Krishna Mukunda Murari: ఆదర్శ్‌కు పడిపోయిన మీరా.. భవానీ సంచలన నిర్ణయం.. ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
సరోగసి మదర్ అంటూ ఓ అమ్మాయి నేరుగా ఇంటికి రావడంతో మీరాపైనే మురారికి డౌట్ పెరిగిపోతుంది. అందుకే ఆమెను పిలిచి సూటిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ యాక్టింగ్ షురూ చేసి నమ్మిస్తుంది. అనంతరం కృష్ణ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుండడంతో మురారి ఆమెకు ధైర్యం చెప్తాడు. అంతేకాదు, భవానీ దేవి కూడా ఒప్పుకుంటుందని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇంటి పని చేయడానికి సిద్ధం అవుతుండడంతో భవానీ ఆమెపై కోప్పడుతుంది. అనంతరం మీరా వచ్చి ఏం కాదు అనడంతో భవానీ ఆమెపైన కూడా ఓ రేంజ్‌లో సీరియస్ అవుతుంది.

మురారికి తప్ప చోటు లేదు
ముకుందను ఆదర్శ్ అనుకుంటాడు. అందుకు ఆమెను రమ్మనగా మనసులో తిట్టుకుంటుంది. అప్పుడు ఆదర్శ్ 'బట్టలు నీకోసం కొంటాను. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొన్నే కట్టుకుంటున్నావు. అది నాకు నచ్చలేదు. అందుకే నేను నీకు బట్టలు కొంటాను' అంటాడు. దీనికామె 'మీది ఎంత మంచి మనసు ఆదర్శ్. నేను ముకుందగా ఉన్నప్పుడు కూడా నా మీద ఎవరూ ఇంతగా శ్రద్ధ చూపించలేదు. కానీ అదంతా వృధానే. ఈ జన్మకి నా మనసులో మురారికి తప్ప వేరొకరికి చోటు ఉండదు. నేను మీరాను అయితే మీకు పడిపోయేదాన్ని' అనుకుంటుంది.
మీరా, ఆదర్శ్ పెళ్లి గురించి
కృష్ణకు వైదేహి ఫోన్ చేసి 'సరోగసి మథర్‌తో మాట్లాడాను ఒప్పుకుంది. హాస్పిటల్‌కు వస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం' అని గుడ్ న్యూస్ చెప్తుంది. కృష్ణ చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే భవానీ పాలు తీసుకుని వస్తుంది. అప్పుడు కృష్ణ 'మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నా. నిజం తెలిస్తే మీ ప్రేమ అంతా అసహ్యంగా మారుతుంది' అని మనసులోనే బాధపడుతుంది. తర్వాత భవానీ 'ఆదర్శ్, మీరా పెళ్లి గురించి నీ అభిప్రాయం అడిగాను కదా. నీ ఆలోచన ఏంటి చెప్పు' అని ప్రశ్నిస్తుంది. దీంతో కృష్ణ వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగారా అని అంటుంది.

నీలాగే ఆలోచిస్తుంటుంది
భవానీ దేవి 'ఇప్పుడే చూశాను.. వాళ్ళిద్దరూ షాపింగ్‌కు వెళ్లాలని మాట్లాడుకుంటున్నారు. నువ్వు నేను ముకుంద గురించి ఆలోచించలేదు. కానీ ఆదర్శ్ ఆలోచించాడు. తనకు కూడా ఎవరూ లేరు. నీలాగే మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది. పెళ్లి చేస్తే బాగుంటుంది' అంటుంది. తర్వాత కృష్ణ హాస్పటల్‌కు వెళ్తున్నామని చెప్పడంతో తాను కూడా వస్తానని భవానీ అంటుంది. దీంతో ఆమె షాక్ అవుతుంది. అంతేకాదు, 'ఇక నుంచి నేనే దగ్గరుండి చూసుకుంటాను. కడుపులో బిడ్డకి ఎలా ఉందో తెలుసుకుంటాను' అని భవానీ అనడంతో మురారి కూడా షాక్ అవుతాడు.
ప్రేమ పొందే అర్హత లేదు
భవానీని హాస్పిటల్‌కు రాకుండా మురారి ఒప్పిస్తాడు. దీంతో కృష్ణకు ఆమె జాగ్రత్తలు చెప్తుంది. అప్పుడు కృష్ణ 'ఇంత ప్రేమని పొందే అదృష్టాన్ని ఇచ్చిన దేవుడు దాన్ని పొందే అర్హతను నాకు ఇవ్వలేదు' అని ఏడుస్తుంది. తర్వాత డాక్టర్ వైదేహి ఫోన్ చేసిందని సరోగసి మథర్ దొరికిందని కృష్ణ మురారికి చెప్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కు బయల్దేరతారు. భవానీ తన మీద చూపిస్తున్న ప్రేమ గుర్తు చేసుకుని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఎదుటి వాళ్లు చూపించే ద్వేషం మాత్రమే కాదు ప్రేమ కూడా ఒక్కోసారి బాధని మిగులుస్తుందని అంటుంది.

