Krishna Mukunda Murari: అడ్డంగా దొరికిపోయిన కృష్ణ.. అంతలోనే ఊహించని మలుపు

అభిరుచిలో మార్పులు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:సరోగసి మదర్ గురించి చెప్పడంతో మీరాపై మురారికి ప్రేమ పెరిగిపోతుంది. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని అనడంతో పొంగిపోతాడు. మరోవైపు, ఆదర్శ్‌ను పడేయాలని ప్లాన్ చేసి విఫలం అవుతోన్న సంగీతకు మధు సలహాలు ఇస్తాడు. అప్పుడామె మీరా తన పెళ్లి చేస్తానన్న విషయం చెప్తుంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని కృష్ణకు చెప్తాడు. అప్పుడు వాళ్లిద్దరూ ఆమె డబుల్ గేమ్ ఆడుతుందని అనుకుంటారు. ఇక, మురారి.. మీరాను కారులో తీసుకుని రావడంతో అందరికీ కోపం వస్తుంది. అప్పుడు సరోగసి మదర్ ఆమెనని చెప్పకూడదని మురారి డిసైడ్ అయిపోతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 8th

అడ్డంగా దొరికిపోయిన కృష్ణ :అమృతతో కృష్ణను చెక్ చేయించాలని భవానీ అనుకుంటుంది. అప్పుడు మీరా 'చేయి పట్టుకుని నాడీ చూస్తే కృష్ణ గర్భవతి కాదని తెలిసిపోతుంది. నా సరోగసి ప్లాన్ బెడిసికొడుతుందేమో' అని టెన్షన్ పడుతుంది. తర్వాత 'తెలిస్తే తెలియనివ్వు.. సరోగసి గురించి మురారి అత్తయ్యకు చెప్తాడు. నా విలువ పెరుగుతుంది. కృష్ణ విలువ తగ్గిపోతుంది' అనుకుంటుంది. కానీ, కృష్ణ మాత్రం అమృతతో చెక్ చేయించుకోవడానికి అంగీకరించదు. భవానీ చెప్పినా వినిపించుకోకుండా అవసరం లేదని అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

రిపోర్టులు చూస్తాననడంతో:ఆ తర్వాత కృష్ణ నేను కూడా డాక్టర్‌ను అని అమృతతో అంటుంది. దీనికామె అవునా తనే డాక్టర్ అయితే ఇక నేను చూసేదీ ఏముంది అంటుంది. అప్పుడు భవానీ 'తను సీనియర్ గైనకాలజిస్ట్. తను టెస్ట్ చేస్తే తృప్తిగా ఉంటుంది' అని చెప్తుంది. దీంతో కృష్ణ పొద్దునే హాస్పిటల్‌కి వెళ్ళి టెస్ట్‌లు చేయించుకున్నానని చెప్తుంది. అప్పుడు అమృత 'సరే మీ పెద్దత్తయ్య తృప్తి కోసం చూస్తాను. ఆ రిపోర్ట్స్ ఇవ్వు' అంటుంది. దీంతో కృష్ణ 'మన బెడ్ రూమ్‌లో రిపోర్ట్స్ ఉన్నాయి వెళ్ళి తీసుకురండి' అని మురారిని ఇరికిస్తుంది. మురారి ఆమెను మనసులో తిట్టుకుంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode May 8th

తెలివిగా తప్పించుకుంది:కృష్ణ చెప్పడంతో మురారి 'పెద్దమ్మ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్తే ఇలా ఇరికించావ్ ఏంటి తింగరి' అనుకుంటాడు. తర్వాత కృష్ణ ఎక్కడ ఉన్నాయో చెప్పి రిపోర్ట్స్ ఇప్పిస్తుంది. ముందు జాగ్రత్తకు హ్యాట్సాఫ్ అనుకుంటుంది. అవి నిజమైన రిపోర్ట్స్ ఏంటా ముకుంద టెన్షన్‌గా చూస్తుంటుంది. ఇక, రిపోర్ట్స్ అమృత చూసి ప్రాబ్లం ఏమి లేదు అంతా బాగానే ఉందని చెప్తుంది. దీంతో భవానీ హ్యపీగా ఉంటుంది. దీంతో మీరాతో పాటు మురారి వాళ్లు ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత భవానీ పుట్టబోయే బిడ్డ బాగుండాలని పూజా చేస్తానని రమ్మంటుంది.

