల్లో పేలుతుంది. తర్వాత రేవతి ఆదర్శ్ చెంప పగలగొడుతుంది. అంతలో నందినీ 'ఇంత మూర్ఖంగా ఎందుకు చేస్తున్నావు? తను ఒట్టి మనిషి కాదని మర్చిపోయావా' అని గుర్తు చేస్తుంది. దీనికతడు 'నన్ను కూడా మనిషిని కాకుండా చేసింది' అంటాడు.
జరిగిన దానికి ఇదే కారణం:తర్వాత ఆదర్శ్ నన్ను ఇంతగా మోసం చేసిన ఆడదాన్ని నేను ఎక్కడ చూడలేదు అంటాడు. దీంతో రేవతి 'మీరా చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించే వరకు మౌనంగా ఉండాలి' అని అంటుంది. అప్పుడతడు 'నువ్వు చేసిన మోసానికి చంపేయాలి కానీ చూడు నీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో. ఇంట్లో జరిగిన వాటికి ఇదే కారణం. ఒకవేళ మురారి వల్లే తల్లి అయితే వాళ్ళు వాళ్ళు ఏడవొచ్చు కదా. నా జీవితంతో ఎందుకు ఆడుకుంది. నాతో పెళ్లి అంటే ఒప్పుకుంది. ఇలాగే మురారిని కూడా మాయ చేసుంటుంది. అసలు మురారి మిస్సింగ్‌కు కారణం ఇదేనేమో' అంటాడు.

మీరా చెప్పిందే నిజమేమో:అనంతరం ఆదర్శ్ 'ఏమో కాదు ఇదే నిజం. మురారి కనిపించకపోవడానికి కారణం ఇదే. అందుకే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని గట్టిగా చెప్తుంది. చెప్పవే మురారిని ఏం చేశావు' అని గన్ పట్టుకుని చంపబోతుంటే మధు అడ్డుకుంటాడు. తర్వాత రేవతి 'వాడు తాగిన మత్తులో మాట్లాడుతున్నాడు. పొరపాటున వాడు చెప్పింది నిజమయితే ఆదర్శ్ మాత్రమే కాదు.. ఈ ఇంట్లో ఎవరూ నిన్ను బతకనివ్వరు' అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత కృష్ణ, భవానీ గుడికి వెళతారు. కృష్ణతో ముడుపు కట్టించమని ప్రభాకర్ చెప్తాడు. అంతలో అందరూ కృష్ణ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతారు.

మీరా చెప్పిందే నిజమా?:అందరూ కృష్ణ గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండగా.. ఆమె మాత్రం ముడుపు కడుతూ ముకుంద మాటలు తలుచుకుని కళ్ళు తిరిగిపడిపోతుంది. దీంతో ప్రభాకర్ 'పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలి కదా' అని శకుంతల మీద అరుస్తాడు. అనంతరం రేవతి ఫోన్ చేసి భవానీతో మాట్లాడుతుంది. మురారి అక్కడ ఉన్నాడా అంటే లేడని అంటుంది. వాడు కనిపించకపోవడం చూస్తుంటే మీరా చెప్పింది నిజమని అనిపిస్తుంది అని చెప్తుంది.

అంత పాపం ఏం చేశాను:తర్వాత కృష్ణ 'నాకు వంద జన్మలకు సరిపడా కష్టాలు ఇచ్చావు. అంత పాపం నేను ఏం చేశాను? అమ్మను కావాలని కోరిక కోరాను. అది నెరవేరనివ్వలేదు. నా బిడ్డను నన్ను శత్రువులా చూసే ముకుంద గర్భంలో పెరిగేలా చేశావు. నిజం చెప్పలేక కన్నబిడ్డల్లా చూసే ఇద్దరు అమ్మలను మోసం చేస్తున్నాను. మా చిన్నాన్న చిన్నమ్మను మోసం చేస్తున్నా. లేని గర్భాన్ని ఉన్నట్టు నటించడం ఎంత నరకమో. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు' అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











