Krishna Mukunda Murari: కృష్ణను కలిసిన మీరా.. భవానీకి తెలిసిపోయిన నిజం.. మురారి మిస్సింగ్ మిస్టరీగా!

జనరేషన్లు చేంజ్ అవుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:జాతరకు వెళ్లిన కృష్ణ.. మురారి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అతడికి ఏమైనా అయిందా అని డౌట్ పడుతుంది. అదే సమయంలో భవానీ దేవి మాత్రం కృష్ణకు అబద్ధం చెప్తుంది. అప్పుడు పల్లకి సేవ చేస్తున్న సమయంలో విగ్రహం పక్కకు పడిపోతుంది. దీంతో ఏదో కీడు జరగబోతుందని అంతా అనుకుంటారు. ఇక, ఇంట్లో మీరా కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో మురారితో కలిసి ఆమె వెళ్లిపోయిందని రజినీ అనుకుంటుంది. అనంతరం ఇంటికి వచ్చినప్పటి నుంచి కృష్ణ ప్రవర్తనలో వస్తున్న మార్పులు చూసిన ప్రభాకర్ ఏదో జరుగుతుందని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 30th

కృష్ణ దగ్గరకు వచ్చిన మీరా:ప్రభాకర్ 'అల్లుడి ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ వచ్చింది? అక్కడ ఏమైనా గలాటా అయి అరెస్ట్ జరిగిందా' అని అంటాడు. దీంతో భవానీ 'అలాంటిది ఏమి లేదు. పని మీద వెళ్లాడు' అని చెప్తుంది. అంతలోనే కృష్ణ ఇంటి ముందు కారు ఆగుతుంది. మురారి వచ్చాడు అనుకుని పరుగున వస్తుంది. కానీ, ముకుంద రావడం చూసి షాక్ అవుతుంది. ఆ వెంటనే ఎందుకు వచ్చావని కోపంగా అడుగుతుంది. దీనికామె 'నీ కోసమే కృష్ణ.. అక్కడ నా వల్ల టెన్షన్ భరించలేక ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని వచ్చావు కదా. నిన్ను ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను' అంటుంది.

ప్రశాంతత పోయిందంటూ:ముకుంద మాటలకు కృష్ణ 'నువ్వు ఎప్పుడైతే ముకుంద అని తెలిసిందో అప్పుడే ప్రశాంతత పోయింది. అసలు ఎందుకు వచ్చావు' అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'నా మురారి ఇంకా నీ దగ్గరే ఉన్నాడు కదా. తనని సొంతం చేసుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అసలు నువ్వు ఈ రెండు రోజులు మురారి ఇంట్లో ఉంటే నేను అనుకున్నది జరిగిపోయేది. ఇద్దరూ బాగానే తప్పించుకున్నారు. ఇంతకీ మురారి ఎక్కడ' అని అడుగుతుంది. దీంతో కృష్ణ 'ఆయన గురించి నీకెందుకు' అనగా.. ఏం చేసినా అది మురారి కోసమే కదా అని మీరా బదులిస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 30th

మురారి అక్కడకూ రాలేదా:మీరా, కృష్ణ మాట్లాడుతుండగా.. శకుంతల వచ్చి ఎవరు ఈమె అని ప్రశ్నిస్తుంది. దీంతో నా ఫ్రెండ్ మీరా అని పరిచయం చేస్తుంది. శకుంతల మాట్లాడుతూ.. మురారి ఏదో పనిలో ఉన్నాడని ఇక్కడికి రాలేదని చెప్పేస్తుంది. దీంతో మీరా 'మురారి ఇక్కడికి కూడా రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు' అని ఆలోచనలో పడుతుంది. తర్వాత మురారి ఎక్కడికి వెళ్ళాడు అని భవానీ ఆలోచిస్తుంది. ఇంట్లో అందరూ డల్‌గా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది. దీంతో రేవతి.. మీరా వెళ్లిపోయిందని చెప్తుంది. తర్వాత ఆదర్శ్ గొడవ గురించి మధు ఆమెకు చెప్తాడు.

పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా:నందినీ 'మురారి అన్నయ్య తప్పు చేయలేదు. మీరా తప్పు చేయడం వల్ల పారిపోయింది' అంటుంది. అప్పుడు భవానీ 'ఒకవేళ మురారి తప్పు చేస్తే న్యాయం గురించి అడిగితే చంపాలని చూస్తే.. మీరా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏంటి పరిస్థితి? కాస్త కూడా ఆలోచించొద్దా' అని సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఆవేశంగా ఆదర్శ్ దగ్గరకు వస్తుంది. అప్పుడు 'మీరాను ఎందుకు చంపాలని అనుకున్నావు? రేవతి వచ్చింది కాబట్టి సరిపోయింది. అయినా ఎందుకు అంత ఆవేశం? మీరా ఇక్కడే ఉంటే మురారి ఏ తప్పు చేయలేదని నిరూపించే వాళ్ళం' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 30th

మీరా ఉంటేనే తెలిసేదని:భవానీ మాటలకు ఆదర్శ్ 'తప్పు చేసిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు కానీ మోసపోయిన నీ కొడుకు కనిపించడం లేదా? అసలు ఇన్నేళ్లలో ఎప్పుడైనా నీ మాట జవ దాటానా? ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటాను అన్నాను. నాతో సరదాగా ఉండి మోసం చేసి వెళ్ళిపోయింది. ఆ బాధ కనిపించడం లేదా' అని ప్రశ్నిస్తాడు. దీంతో భవానీ 'బాధ ఉంటే చంపేస్తారా? నీ బాధ ఆలోచనగా మారి పరిష్కారం అవాలి. కానీ కొత్త సమస్య తీసుకురాకూడదు. మీరా ఎందుకు వచ్చిందో తెలియదు, మురారి తండ్రి అని ఎందుకు చెప్పిందో తెలియదు. మీరా ఇక్కడ ఉంటేనే కదా తెలిసేది. నీ ఆవేశం వల్ల ఎన్ని అనార్థాలు వచ్చాయో' అని తిడుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 30th

జుట్టుపట్టుకుని కొట్టేవాడ్ని:మీరాతో శకుంతల మాట్లాడుతూ.. 'కృష్ణ అమాయకురాలు. ఇంట్లో ఒక పిల్ల ముకుంద అనేది ఉంది. తన మొగుడిని ఏడిపించేది. ఆ అమ్మాయిని చూశాక ఇలాంటి ఆడపిల్ల కూడా ఉంటుందా అనిపించింది. అది వగలమారి. కానీ ముకుంద నా బిడ్డ కాపురంలో నిప్పులు పోయాలని చూసేది. నాకే అవకాశం దొరికితే జుట్టు పట్టుకుని కొట్టేదాన్ని' అని అంటుంది. తర్వాత ప్రభాకర్ 'మాకు ఆ ఛాన్స్ లేదులే. దాని పాపానికి దేవుడు తీసుకుపోయాడు' అంటాడు. దీంతో మీరా 'ఎందుకు? ఇప్పుడు మీ కళ్ల ముందే ఉంది' అనడంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ అవుతారు.

Krishna Mukunda Murari Serial Today Episode May 30th

కృష్ణను టెన్షన్ పెట్టాలని:తర్వాత కృష్ణను టెన్షన్ పెట్టేందుకు కావాలని ముకుంద ఇరికించేలా మాట్లాడుతుంది. ఇక మేము బయల్దేరుతాము. కృష్ణ కూడా నాతో పాటు వస్తుంది అంటుంది. దీంతో కృష్ణ కూడా వెళ్తానని చెప్తుంది. మరోవైపు, రేవతి.. కృష్ణ గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది. కృష్ణకు జరిగింది ఎలా చెప్పాలో అర్థం కాలేదని భవానీ, రేవతి బాధపడతారు. అప్పుడు భవానీ 'ఇదంతా నా వల్లే జరిగిందని అనిపిస్తుంది. ఆరోజు మురారిని కాపాడినందుకు ఏదో సాయం చేయమని వదిలేయమని మీరందరూ అంటే తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తప్పు చేశాను. ఈ ఇంట్లోకి ఒక ఆడపిల్ల వచ్చాక తను ఏం చేస్తుందో అని ఆలోచించకుండా తప్పు చేశాను. కృష్ణకి విషయం చెప్పకుండా ఇంకొక తప్పు చేశాను' అని బాధపడుతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X