Krishna Mukunda Murari May 31st: నిజం చెప్పిన పోలీసులు.. రిపోర్ట్ చూసేసిన భవానీ.. కృష్ణ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ప్రభాకర్ ఇంటికి దగ్గర ఉన్న కృష్ణను కలిసేందుకు మీరా వస్తుంది. ఆమెను చూసి కృష్ణ షాక్ అవుతుంది. అప్పుడు మీరా 'నీ ప్రశాంతతను దూరం చేయడానికే ఇక్కడకు వచ్చాను' అని చెప్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటోన్న సమయంలోనే మురారి అక్కడకు రాలేదు అన్న విషయం మీరాకు తెలుస్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన భవానీకి మీరా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం చెప్తారు. అంతేకాదు, ఆదర్శ్ ఆమెను చంపాలని అనుకున్నది కూడా వివరిస్తారు. దీంతో భవానీ.. ఆదర్శ్ మీద ఫైర్ అవుతుంది. అప్పుడతను తన బాధనంతా తల్లికి చెప్పుకుంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 31st

నీకు ఏ అన్యాయం చేశాను
ఇంటికి వచ్చిన తర్వాత గుడిలో జరిగిన అపశృతి గురించి రేవతికి భవానీ చెప్తుంది. దీంతో ఆమె మరింతగా టెన్షన్ పడుతుంది. తర్వాత మీరా గురించి అడగ్గా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్తుంది. అప్పుడు భవానీ 'ఇంట్లో చేరి ఇన్ని నాటకాలు ఆడింది. బయటకు పోయింది. ఏం చేయకుండా ఎలా ఉంటుంది' అని భయపడుతుంది. తర్వాత కృష్ణను తీసుకుని ముకుంద ఇంటికి బయల్దేరుతుంది. అప్పుడు కృష్ణ 'ఎందుకు నన్ను పట్టి పీడిస్తున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను' అని బాధగా అడుగుతుంది.

నువ్వు అడ్డుగా ఉన్నావని
కృష్ణ అడిగిన దానికి మీరా 'నువ్వు నాకు ఏ అన్యాయం చేయలేదు కానీ.. నాకు అడ్డుగా ఉన్నావు. నా మురారిని పెళ్లి చేసుకున్నావు. ఇంకా తనని అంటి పెట్టుకుని ఉండి పెద్ద తప్పు చేశావు. నా మురారిని నువ్వు ఏమైనా ప్రేమించావా? కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నావు. అయిపోయాక వెళ్ళకుండా ఎందుకు ఉన్నావు' అని అడుగుతుంది. దీంతో కృష్ణ ఆశపడినంత మాత్రాన ఏది దక్కదు రాసి పెట్టి ఉండాలి అంటుంది. దీంతో మీరా 'ముకుందలా మొహాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మార్చుకోలేదా ఏంటి? ఈ రూపం మార్చుకోవడానికి యాక్సిడెంట్ చేయించుకున్నా' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 31st

నువ్వు ఇలా తెగిస్తావా అని
తర్వాత మీరా 'ప్రాణాలకు తెగించి ఎంత కాలిక్యులేటెడ్‌గా మొహం మార్చుకున్నాను. ఎంతో జాగ్రత్తగా మురారిని విడిపించి పెద్దత్తయ్యతోనే ఇంట్లోకి వచ్చేలా చేసుకున్నాను. నిన్ను మురారిని బురిడీ కొట్టించి మీ బిడ్డని నా కడుపున పుట్టెలా చేసుకున్నాను. నువ్వు అయితే ఇంతకు తెగించే దానివా' అంటుంది. దీంతో కృష్ణ 'దీన్ని తెగింపు అనరు బరితెగింపు అంటారు. నేనైతే నా రాత ఇదే అనుకుని వెళ్లిపోయేదాన్ని' అంటుంది. దీంతో మీరా 'ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇటు నుంచి ఇటే పుట్టింటికి వెళ్లిపో. మురారిని నేను చూసుకుంటాను' అని చెబుతుంది.

