Krishna Mukunda Murari: జాతరలో కృష్ణకు అపశృతి.. మీరాతో మురారి జంప్.. ప్రభాకర్‌కు డౌట్ రావడంతో!

తరాలు మారుతున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode May 29th

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీరా మీద అందరూ అనుమానంగా మాట్లాడుతుండడంతో ఆమె ఎదురు తిరుగుతుంది. అంతేకాదు, మురారిని దోషిని చేసి మాట్లాడుతుంది. అప్పుడు ఆదర్శ్ మందు తాగి కోపంగా గన్ తీసుకుని వస్తాడు. ఆమెను చంపడానికి కాలుస్తాడు. కానీ, అంతలోనే అందరూ అడ్డుకోవడంతో ఆమె తప్పించుకుంటుంది. తర్వాత ప్రభాకర్ ఇంటికి వెళ్లిన భవానీ వాళ్లు బ్రతిమాలడంతో అక్కడే ఉండిపోతుంది. అక్కడ జరిగే జాతర కోసం రెడీ అవుతుండగా కృష్ణ కళ్లు తిరిగిపడిపోతుంది. దీంతో మురారి గురించిన నిజం అతడికి చెప్పకూడదని భవానీ డిసైడ్ అయిపోతుంది.

మురారి గురించి కృష్ణ టెన్షన్

ఇంట్లో జరుగుతున్న ఘటనలతో బాధలో ఉన్న కృష్ణ.. జాతరలో దేవుడికి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ సమయంలో ఆమె కోసం ప్రభాకర్ గుడి మొత్తం వెతుకుతాడు. అప్పుడు కృష్ణ 'ఏసీపీ సర్ ఫోన్ ఎందుకు ఆఫ్ అయింది? ఆయనకు ఏమైంది? పెద్దత్తయ్య నాతో ఆ విషయం చెప్పలేకపోతుందా? ముకుంద నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుంది? చిక్కుల నుంచి ఎప్పుడు బయట పడతాము' అని టెన్షన్ పడుతుంది. అంతలోనే ప్రభాకర్.. కృష్ణ దగ్గరకు వస్తాడు. అంతేకాదు, గుడిలో పల్లకి సేవ ఉంటుందని, దాన్ని భవానీ, కృష్ణ మోయాలని చెప్తాడు.

పల్లకి సేవలో కృష్ణ, భవానీలు
తర్వాత శకుంతల 'మీరిద్దరిదీ కల్లాకపటం లేని మనసు. అందుకే ఈ పని చేస్తే అంతా మంచే జరుగుతుంది. కిట్టయ్యకు పండంటి బిడ్డ పుడుతుంది' అంటుంది. అనంతరం గుడిలో పల్లకి సేవ మొదలవుతుంది. అప్పుడు పంతులు 'పల్లకిని ఎత్తుకుని మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి' అని చెప్తాడు. ఆ సమయంలో భవానీ ఏమో నిజాలు దాస్తున్నామని, కృష్ణ ఏమో అబద్ధపు గర్భం నాటకం ఆడుతున్నానని తమలో తాము బాధపడతారు. అప్పుడు భవానీ 'మురారి ఏ తప్పు చేయలేదని మనసు చెప్తుంది' అనుకుంటుంది.

కనిపించకుండా వెళ్లిన మీరా

రేవతి.. మీరా కోసం పాలు తీసుకుని గదికి వస్తుంది. కానీ ఆమె మాత్రం గదిలో కనిపించదు. రజిని ఎదురుపడితే మీరాను చూశావా అని అడుగుతుంది. అప్పుడామె 'తన కడుపులో ఉన్న బిడ్డకు నీ కొడుకే తండ్రి అని నమ్ముతున్నావా' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. తర్వాత రేవతి ఇంట్లో అందరినీ అడుగుతుంది. ఎవరూ మీరాని చూడలేదని చెప్తారు. తర్వాత అంతా వెతికి మీరా ఎక్కడ కనిపించలేదని మధు, సంగీత చెప్పడంతో రేవతి చాలా కంగారుపడుతుంది. నుదుటి మీద గన్ పెట్టేసరికి ప్రాణభయంతో పారిపోయిందని రజిని అంటుంది.

