Krishna Mukunda Murari: నోరు జారి దొరికిపోయిన మీరా.. ఆయన చనిపోవడంతో.. కృష్ణ ప్లాన్ ఫెయిల్
గతంలో కంటే ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
అమృత ఇంటికి రావడంతో కృష్ణను చెక్ చేయమని భవానీ దేవి చెప్తుంది. కానీ, కృష్ణ మాత్రం తాను కూడా డాక్టర్‌నే అని, తనకు తెలుసు అంటూ కవర్ చేస్తుంది. కానీ, రిపోర్టులు అయినా చూపించమని అనడంతో మురారి వెళ్లి తీసుకొస్తాడు. అందులో బాగానే ఉందని అమృత చెప్తుంది. మురారి ఇంట్లో వాళ్లను మోసం చేస్తున్నానని బాధపడుతుంటే ముకుంద వచ్చి ధైర్యం చెప్తుంది. అనంతరం ఆదర్శ్ ఆమెకు చీరలు కొనుక్కొని తీసుకు రావడంతో అంతా షాక్ అవుతారు. కానీ, మురారి సపోర్ట్ చేస్తాడు. తర్వాత కృష్ణను కాకా పట్టేందుకు డ్రామా ఆడతాడు.

ఆమె ఎవరో మీకు తెలుసా?
కృష్ణ తల్లిని కాలేకపోతున్నా అని బాధపడుతుంది. దీంతో మురారి ఆమెకు ధైర్యం చెప్తాడు. అప్పుడే 'సరోగసి ప్రాసెస్‌లో మంచి అమ్మాయి దొరకడం ఎంత కష్టం. అలాంటిది ఒక అమ్మాయి దేవతలా దొరికింది కదా' అంటాడు. దీంతో కృష్ణ 'దేవత, మంచి అమ్మాయి అంటున్నారు అంటే మీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసు కదా' అంటుంది. దీంతో మురారి 'అదేమీ లేదు మన బిడ్డను తొమ్మిది నెలలు మోస్తుందంటే దేవత కదా' అంటాడు. తర్వాత మనసులో 'నిజంగా మీరా దేవత కదా' అని అనుకుంటాడు. అనంతరం కృష్ణ, మురారి ఆస్పత్రికి వెళ్తారు.

మీరాను చూసి షాకింగ్‌లో
ఆస్పత్రికి వెళ్లిన తర్వాత కృష్ణ 'సరోగసి మథర్‌ను కూడా ఇప్పుడే హాస్పిటల్‌కు పిలిచి ఉంటారు కదా. ఒకవేళ వస్తే డాక్టర్‌ను బతిమాలకుండానే చూసేయొచ్చు కదా' అంటుంది. అప్పుడే ముకుంద కూడా హాస్పిటల్‌కు వస్తుంది. మురారి మాత్రం 'ఆవిడ ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్న ఎవరైనా కావచ్చు' అంటూ అందరినీ చూపిస్తాడు. అప్పుడే మీరా రావడం చూసి మురారి షాక్ అవుతాడు. అంతేకాదు, 'తనను ముందే రమ్మని చెప్పాను కదా. ఇప్పుడు మీరాను చూస్తే కృష్ణకు డౌట్ వస్తుంది' అనుకుంటూ ఆమె కనిపించకుండా అడ్డుగా నిలబడతాడు.

