Krishna Mukunda Murari: సరోగసి మదర్ ఎంట్రీ.. కృష్ణపై భవానీకి డౌట్.. ఇవేం ట్విస్టులు బాబోయ్
చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:కృష్ణ వాళ్లు మామిడికాయలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి భవానీ దేవి సర్‌ప్రైజ్ పార్టీతో వాళ్లకు షాకిస్తుంది. అంతేకాదు, తమకు వారసుడిని ఇస్తుందని కృష్ణను ఆకాశానికి ఎత్తేస్తారు. అప్పుడు భవానీ ఫ్రెండ్స్ అందరూ కృష్ణ ప్రెగ్నెంట్ కాలేదని అంటారు. దీంతో భవానీ వాళ్లపై ఫైర్ అయిపోతోంది. అది చూసి కృష్ణ తనలో తాను కుమిలిపోతుంది. అప్పుడు మురారి వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత సరోగసి ప్రాసెస్ మొదలు కావడంతో ముకుంద సంతోషపడుతుంది. అనంతరం తనదైన మాటలతో కృష్ణపై ఆదర్శ్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

కృష్ణను మెచ్చుకున్న ముకుంద:సీమంతం చేస్తున్న సమయంలో అందరూ అక్షింతలు వేసి కృష్ణను ఆశీర్వదిస్తారు. ముకుంద కూడా ఆమెకు కంగ్రాట్స్ చెప్తుంది. అప్పుడే మురారి 'మీ పెద్దత్తయ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావన్న మాట' అంటాడు. దీనికామె 'మీరు ఏ పరిస్థితిలో మౌనంగా ఉన్నారో అర్థం అవుతుంది. అందుకే మీతో పాటు నేను కూడా ఏం తెలియనట్టు నటించాల్సి వస్తుంది' అంటుంది. అప్పుడు ముకుంద మీ సంతోషానికి కారణం కృష్ణ అని మెచ్చుకుంటుంది. అప్పుడు సంగీత డ్యాన్స్ చేస్తానంటే.. ముకుంద వీళ్ల సంతోషానికి బ్రేక్ వేస్తా అంటుంది.
సరోగసి మదర్ అంటూ ఎంటర్:సీమంతం ఘనంగా జరుగుతుంటే ముకుంద వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. ఆ వెంటనే ఒకామె అక్కడకు వచ్చి 'ఇక్కడ సరోగసి మథర్ కావాలని చెప్పారు. మాట్లాడటానికి వచ్చా' అని అంటుంది. దీంతో కృష్ణ, మురారి షాక్ అవుతారు. అప్పుడు భవానీ సరోగసి ఏంటి ఏం మాట్లాడుతున్నావని కంగారుగా అడుగుతుంది. అప్పుడామె 'ఏదైనా కారణం వల్ల పిల్లలని కనలేకపోతే వేరే గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు కదా ఆ అమ్మాయి' చెప్తుంది. తర్వాత ఇక్కడ ఎవరు రమ్మంటే వచ్చావని భవానీ అనడంతో ఆమె ఫ్రెండ్ నీ కోడలే రమ్మంది ఏమో అని వెటకారంగా అంటుంది.

అడ్రెస్ చూసి తప్పించిందిగా:ఆ తర్వాత సరస్వతి 'నీ కోడలికి పిల్లలు పుట్టడం లేదని సరోగసి ద్వారా పిల్లలు పుట్టించాలని చూస్తున్నావా ఏంటి' అని భవానీని అవమానిస్తుంది. దీనికామె 'అంత అవసరం మాకేముంది? మా కోడలు నెల తప్పింది' అంటుంది. అప్పుడే రేవతి 'అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు' అని నిలదీస్తుంది. అప్పుడే సరస్వతి 'కృష్ణ నువ్వే రప్పించావా? సరోగసి చేయించుకుని నిజంగా నెలతప్పినట్టు మీ అత్తను మాయ చేయడం లేదు కదా' అని అవమానిస్తుంది. అంతలో ఆమె దగ్గరకు ముకుంద వెళ్లి అడ్రెస్ ఇది కాదు అని సైగలు చేసి వెళ్లిపోమని పంపించేస్తుంది.
మనశ్శాంతి లేకుండా చేసేలా:ఆమె వెళ్లిపోవడంతో భవానీ సంతోషిస్తుంది. తర్వాత మురారి, కృష్ణ సరోగసి గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు కృష్ణ 'సరోగసి మథర్ ఎవరు అనే విషయం ఎవరూ చెప్పరు. కానీ ఈవిడ ఎలా వచ్చింది? నాకు ఎందుకో ఎవరో కావాలని ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. మన గురించి నిజం తెలుసుకుని మనతోనే నిజం చెప్పించాలని మనకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఇలా చేసి ఉండవచ్చు' అని అనుమానిస్తుంది. అప్పుడు మురారి.. మీరా సరోగసి గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అంతలోనే కృష్ణ మరిన్ని డౌట్లను మాట్లాడుతుంది.

భవానీని డైవర్ట్ చేయాలంటూ:కృష్ణ మాట్లాడుతుంటే మురారికి మీరా మీదనే డౌట్ వస్తుంది. మరోవైపు భవానీ కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంది. అంతలో రేవతి వచ్చి ఆమెను ఆలోచించవద్దని అంటుంది. దీంతో భవానీ 'సరోగసి అంటూ అద్దె గర్భం గురించి మాట్లాడుతుంటేనే ఏదోలా అనిపించది' అంటుంది. అప్పుడు కృష్ణ వాళ్ళ మాటలు విని ఏడుస్తుంది. అంతేకాదు, 'ఇంత అబద్దం ఆడినా అత్తయ్య సంతోషంగా లేకుండా పోయారు. భవానీ మనసు డైవర్ట్ చేయాలి. అయినా సరోగసి అంటే చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ, ఆమె నేరుగా ఎలా వచ్చింది' అని అనుకుంటుంది.
భవానీ అనుమానంతో జాగ్రత్త:ఆ తర్వాత భవానీ 'మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి అడ్రస్ వేరు అని చెప్పి పంపించేశాం. నిజంగానే మీకు పిల్లలు పుట్టరేమో సరోగసి చేయించుకుంటున్నారని గుండెల్లో రాయి పడినట్టు అయింది. వారసులు కావాలని ఆరాటపడుతున్నా కదా. నా బాధ చూడలేక ఏదైనా సమస్య వల్ల బిడ్డలు పుట్టే అవకాశం లేక ఇలా మరోదారి ఎంచుకున్నారేమోనని ఆలోచించాను' అంటుంది. దీంతో పేగు బంధం గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. తర్వాత రేవతి 'నువ్వు 9 నెలలు మోసి ఎప్పుడు బిడ్డని చేతులో పెడతావా అని చూస్తున్నా' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











