Krishna Mukunda Murari: మొత్తం నువ్వే చేశావ్.. మీరాకు మురారి షాక్.. కృష్ణకు భవానీ కొత్త కండీషన్

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode May 3rd

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కృష్ణ, మురారి ఇంటికి రాగానే వాళ్లకు భవానీ దేవి సర్‌ప్రైజ్ ఇస్తుంది. అక్కడ అందరి ముందే కోడలిని ఆమె పొగుడుతుంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడే ఒక అమ్మాయి వచ్చి సరోగసి మదర్‌ను అని చెప్తుంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. అప్పుడు అందరూ కృష్ణను అనుమానిస్తారు. అంతలోనే ముకుంద వెళ్లి ఆమె తప్పు అడ్రెస్‌కు వచ్చిందని కవర్ చేస్తుంది. దీంతో అసలు ఆమె ఎలా వచ్చిందని మురారి, కృష్ణకు డౌట్ వస్తుంది. అదే సమయంలో ప్రెగ్నెన్సీ విషయంలో భవానీ దేవి నమ్మకం కోల్పోతున్నందుకు కృష్ణ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది.

మీరాను అనుమానించిన మురారి

మీరాను అనుమానించిన మురారి.. తన సందేహాలను తీర్చుకోవడం కోసం ఆమెను కలుస్తాడు. అప్పుడు 'ఆవిడ ఎవరో వచ్చి సరోగసి గురించి మాట్లాడి డిస్ట్రబ్ చేసింది' అంటాడు. దీంతో మీరా 'అనుకున్నవన్నీ జరుగుతాయా? మీరు కృష్ణ బిడ్డని కని ఇస్తానని అన్నారు కానీ అది జరిగిందా లేదు కదా. అన్ని మన చేతుల్లో ఉండవు' అని అంటుంది. దీనికతడు 'వచ్చిన ఆవిడ అడ్రస్ తప్పిపోయి ఇక్కడికి రాలేదు. ఎవరో ఆవిడని పంపించినట్టు వచ్చింది' అనడంతో షాకైన మీరా ఆమె ఒరిజనల్ అడ్రస్‌కు వెళ్లబోయి ఇక్కడికి వచ్చింది నేనే చూసి పంపించా అంటుంది.

మీరాను టెన్షన్ పెట్టేసిన మురారి
ఆ తర్వాత మురారి 'అడ్రస్ నువ్వే చూశావ్ కదా. అది నీకు గుర్తుందా' అని అడుగుతాడు. అప్పుడామె ఏమో సరిగా గుర్తు లేదని కవర్ చేస్తుంది. దీంతో మురారి 'గుర్తుంటే బాగుండేది. ఇప్పుడే అక్కడికి వెళ్ళి సరోగసి మథర్ గురించి అడిగే వాళ్ళం. ఆ అమ్మాయి అడ్రస్‌ను పట్టుకుని ఫంక్షన్ చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చిందో లేదో తెలిసిపోయేది' అంటూ ఆమెను టెన్షన్ పెడతాడు. తర్వాత 'సరోగసి ప్రాసెస్ చాలా సీక్రెట్‌గా చేస్తారు. అలాంటిది ఆ అమ్మాయి నేనే సరోగసి మథర్‌ను అని పబ్లిక్‌గా అడిగిందంటే కావాలని టెన్షన్ పెట్టడానికి చేసింది కాక మరేంటి' అంటాడు.

నువ్వే చెప్పావు కదా అని ప్రశ్న

అనంతరం మురారి 'అసలు ఈ విషయం నీకు, నాకు, కృష్ణకి తప్ప ఎవరికీ తెలియదు. నేను ఎలాంటి మొహమాటం లేకుండా అడుగుతున్నా. నువ్వే చెప్పావ్ కదా? ఇంకెవరికీ ఈ విషయం తెలియదు. ఇంకెవరికీ ఆ అవసరం కూడా లేదు' అంటాడు. దీనికి మీరా 'నేను మీకు టెన్షన్ పెట్టించాలని సంతోషం దూరం చేయాలని అనుకుంటున్నానా' అంటుంది. దీంతో మురారి 'నిజం ఎక్కడ తెలుస్తుందోనని నేను, కృష్ణ చాలా భయపడుతున్నాం. మిగిలింది నువ్వే' అనడంతో.. మీరా ఏడుస్తూ చాలు ఆపండి సరోగసికి వెళ్ళమని సలహా ఇచ్చింది నేనే అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 3rd