నువ్వు దొరకడం అరుదు
కృష్ణ డాక్టర్ దగ్గర ఉండగా మురారి, మీరా మాట్లాడుకుంటారు. అప్పుడు మురారి 'నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అరుదు. అది మా అదృష్టం. నీకు చాలా థాంక్స్' అంటాడు. అప్పుడామె 'అనాథని అని అద్దె గర్భం మోస్తున్నానని వెల కట్టరు కదా' అని అడుగుతుంది. దీంతో మురారి 'వెల కట్టలేని అపురూపాలు కొన్ని ఉంటాయి అందులో నువ్వు ఒకటి. నువ్వు మా ఇంటి మనిషివి. నీకు వెల కట్టడం అంటే మాకు మేము వెలకట్టడమే' అంటాడు. మరోవైపు ఆదర్శ్ జాగింగ్‌కు వెళ్తూ ముకుంద గురించి అడుగుతాడు. అతడిని చూసి భవానీ మురిసిపోతుంది.
ముకుంద పెళ్లి.. గర్భం
ఆ తర్వాత భవానీ 'ఆదర్శ్ తనకోసం అంతగా ఆరాటపడుతుంటే ఇంక ఆలోచించడానికి ఏమి లేదు. సమయం చూసి ముకుందతో మాట్లాడాలి' అని ఫిక్స్ అవుతుంది. మరోవైపు సరోగసి ప్రాసెస్ ప్రారంభమయ్యిందని డాక్టర్ వైదేహి చెప్తుంది. ఎలాగైనా సరోగసి మథర్ ఎవరో తెలుసుకోవాలని కృష్ణ చూస్తుంది. ముకుంద మాత్రం తన కడుపులో మురారి బిడ్డ వచ్చాడని తెగ సంతోషపడుతూ 'నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఇదే. నా మురారి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది' అని సంబరపడుతుంది.

కృష్ణ ఫెయిల్.. రజినీతో
కృష్ణ సరోగసి మదర్ కోసం వెతుకుతూ ఆమెను కనిపెట్టడంలో ఫెయిల్ అవుతుంది. తర్వాత మురారితో ఈ విషయం చెప్పగా అతడు సీరియస్ అవుతాడు. మరోవైపు, రజినీ 'షాపింగ్ అని వాళ్ళు అలా తిరుగుతుంటే ఇక నా కూతురిని ఎలా పెళ్లి చేసుకుంటాడు' అని అనుకుంటుంది. వెంటనే కృష్ణను రజిని పిలిచి 'ఆదర్శ్ ముకుందకు చీరలు కొంటున్నాడు. తను ముకుందని ఇష్టపడుతున్నాడని అనడానికి ఇంకేం కావాలి? ముకుంద ఎలా ఉంటుంది? ఏ చీర కట్టుకుంటుందని చూస్తున్నాడు. అంత ఇష్టం ఉండబట్టే కదా తీసుకున్నాడు' అని అంటుంది.
నోరు జారిన ముకుంద
తర్వాత రజినీ 'ముకుంద, ఆదర్శ్ ప్రేమించుకుంటున్నారు. ముకుంద ఇదంతా కావాలని చేస్తుంది. నా కూతురిని పట్టించుకోవడం లేదు. డబుల్ గేమ్ ఆడింది. నేను అలాగే చేయవచ్చు కానీ వాళ్ళ ప్రేమ చెడగొట్టిన పాపం ఎందుకు మూటగట్టుకోవాలి' అని అనుకుంటుంది. ముకుంద ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళావని భవానీ అడుగుతుంది. ఫ్రెండ్‌ను కలవడానికని అబద్ధం చెప్తుంది. తర్వాత ఆదర్శ్ ఎదురుపడి హాస్పిటల్‌కు వెళ్ళిన పని అయిపోయిందా అంటే అయిపోయిందని నోరు జారుతుంది. దీంతో అతడు నువ్వు నిజం చెప్పేశావ్ ముకుంద అంటాడు.
ఆయన చనిపోయాడు
ముకుందతో ఆదర్శ్ 'పొద్దున కృష్ణ వాళ్ళు వెళ్ళిన టైమ్‌లోనే వెళ్ళావు. ఇప్పుడు వాళ్ళ వెనుకే తిరిగి వచ్చావు. అంటే వాళ్ళతో కలిసి హాస్పిటల్‌కు వెళ్ళినట్టే కదా. మా అమ్మకి చెప్పినట్టు అబద్ధం చెప్పొద్దు' అంటాడు. దీనికామె 'అవును వెళ్ళాను కానీ కృష్ణ వాళ్ళతో కలిసి కాదు. నేను ఇంతకముందు అద్దెకు ఉండే దాన్ని కదా ఆయనకు సీరియస్‌గా ఉందని అంటే వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి ఆయన చనిపోయాడు' అని చెప్తుంది. దీంతో ఆదర్శ్ అమ్మతో ఇదే చెప్పవచ్చు కదా అనగా.. 'ఇంట్లో పూజ జరుగుతుంది.. చనిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళాను అంటే బాగోదని చెప్పలేదు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