నీ ఆరాటం నెగ్గదు అంటూ
మీరా మాటలకు కృష్ణ 'వెళ్లిపోవాల్సింది నేను కాదు ముకుంద నువ్వు. మేం వెనక్కి తిరిగి రాలేనంత దూరం ప్రయాణం చేశాము. నువ్వు ఇంకా ప్రయాణం మొదలు పెట్టాలని ఆరాటపడుతున్నావు. నా పోరాటం ముందు నీ ఆరాటం ఎప్పటికీ నెగ్గదు' అని చెప్తుంది. దీంతో మీరా 'ఇంటికి వచ్చి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నా' అంటుంది. దీంతో కృష్ణ 'నువ్వు నన్నేం చేయలేవు' అంటుంది. మీరా, మురారి కలిసి ఎక్కడికైనా వెళ్లిపోయారు ఏమోనని రజిని మళ్ళీ భవానీ దగ్గర అంటుంది. అప్పుడే పోలీసులు భవానీ ఇంటికి వస్తారు.

భవానీకి షాకిచ్చిన కృష్ణ
కృష్ణ, మీరా కూడా ఇంటికి వస్తారు. పోలీసులను ఇంట్లో చూసి ఏమైందని కృష్ణ కంగారుగా అడుగుతుంది. ఆమెను చూసి ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. అప్పుడు రజినీ 'ఉన్నట్టుండి కనిపించకుండా పోతే మురారిని తీసుకుని ఎక్కడికైనా చెక్కేశావ్ అనుకున్నా. కృష్ణను వెంట పెట్టుకుని తీసుకొచ్చావు ఏంటి' అని అడుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది పోలీసులు ఎందుకు వచ్చారని కృష్ణ.. భవానీని అడగ్గా.. ఎందుకు వచ్చావ్ అంటుంది. దీంతో కృష్ణ 'ఎందుకు అత్తయ్య ఇక్కడ జరిగేది తెలియకుండా ఉండటానికా' అని అడిగి షాకిస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 31st

కడుపు చేసి పారిపోయాడు
మురారి కనిపించడం లేదన్న విషయాన్ని పోలీసులు చెప్తారు. దీంతో షాకైన కృష్ణ 'ప్రాజెక్ట్ పని మీద బయటకు వెళ్లారని అన్నారు కదా. కనిపించకపోవడం ఏంటి' అని అడగ్గా అందరూ సైలెంట్‌గా ఉంటారు. అప్పుడు ఆదర్శ్ వచ్చి 'మీ ఏసీపీ సార్‌కు ఏం కాలేదు. వాడే ఈ మీరాని గర్భవతిని చేసి ఎక్కడికో పారిపోయాడు' అని చెప్తాడు. దీంతో కృష్ణ 'అంటే కడుపులో ఉన్న మా బిడ్డను చూపించి ఏసీపీ సర్ వల్ల నేరుగా తల్లి అయినట్టు ఇంట్లో వాళ్ళని నమ్మించింది' అని అనుకుంటుంది. అప్పుడు రజినీ.. మురారి తప్పు చేశాడని నమ్ముతున్నావా? అని అడుగుతుంది.

అన్నీ బయటపెడతాను
తర్వాత కృష్ణ 'ముకుంద ఇంత చేస్తుంటే ఏసీపీ సర్ ఎందుకు మాట్లాడలేదు? నా దగ్గరకు అయినా వచ్చి ఉండాలి కదా' అనుకుంటుంది. తర్వాత పోలీస్ భవానీని పక్కకి పిలిచి 'మురారి ఎవరినీ ఫేస్ చేయలేక ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆయన ఉద్దేశం చెప్తూ ఎక్కడో నోట్ రాసి పెట్టి ఉంటాడు వెతకండి' అంటాడు. ఆ మాటలు ముకుంద విని లోపలికి వెళ్ళిపోతుంది. రేవతి బాధగా కూర్చుని ఉంటే కృష్ణ వచ్చి మాట్లాడుతుంది. మీకు మీ కొడుకు మీద నమ్మకం లేదేమో కానీ నాకు నా మొగుడి మీద నమ్మకం ఉందని అంటుంది. అంతేకాదు, అన్నీ బయటపెడతానని చెప్తుంది. అనంతరం భవానీ వాళ్ల గదిలోని రిపోర్టులు చూసి షాకైపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X