Krishna Mukunda Murari: నిజం చెప్పేసిన మధు.. బయటపడ్డ మీరా డబుల్ గేమ్.. అమృత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్
జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:సరోగసి మదర్ ఎవరో తెలుసుకుని వస్తానని మురారి, కృష్ణను ఇంటికి పంపించేస్తాడు. అప్పుడు అతడికి ఫోన్ చేసి భవానీ తిడుతుంది. ఆమె హడావిడి చూసి ఆదర్శ్‌కు కోపం వస్తుంది. ఇక, తన కూతురిని ఆదర్శ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న రజినీ.. కృష్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. అంతేకాదు, మీరా అతడితో చనువుగా ఉంటుందని, ఎలాగైనా తన కూతురితోనే పెళ్లి చేయమని అడుగుతుంది. అనంతరం మురారి దగ్గరకు వెళ్లిన ముకుంద సరోగసి మదర్‌ను తానేనని అతడికి తేల్చి చెప్పేస్తుంది. ఇలా అయినా మురారికి దగ్గర అవుతానని అనుకుంటుంది.

మీరాతో మురారి ప్రేమగా:సరోగసి మదర్ మీరా అని తెలుసుకున్న మురారి ఆమెను కారులో ఇంటికి వెళ్దామని పిలుస్తాడు. ఆమె వద్దని డ్రామా ఆడినా.. నువ్వు మా బిడ్డని మోస్తున్నావు.. కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని ఆమె చేయి పట్టుకుని కారులో కూర్చోబెడతాడు. ముకుంద.. మురారి పక్కన కూర్చున్నానని తెగ మురిసిపోతుంది. మరోవైపు, సంగీత ఏడుపు మొహం పెట్టుకుని ఉంటే ఫొటో తీసిన మధు ఏమైందని అడగ్గా 'ఎప్పుడు ఉండే గోలే. ఆదర్శ్ బావ నా మొహం చూడటం లేదు. తనను వలలో వేసుకోవడం లేదని మా అమ్మ చంపుతుంది' అని చెబుతుంది.
సంగీతకు మధు ప్లానింగ్:సంగీత మాటలకు మధు 'నేనే నీకు మంచి సంబంధం చూస్తాను. అయితే ఈ సారి మీ అమ్మ ఉన్నప్పుడు ఆదర్శ్ దగ్గరకు వెళ్ళు. తను కసురుకుంటాడు మీ అమ్మ చూస్తుంది. అప్పుడే వర్కౌట్ అవదని సైలెంట్ అయిపోతుంది' అంటాడు. దీనికామె 'నేను అలాగే అనుకున్నాను కానీ ముకుంద ఉంది కదా. తను నాకు ఆదర్శ్ బావకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది' అని చెప్తుంది. అది విని మధు ఆశ్చర్యపోతాడు. మీరా నీతో ఆదర్శ్ పెళ్లి చేస్తానని చెప్పిందా అనగా.. సంగీత 'ఆవిడ ఆదర్శ్ బావతో క్లోజ్‌గా ఉంటుంది కదా మా అమ్మ మీరాని అడిగితే చెప్పింది' అంటుంది.