ముకుంద సంతోషంగానే:అక్కడ జరుగుతున్నది చూసిన తర్వాత మీరా 'ఇలా ఎన్ని రోజులు మ్యానేజ్ చేస్తుంది? తర్వాత అయినా దొరికిపోతుంది కదా. అప్పుడు అత్తయ్య తనని ఇంట్లో నుంచి తప్పని సరిగా గెంటేస్తుంది' అని మనసులోనే సంతోషపడుతుంది. తర్వాత ఆదర్శ్ వచ్చి ముకుందతో మాట్లాడతాడు. 'రెండు మూడు రోజులుగా సంతోషంగా కనిపిస్తున్నావు. నీ నవ్వు, నీ మొహంలో కనిపించే వెలుగు చెప్తుంది. నీ సంతోషానికి కారణం ఏంటో నాకు తెలుసు. ఆ సంతోషానికి కారణం రెండు రోజుల్లో నేనే చెప్తాను' అని అంటాడు. ముకుంద మురారి కోసం సంతోషపడుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 8th

మురారికి సర్ధి చెప్పింది:మురారి ఒంటరిగా ఉండి ఆలోచిస్తుంటే ముకుంద వచ్చి మాట్లాడుతుంది. అప్పుడు మురారి 'కృష్ణకు టెస్ట్ చేసి ఉంటే దొరికిపోయేది. టెన్షన్ పోయింది లేదంటే ఏమయ్యేది? నటించలేకపోతున్నాం. అందరినీ మోసం చేస్తున్నామని తట్టుకోలేకపోతున్నా' అంటాడు. దీంతో ముకుంద 'ఇంట్లో ఏదో పూజ చేస్తున్నారు కదా. అంతా సర్దుకుంటుందిలే' అని సర్ది చెప్తుంది. అప్పుడు మురారి 'అందరి దృష్టిలో మాకు పుట్టబోయే బిడ్డ కోసం పూజ చేస్తున్నట్టు. మా దృష్టిలో మా బిడ్డ, తనని మోసే తల్లి బాగుండటం కోసం' అంటాడు.

ఆదర్శ్‌కు మురారి సపోర్ట్:పంతులు వస్తే పూజ చేసేందుకు ముహూర్తం చూడమని భవానీ చెప్తుంది. మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. అంతలోనే ఆదర్స్, ముకుంద అప్పుడే షాపింగ్ నుంచి వస్తారు. అప్పుడు భవానీ ఎక్కడికి వెళ్లారని అడగడంతో ముకుందకు చీరలు కొనడానికి తీసుకెళ్లానని చెప్తాడు. రజిని వాళ్ళని చూసి కుళ్లుకుంటుంది. కానీ, మురారి మీరాకి చీరలు కొని మంచి పని చేశావని మెచ్చుకుంటాడు. మురారి.. మీరాని సపోర్ట్ చేయడం కృష్ణ సీరియస్‌గా చూస్తుంది. అసలు మీరా ఉద్దేశం ఏంటి? సంగీతకు ఆదర్శ్‌తో పెళ్లి చేస్తానని ఇలా చేయడమేంటి అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 8th

డ్రామా ఆడిన మురారి:భార్యను ఎలాగైనా కూల్ చేయాలని మురారి కాలు నొప్పి డ్రామా ఆడతాడు. కృష్ణ వచ్చి పట్టుకుంటేనే నొప్పి అన్నట్టు తెగ నటించేస్తాడు. అప్పుడామె ఎక్కడైనా పడ్డారా అంటే 'నీ ప్రేమలో పడ్డాను. సరోగసి అంటూ టెన్షన్‌గా ఉన్నాం. కాస్త రిలీఫ్ కావాలి కదా' అంటాడు. అప్పుడామె 'మన ప్రేమకు గుర్తుగా బిడ్డని నేనే మొస్తే ఇంకెంత సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఆ దేవుడికి ఇష్టం లేదు. అందుకే నాకు అదృష్టాన్ని దూరం చేశాడు' అని బాధపడుతుంది. దీనికతడు దేవుడు మనకు మంచి దారి చూపించాడు అందులో జాగ్రత్తగా నడవాలంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X