Krishna Mukunda Murari: ముకుందతో మురారి పెళ్లి.. మళ్లీ గుర్తుకు వచ్చిన గతం.. అంతలోనే ప్రమాదం

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode November 1st

మంగళవారం ఎపిసోడ్‌లో ఏమైంది?: కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. మురారికి తన రూమ్ ఏదో తెలియక ఇబ్బంది పడుతుంటే ముకుంద వచ్చి తన రూమ్‌లోకి తీసుకు వెళ్తుంది. అప్పుడు భవానీ కూడా మురారి బాగయ్యే వరకూ చూసుకోమని చెప్తుంది. ఇక, ఔట్‌ హౌస్‌ను కృష్ణ శుభ్రం చేసుకుంటూ ఉండగా.. ముకుంద వచ్చి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు మురారి వచ్చి కృష్ణకు సహాయం చేస్తానని అంటాడు. దీంతో ఆమె ముకుందను ఇరికిస్తుంది. అప్పుడు తప్పక ముకుందనే మురారితో కలిసి రూమ్ అంతా క్లీన్ చేస్తుంది.

ముకుందతో మురారికి పెళ్లి: ఎప్పటికైనా కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కాబట్టి.. ముకుందను మురారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఈశ్వర్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ విషయాన్ని భవానీకి చెప్పమని ప్రసాద్‌తో అంటాడు. అప్పుడతను చెప్పగా.. ముకుంద గతంలో తనకు చెప్పిన విషయాలను భవానీ దేవి గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఇందులో ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పమని ప్రసాద్‌ను అడుగుతుంది.

మురారి గురించి ఆవేదనగా: భవానీ దేవి 'ఆదర్శ్ ఒకవేళ తిరిగి వస్తే ఇన్ని నిజాలు అతడికి తెలిస్తే ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతాడా' అని అనుమానిస్తుంది. దీనికి ప్రసాద్ 'మీరు అడిగితే త‌ప్ప‌కుండా ఆద‌ర్శ్ ఇంట్లోనే ఉంటాడు' అంటాడు. దీంతో భవానీ.. కృష్ణ చేసింది మ‌ర్చిపోయే మోస‌మా? అనగా మురారి త‌లరాత ఇంతే అని ప్ర‌సాద్ బాధ‌ప‌డ‌తాడు. అప్పుడు భవానీ దేవి 'మురారి త‌ల‌రాత ఇంతే అని వ‌దిలివేయాలా? లేదంటే ముకుంద‌తో అత‌డి పెళ్లి జ‌రిపించాలా' అని ఆలోచిస్తుంది.

ఓడినా మురారి మాటలతో: కృష్ణను దెబ్బకొట్టాలనుకుని బొక్కబోర్లా పడ్డ ముకుంద.. ఓడిపోయానని బాధ పడుతుంది. అప్పుడు ఎలాగైనా కృష్ణ‌ను అక్క‌డి నుంచి కూడా పంపించేయాల‌ని అనుకుంటుంది. అంతలోనే మురారికి 'డాక్ట‌ర్ అయి ఉండి కృష్ణ ఔట్‌ హౌజ్‌లో ఉండ‌టం ఏంటి' అని అనుకుంటాడు. కానీ ఆమెను అడ‌గ‌లేక‌పోతాడు. ఆ తర్వాత ముకుంద 'గ‌తం మ‌ర్చిపోయిన నన్ను ముకుంద అంద‌రితో క‌లిసిపోయేలా చేసింది. ఐ లైక్ హ‌ర్. గ్రేట్ హ్యూమ‌న్ బీయింగ్‌. ముకుంద మా ఇంటి మ‌నిషి' అంటాడు. దీనికి కృష్ణ ఇంటి మ‌నిషే కానీ సొంత మ‌నిషి కాదు క‌దా అంటుంది.