కృష్ణ నిజం చెప్పేశాడు:సంగీతకు నచ్చజెప్పిన మధు.. కృష్ణకు ఈ నిజం చెప్పాలని వెళ్తాడు. వెంటనే కంగారుగా ఆమె దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్తాడు. దీనికామె నీకు ఈ విషయం తెలిసిందా? ఆదర్శ్ మీరా మీద అలాంటి అభిప్రాయం లేదా అంటుంది. దీంతో మధు 'ఆదర్శ్ ఎప్పుడు మీరా వెంట పడుతున్నాడు. ఇద్దరి వాలకం చూస్తుంటే ఎంత దూరం వెళ్లిపోయారో తెలియడం లేదు. పెద్ద పెద్దమ్మ ఆదర్శ్‌కు మీరాతో పెళ్లి చేయాలని చూస్తుంది. వాళ్ళిద్దరూ రాసుకుపూసుకు తిరుగుతున్నారు. కానీ ఇదేంటి డబుల్ గేమ్' అంటాడు. దీంతో కృష్ణలో కూడా సందేహం మొదలవుతుంది.
కృష్ణలో మరొక టెన్షన్:మధు 'సంగీత కోసం మీరా ఆదర్శ్‌ను దూరం పెడితే మళ్ళీ తను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు కదా. అలాగని తనను పెళ్లి చేసుకుంటే నా కూతురు పెళ్లి కాలేదని రజిని అత్త ఏడుస్తుంది' అంటాడు. దీంతో కృష్ణ 'క్లోజ్‌గా ఉండి తర్వాత వదిలేస్తే ఆదర్శ్ ఏమైపోతాడో. ఒకప్పుడు ఇలాగే ముకుందని ఆశపడి పెళ్లి చేసుకున్నాడు. తన మనసులో లేదని తెలుసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆ ముకుంద మీద ప్రేమ చావక తనకి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరా కూడా మోసం చేస్తే ఆదర్శ్ పిచ్చి వాడు అవుతాడు' అని టెన్షన్ పడిపోతుంది.

మురారిపై రేవతి ఫైర్:మురారి ఇంటికి వచ్చిన వెంటనే రేవతి 'పెళ్ళాన్ని ఇంటికి ఒంటరిగా పంపించి ఏం చేస్తున్నావు? కడుపుతో ఉన్న దాన్ని క్యాబ్‌లో పంపించి ఏమి లేని దాన్ని కారులో ఎక్కించుకుని వస్తున్నావా' అని ఫైర్ అవుతుంది. దీంతో మురారి.. మీరా ఎండలో వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చానని చెప్తాడు. మీరా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. కృష్ణ కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మురారి 'మీరా సరోగసి మథర్ అని చెప్దామని వస్తే ఇలా జరిగింది ఏంటి' అనుకుంటాడు. తర్వాత గదిలోకి వెళ్లి ఏమైందని అడగ్గా మీరాను ఎందుకు తీసుకొచ్చావని కృష్ణ కోప్పడుతుంది.
మీరా తప్పుడు మనిషా:మురారి ఏమైందని అడగ్గా 'తప్పుడు మనుషులకు సాయం చేయడం కూడా తప్పే' అని కృష్ణ కోపంగా అంటుంది. దీనితడు 'మీరా తప్పుడు మనిషా? అసలు తను మన కోసం ఏం చేసిందో తెలుసా? మీరా మీద ఉన్న తప్పుడు అభిప్రాయం మార్చి నిజం చెప్పాలి' అని డిసైడ్ అవుతాడు. అప్పుడు కృష్ణ ఏం చేసింది అంతగా అనగా.. ముకుంద వాళ్ళ నాన్న నన్ను అరెస్ట్ చేయిస్తే కాపాడింది కదా అంటాడు. మీరా చాలా తేడా తనకు దూరంగా ఉంటే మంచిది అంటుంది. పొరపాటుగా ఒక మంచి మనిషిని తప్పుగా అర్థం చేసుకోవడం బాగోదని మురారి సర్ది చెప్పబోతాడు.

అమృత ఎంట్రీతో షాక్:కృష్ణ మాటలు విన్న తర్వాత మురారి సరోగసి మదర్ గురించి నిజం దాస్తాడు. అంతేకాదు, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వే తనని జాగ్రత్తగా చూసుకుంటావని అంటాడు. మరోవైపు, భవానీ అమెరికా నుంచి తన ఫ్రెండ్ అమృత వచ్చిందని చెప్పి ఇంట్లో అందరికీ తనని పరిచయం చేస్తుంది. తర్వాత భవానీ 'తను డాక్టర్. అమృత నిన్ను టెస్ట్ చేసి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది' అని కృష్ణతో అంటుంది. దీంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