వాళ్లను మోసం చేస్తున్నా
తర్వాత కృష్ణ 'నేను తల్లిని కాబోతున్నానని ఎంత ప్రేమ చూపిస్తు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళను దారుణంగా మోసం చేస్తున్నాననే బాధగా ఉంది' అంటుంది. దీంతో మురారి 'మనం ఎవరినీ మోసం చేయడం లేదు. ఏదైనా కొన్ని రోజులు భరించాలి. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అది కాదు సరోగసి మథర్ ఎలాంటిది.. తను మన బిడ్డని సరిగా చూసుకుంటుందో లేదో అని' అంటాడు. తర్వాత మురారి కారు ఆపి కొబ్బరి బోండాం కోసం వెళ్లి వచ్చేసరికి కృష్ణ కనిపించదు. దీంతో అతడు కంగారు పడతాడు. చివరికి ఆమె అనాథాశ్రమానికి వస్తుంది.
దత్తత తీసుకుందామని
అనాథాశ్రమంలో ఆటుకుంటున్న పిల్లలను చూసి కృష్ణ మురిసిపోతుంది. అప్పుడు మురారి వచ్చి ఆమెపై అరుస్తాడు. అప్పుడు కృష్ణ 'ఇక్కడ ఒక పాపను దత్తత తీసుకుని పెద్దత్తయ్య చేతిలో పెడితే వారసురాలు వచ్చేసిందని చాలా సంతోషిస్తుంది. ఒక పాపని లేదంటే ముగ్గురిని నలుగురిని తీసుకుని వెళ్లిపోదాం' అంటుంది. అప్పుడు మురారి 'కృష్ణ నీ ఆలోచన బాగుంది కానీ పిల్లలని ఎందుకు దత్తత తీసుకుంటున్నారని పెద్దమ్మ అడిగితే ఏం చెప్తావు' అంటాడు. దీంతో కృష్ణ 'అవును కదా పిల్లల్ని చూసేసరికి అంతా మర్చిపోయాను' అని చెబుతుంది.
ఆమెను చూపించమని
వైదేహి సరోగసి ప్రాసెస్‌కు సంబంధించి కృష్ణ వాళ్ళతో సంతకాలు తీసుకుంటుంది. సరోగసి మథర్ దొరికినందుకు కృష్ణ చాలా సంతోషపడుతుంది. ఆమెను ఒక్కసారి చూపించమని కృష్ణ బతిమలాడుతుంది. తనని చూపించమని, ఎవరికీ చెప్పమని మురారి కూడా అడుగుతాడు. కానీ వైదేహి మాత్రం చెప్పేందుకు అంగీకరించదు. అప్పుడు కృష్ణ 'నా ప్రాణాన్ని తీసుకెళ్ళి ఇంకొకరి గర్భంలో దాస్తున్నా తనని చూడకుండా ఎలా ఉండగలను? ఈ తల్లి మనసు ఎలా ఊరుకుంటుంది' అని ఏడుస్తుంది. దీంతో మురారి ఆమెను చూపిస్తానని అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