కృష్ణ పల్లకి సేవలో అపశృతి
అనంతరం భవానీ 'మురారి ఏ తప్పు చేయకపోతే ఎక్కడికి వెళ్ళాడు? నిజం కనీసం నా కోడలికి కూడా చెప్పలేకపోతున్నాను' అని బాధపడుతుంది. అంతలోనే పల్లకిలో ఉన్న అమ్మవారి విగ్రహం పక్కకి తూలుతుంది. అప్పుడు పంతులు 'పల్లకి మోసే వాళ్ళు ఏ కల్మషం లేకుండా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో మనసులో ఏదో పెట్టుకుని పైకి నటిస్తున్నారు. అందుకే అమ్మవారు ఈరోజు పల్లకి సేవ పూర్తికానివ్వలేదు' అని చెప్తాడు. అప్పుడు కృష్ణ 'లోపల ఒకటి పైకి ఒకటి పెట్టుకుంది నేనే కదా. గర్భవతి కాకపోయినా గర్భవతిని అని చెప్తున్నా నా వల్లే ఇలా జరిగింది' అని బాధపడుతుంది. భవానీ కూడా 'మురారి గురించి చెప్పలేదని అందుకే ఇలా జరిగింది' అనుకుంటుంది.

మురారి, మీరా వెళ్లిపోయారా

మీరా గురించి అందరూ టెన్షన్ పడుతుండగా మధు 'తను అలా పారిపోయే రకం కాదు' అంటాడు. అప్పుడు రేవతి 'కృష్ణ ఇక్కడ లేదు. మురారి కనిపించడం లేదు. మీరా కూడా లేదు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో' అని అనుమానిస్తుంది. అప్పుడు రజినీ 'ఏమో అదే నిజం కావచ్చు. ఇది వాళ్ళిద్దరూ ఆడుతున్న నాటకం ఏమో' అంటుంది. దీంతో రేవతి 'మురారి అలాంటి వాడు కాదు ఒకప్పుడు ముకుంద తను ప్రేమించినా కృష్ణ కోసం తనవైపు కూడా చూడలేదు' అంటుంది. అలాగే, కృష్ణ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలని టెన్షన్ పడుతుంది.

మురారికి ఏమైనా అయిందా
పల్లకి సేవలో అపశృతి జరగడంతో శకుంతల 'కిట్టయ్యకు మంచి జరుగుతుందని పల్లకి మోయిస్తే ఈ అపశకునం ఏంటి' అని భయపడుతుంది. అదే సమయంలో మురారికి ఏమైనా అయిందా అని కృష్ణ, భవానీ టెన్షన్ పడతారు. భవానీ ఇంటికి వెళ్తానని అంటే కృష్ణ కూడా ఇంటికి వస్తానని అంటుంది. అప్పుడు భవానీ 'అక్కడికి వస్తే మొత్తం తెలిసిపోతుంది. ఎలాగైనా ఆపాలి' అని కృష్ణను వారిస్తుంది. దీంతో ఆమె 'ఏసీపీ సర్ నిజంగా బిజీగా ఉండి ఫోన్ చేయడం లేదా? ఏదైనా జరిగిందా' అని అనుమానపడుతుంది. భవానీ మాత్రం నిజం చెప్పకుండా ఉంటుంది.

ప్రభాకర్‌కు వచ్చిన సందేహం

కృష్ణ ప్రవర్తనలో మార్పులు చూసిన ప్రభాకర్ 'వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా.. కిట్టయ్య హుషారుగా లేదు. అక్కడ ఏదో జరిగింది' అని అనుమానిస్తాడు. విషయం తెలుసుకోవడం కోసం ప్రభాకర్.. మురారికి ఫోన్ చేస్తే ఆఫ్ అని వస్తుంది. దీంతో ప్రభాకర్ 'ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమైంది? అక్కడ అక్కడ ఏమైనా గలాటా జరిగి అరెస్ట్ ఏమైనా అయ్యాడా ఏంటి' అని డౌట్ పడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X