పేరు మార్చుకున్న కృష్ణ: తనను మురారి తరచూ డాక్టర్ డాక్టర్ అని పిలవడంతో అలా పిలవొద్దని కృష్ణ చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న ముకుంద.. కృష్ణ సొంత పేరు చెప్తుందేమో అని భయపడుతుంది. కానీ, కృష్ణ మాత్రం తన పేరు 'వేణి' అని మురారితో అంటుంది. దీంతో పేరు బాగుందని మురారి అంటాడు. మరోవైపు, ముకుందతో కృష్ణ చేసిన చాలెంజ్ గురించి తెలుసుకున్న రేవతి కోడలి తెగువకు సంతోష పడుతుంది. అంతేకాదు, 'నా కోడలు లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. తనను మురారిని ఆ దేవుడు ఎలాగైనా ఒక్కటి చేయాలి' అని కోరుకుంటుంది.

కృష్ణను చూస్తూ ఉండగా: కృష్ణ దగ్గర నుంచి వచ్చిన మురారికి ఆమెనే గుర్తుకు వస్తుంటుంది. పదే పదే ఆమెను చూడాలని పరితపిస్తుంటాడు. అప్పుడు అసలు ఆమెకు పెళ్లైందో లేదో అని అనుకుంటాడు. అదే సమయంలో కృష్ణ తన జీవితం కుదుటపడాలని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటుంది. అప్పుడలా ఆమెను మురారి చూస్తాడు. అప్పుడు వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాలని అనుకుంటాడు. అంతలోనే కాలు జారి కింద పడబోతాడు. దీంతో అందరూ కంగారుగా అక్కడకు వస్తారు. కృష్ణ కూడా పరుగున వస్తుంది. అప్పుడు మురారి హారతి కోసం వెళ్తుంటే ఇలా జరిగిందని చెప్తాడు.

కృష్ణకు భవానీ వార్నింగ్: మురారి వెళ్లిపోగానే భవానీ 'సిగ్గు, శ‌రం లేకుండా వ‌ద్ద‌న్నా ఇక్క‌డే ఎలా ఉంటున్నావు? ఈ ఇంట్లోకి ఎందుకొచ్చావు? మురారి ఏం చేద్దామ‌ని వ‌చ్చావు వెళ్లిపో' అని కృష్ణను తిడుతుంది. అప్పుడు ఆమె ఎంత చెప్పినా పట్టించుకోదు. దీంతో కృష్ణ 'మురారికి గ‌తం గుర్తు రాకుండా గాజుబొమ్మ‌లా ఎందుకు చూస్తున్నారు? అత‌డి జీవితాంతం ఓ భ్ర‌మలోనే ఉంచేయాల‌ని అనుకుంటున్నారా' అంటూ భవానీని అడుగుతుంది. దీంతో భవానీ 'నిన్ను పూర్తిగా మర్చిపోయినప్పుడే మురారికి గతం గుర్తు చేస్తా. ఎక్కువ చేస్తే ఔట్ హౌస్ నుంచి కూడా పంపేస్తా' అని వార్నింగ్ ఇస్తుంది.

అన్నీ చెరిపేసి.. యూఎస్: మురారి కోసం త‌న గ‌దిని ఇచ్చిన ముకుంద.. తర్వాత కృష్ణ గ‌దికి షిఫ్ట్ అవుతుంది. ఆ రూమ్‌లో కృష్ణ జ్ఞాప‌కాలు ఏమీ లేకుండా తీసేస్తుంది. అప్పుడే కృష్ణ త‌న‌కు గతంలో ఇచ్చిన కృష్ణుడి విగ్ర‌హం చూసి మురారి గ‌తం గుర్తుకు వస్తుంది. అలా కృష్ణ గురించి ఆలోచిస్తూ మురారి మ‌ళ్లీ స్ట్రెయిన్ అవుతాడు. ముకుంద‌తో పాటు భ‌వానీ, రేవ‌తి కంగారు ప‌డ‌తారు. అనంతరం కృష్ణ వండిన బిర్యానీ తినడానికి మురారి వెళ్తాడు. అది చూసిన భవానీ మురారిని ట్రీట్‌మెంట్ కోసం యూఎస్‌కు పంపించాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X