నన్ను విలన్‌ను చేస్తున్నారా?
మీరా 'ఫంక్షన్ మధ్యలో సరోగసి అని ఆవిడ వస్తే మీకులాగే టెన్షన్ పడ్డాను. ఎవరినో పంపించి చెప్పించాల్సిన అవసరం నాకు ఏంటి? దీని వల్ల నాకు ఏం వస్తుంది' అని ఏడుస్తుంది. దీంతో మురారి ఆమెకు సారి చెప్తాడు. తర్వాత మీరా 'సరోగసి సీక్రెట్‌గా ఉంచుతారని ఎవరు చెప్పారు? కొంతమంది ఆమెని ఇంటికి తీసుకొచ్చి బిడ్డ పుట్టే వరకు ఇంట్లో పెట్టుకుని చూసుకుంటారు. ఈరోజు వచ్చిన ఆవిడను కూడా ఎవరో నమ్మకంగా పిలిపించుకుని ఉంటారు. నాకు విషయం తెలుసని నన్ను విలన్‌ను చేస్తారా' అని యాక్టింగ్ చేయడంతో మురారి సారీ చెప్పి వెళ్లిపోతాడు.

అత్తయ్యకు నచ్చకపోతే ఎలా

కృష్ణ ఆలోచనలో ఉండగా మురారి వచ్చి 'ఇంకా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా? తన గురించి మర్చిపో. జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు' అని చెప్తాడు. దీనికామె 'మీ ముందు కూడా ఏం జరగనట్టు నటించమని అంటారా? నేను పిల్లలను కనలేకపోయినా వేరే దారి చూపించాడు. కానీ జరుగుతున్న ఒక్కో సంఘటనకు కాళ్ళు వణికిపోతున్నాయి. ఇందాక పెద్దత్తయ్య ఒక మాట అన్నారు. ఎవరైనా తొమ్మిది నెలలు మోసి బిడ్డను కంటారు కానీ ఇలా సరోగసి ద్వారా బిడ్డని కంటారా? అన్నారు. మనం డాక్టర్ తో మాట్లాడాము. అంతా చేశాక పెద్దత్తయ్యకు నచ్చకపోతే ఏంటి పరిస్థితి' అని అంటుంది. దీంతో మురారి 'అలా ఏం జరగదు. జరిగింది తెలిస్తే ఆవిడ ఒప్పుకుంటుంది' అని సర్ది చెప్తాడు.

నువ్వు చేస్తున్న పని ఏంటి?
కృష్ణ హడావుడిగా నడుస్తుంటే భవానీ ఆమెను ఆపి ఏంటి నువ్వు చేస్తున్న పని అని సీరియస్‌గా అడుగుతుంది. దీనికామె ముగ్గు వేయడానికి వెళ్తున్నానని చెప్తుంది. అప్పుడు భవానీ 'ఇంట్లో ఏ పని చేయవద్దని చెప్పాను కదా. డెలివరీ అయ్యే వరకు కృష్ణ ఏ పని చేయడానికి వీల్లేదు' అంటుంది. దీంతో కృష్ణ 'డెలివరీ అయ్యే రోజు కూడా పనులు చేసేవాళ్ళు ఉన్నారు' అంటుంది. కానీ, కృష్ణ చెప్పిన దానికి భవానీ అసలు ఒప్పుకోదు. పైగా 'ఎన్ని చెప్పినా నేను వినను. పని చేస్తూ ఏదైనా దెబ్బ తగిలితే కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని ప్రశాంతంగా ఉండలేను' అంటుంది.

ముకుందపై భవానీ కోపం

భవానీ 'కృష్ణ మెట్లు ఎక్కి దిగడం మంచిది కాదు. మీరు రూమ్ మారండి. ఈ ఇంటికి వారసులు రావలన్నది నా కల. క్షేమంగా నా చేతికి వచ్చే వరకు నా జాగ్రత్తలో నేను ఉంటాను' అంటుంది. అప్పుడు ముకుంద 'కృష్ణ మెట్లు ఎక్కి దిగడం కాదు పరిగెత్తినా గెంతినా కూడా తనకి ఏం కాదు. కాబట్టి కృష్ణ ఏం చేయాలని అనుకుంటే అది చేయనివ్వండి' అంటుంది. దీనికి భవానీ 'షటప్ ముకుంద. నీకు ఏం తెలుసని చెప్తున్నావు? పెళ్లి అయ్యిందా పిల్లల్ని కన్నావా? అసలే ఇది తింగరిది. ఎవరూ ఏం మాట్లాడకుండా నేను చెప్పింద చేయండి' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X